Other languages: EnglishHindiTamilMalayalamKannada
సుమంగలం మంగలమీశ్వరాయ తే
సుమంగలం మంగలమచ్యుతాయ తే.
సుమంగలం మంగలమంతరాత్మనే
సుమంగలం మంగలమబ్జనాభ తే.
సుమంగలం శ్రీనిలయోరువక్షసే
సుమంగలం పద్మభవాదిసేవితే.
సుమంగలం పద్మజగన్నివాసినే
సుమంగలం చాశ్రితముక్తిదాయినే.
చాణూరదర్పఘ్నసుబాహుదండయోః
సుమంగలం మంగలమాదిపూరుష.
బాలార్కకోటిప్రతిమాయ తే విభో
చక్రాయ దైత్యేంద్రవినాశహేతవే.
శంఖాయ కోటీందుసమానతేజసే
శార్ఙ్గాయ రత్నోజ్జ్వలదివ్యరూపిణే.
ఖడ్గాయ విద్యామయవిగ్రహాయ తే
సుమంగలం మంగలమస్తు తే విభో.
తదావయోస్తత్త్వవిశిష్టశేషిణే
శేషిత్వసంబంధనిబోధనాయ తే.
యన్మంగలానాం చ సుమంగలాయ తే
పునః పునర్మంగలమస్తు సంతతం.