శంకరాచార్య భుజంగ స్తోత్రం

కృపాసాగరాయాశుకావ్యప్రదాయ ప్రణమ్రాఖిలాభీష్టసందాయకాయ.
యతీంద్రైరుపాస్యాంఘ్రిపాథోరుహాయ ప్రబోధప్రదాత్రే నమః శంకరాయ.
చిదానందరూపాయ చిన్ముద్రికోద్యత్కరాయేశపర్యాయరూపాయ తుభ్యం.
ముదా గీయమానాయ వేదోత్తమాంగైః శ్రితానందదాత్రే నమః శంకరాయ.
జటాజూటమధ్యే పురా యా సురాణాం ధునీ సాద్య కర్మందిరూపస్య శంభోః.
గలే మల్లికామాలికావ్యాజతస్తే విభాతీతి మన్యే గురో కిం తథైవ.
నఖేందుప్రభాధూతనమ్రాలిహార్దాంధకార- వ్రజాయాబ్జమందస్మితాయ.
మహామోహపాథోనిధేర్బాడబాయ ప్రశాంతాయ కుర్మో నమః శంకరాయ.
ప్రణమ్రాంతరంగాబ్జబోధప్రదాత్రే దివారాత్రమవ్యాహతోస్రాయ కామం.
క్షపేశాయ చిత్రాయ లక్ష్మక్షయాభ్యాం విహీనాయ కుర్మో నమః శంకరాయ.
ప్రణమ్రాస్యపాథోజమోదప్రదాత్రే సదాంతస్తమస్తోమసంహారకర్త్రే.
రజన్యామపీద్ధప్రకాశాయ కుర్మో హ్యపూర్వాయ పూష్ణే నమః శంకరాయ.
నతానాం హృదబ్జాని ఫుల్లాని శీఘ్రం కరోమ్యాశు యోగప్రదానేన నూనం.
ప్రబోధాయ చేత్థం సరోజాని ధత్సే ప్రఫుల్లాని కిం భో గురో బ్రూహి మహ్యం.
ప్రభాధూతచంద్రాయుతాయాఖిలేష్టప్రదాయానతానాం సమూహాయ శీఘ్రం.
ప్రతీపాయ నమ్రౌఘదుఃఖాఘపంక్తేర్ముదా సర్వదా స్యాన్నమః శంకరాయ.
వినిష్కాసితానీశ తత్త్వావబోధాన్నతానాం మనోభ్యో హ్యనన్యాశ్రయాణి.
రజాంసి ప్రపన్నాని పాదాంబుజాతం గురో రక్తవస్త్రాపదేశాద్బిభర్షి.
మతేర్వేదశీర్షాధ్వసంప్రాపకాయానతానాం జనానాం కృపార్ద్రైః కటాక్షైః.
తతేః పాపబృందస్య శీఘ్రం నిహంత్రే స్మితాస్యాయ కుర్మో నమః శంకరాయ.
సుపర్వోక్తిగంధేన హీనాయ తూర్ణం పురా తోటకాయాఖిలజ్ఞానదాత్రే.
ప్రవాలీయగర్వాపహారస్య కర్త్రే పదాబ్జమ్రదిమ్నా నమః శంకరాయ.
భవాంభోధిమగ్నాంజనాందుఃఖ- యుక్తాంజవాదుద్దిధీర్షుర్భవా- నిత్యహోఽహం.
విదిత్వా హి తే కీర్తిమన్యాదృశాం భో సుఖం నిర్విశంకః స్వపిమ్యస్తయత్నః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |