రామచంద్రాయ జనకరాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహితమంగలం
కోసలేశాయ మందహాసదాసపోషణాయ
వాసవాదివినుతసద్వరాయ మంగలం
చారుకుంకుమోపేతచందనాదిచర్చితాయ
హారకటకశోభితాయ భూరిమంగలం
లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ
జలజసదృశదేహాయ చారుమంగలం
దేవకీసుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజగురువరాయ భవ్యమంగలం
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాతవాహనాయ అతులమంగలం
విమలరూపాయ వివిధవేదాంతవేద్యాయ
సుముఖచిత్తకామితాయ శుభ్రదమంగలం
రామదాసాయ మృదులహృదయకమలవాసాయ
స్వామిభద్రగిరివరాయ సర్వమంగలం