సుబ్రహ్మణ్య గద్యం

పురహరనందన రిపుకులభంజన దినకరకోటిరూప
పరిహృతలోకతాప శిఖీంద్రవాహన మహేంద్రపాలన
విధృతసకలభువనమూల విధుతనిఖిలదనుజతూల
తాపససమారాధిత పాపజవికారాజిత
కారుణ్యసలిలపూరాధార మయూరవరవాహన మహేంద్రగిరికేతన
భక్తిపరగమ్య శక్తికరరమ్య పరిపాలితనాక
పురశాసనపాక నిఖిలలోకనాయక
గిరివిదారిసాయక మహాదేవభాగధేయ
వినతశోకనివారణ వివిధలోకకారణ సురవైరికాల పురవైరిబాల భవబంధనవిమోచన దలదంబుజవిలోచన కరుణామృతరససాగర
తరుణామృతకరశేఖర వల్లీమానహారవేష
మల్లీమాలభారికేశ పరిపాలితవిబుధలోక
పరికాలితవినతశోక ముఖవిజితచందిర
నిఖిలగుణమందిర భానుకోటిసదృశరూప
వితృన్మనోహారిమందహాస రిపుశిరోదారిచంద్రహాస
శ్రుతికలితమణికుండల రుచివిజితరవిమండల
భుజవరవిజితసాల భజనపరమనుజపాల
నవవీరసంసేవిత రణధీర సంభావితమనోహరశీల
మహేంద్రారికీల కుసుమవిశదహాస కలశిఖరనివాస
విజితకరణమునిసేవిత విగతమరణజనిభాషిత
స్కందపురనివాస నందనకృతవిలాస కమలాసనవినత
చతురాగమవినుత కలిమలవిహీన కృతసేవనసరసిజనికాశశుభలోచన అహార్యానరధీర అనార్యానరదూర విదలితరోగజాల విరచితభోగమూల
భోగీంద్రభాసిత యోగీంద్రభావిత పాకశాసనపరిపూజిత
నాకవాసినికరసేవిత విద్రుతవిద్యాధర
విద్రుమహృద్యాధర దలితదనుజవేతండ
విబుధవరదకోదండ పరిపాలితభూసుర
మణిభూషణభాసుర అతిరమ్యస్వభావ
శ్రుతిగమ్యప్రభావ లీలావిశేషతోషితశంకర
సుమసమరదన శశధరవదన విజయీభవ విజయీభవ

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

72.9K

Comments Telugu

2ie3u
రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |