సుబ్రహ్మణ్య ధ్యాన స్తోత్రం

షడాననం కుంకుమరక్తవర్ణం
మహామతిం దివ్యమయూరవాహనం.
రుద్రస్యసూనుం సురసైన్యనాథం
గుహం సదాఽహం శరణం ప్రపద్యే.
కనకకుండలమండితషణ్ముఖం
కనకరాజివిరాజితలోచనం.
నిశితశస్త్రశరాసనధారిణం
శరవణోత్భవమీశసుతం భజే.
సిందూరారుణమిందుకాంతివదనం కేయూరహారాదిభి-
ర్దివ్యైరాభరణైర్విభూషితతనుం స్వర్గస్యసౌఖ్యప్రదం.
అంభోజాభయశక్తి కుక్కుటధరం రక్తాంగరాగాంశుకం
సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం సర్వార్థసంసిద్ధిదం.
వందే శక్తిధరం శివాత్మతనయం వందే పులిందాపతిం
వందే భానుసహస్రమద్బుదనిభం వందే మయూరాసనం.
వందే కుక్కుటకేతనం సురవరం వందే కృపాంభోనిధిం
వందే కల్పకపుష్పశైలనిలయం వందే గుహం షణ్ముఖం.
ద్విషడ్భుజం షణ్ముఖమంబికాసుతం
కుమారమాదిత్యసమానతేజసం.
వందే మయూరాసనమగ్నిసంభవం
సేనాన్యమద్యాహమభీష్టసిద్ధయే.
ధ్యాయేత్ షణ్ముఖమిందు కోటిసదృశం రత్నప్రభాశోభితం
బాలార్కద్యుతి షట్కిరీటవిలసత్కేయూరహారానన్వితం.
కర్ణాలంకృత కుండలప్రవిలసత్కంఠస్థలైః శోభితం
కాంచీ కంకణ కింకిణీరవయుతం శృంగారసారోదయం.
ధ్యాయేదీప్సితసిద్ధితం శివసుతం శ్రీద్వాదశాక్షం గుహం
బాణంకేటకమంకుశంచవరదం పాశం ధనుశ్చక్రకం.
వజ్రంశక్తిమసింత్రిశూలమభయం దోర్భిర్ధృతం షణ్ముఖం
భాస్వచ్ఛత్రమయూరవాహసుభగం చిత్రాంబరాలంకృతం.
గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం
సుబ్రహ్మణ్యం సురేశం గుహమచలదిదం రుద్రతేజస్వరూపం.
సేనాన్యం తారకఘ్నం గజముఖసహజం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసహితం దేవదేవం నమామి.
షణ్ముఖం ద్వాదశభుజం ద్వాదశాక్షం శిఖిధ్వజం.
శక్తిద్వయసమాయుక్తం వామదక్షిణపార్శ్వయోః.
శక్తింశూలం తథా ఖడ్గం ఖేటంచాపంశరం తథా.
ఘంటాం చ కుక్కుటంచైవపాశంచైవతథాంకుశం.
అభయం వరదంచైవ ధారయాంతం కరాంబుజైః.
మహాబలం మహావీర్యం శిఖివాహం శిఖిప్రభం.
కిరీటకుండలోపేతం ఖండితోద్దండతారకం.
మండలీకృతకోదండం కాండైః క్రౌంచధరాధరం.
దారయంతం దురాధర్షం దైత్యదానవరాక్షసైః.
దేవసేనాపతిం దేవకార్యైకనిరతం ప్రభుం.
మహాదేవతనూజాతం మదనాయుతసుందరం.
చింతయే హృదయాంభోజే కుమారమమితేజసం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

66.0K

Comments Telugu

euw7n
వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

సులభంగా నావిగేట్ 😊 -హరీష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |