శృంగాద్రివాసాయ విధిప్రియాయ కారుణ్యవారాంబుధయే నతాయ.
విజ్ఞానదాయాఖిలభోగదాయ శ్రీశారదాఖ్యాయ నమో మహిమ్నే.
తుంగాతటావాసకృతాదరాయ భృంగాలివిద్వేషికచోజ్జ్వలాయ.
అంగాధరీభూతమనోజ్ఞహేమ్నే శృంగారసీమ్నేఽస్తు నమో మహిమ్నే.
వీణాలసత్పాణిసరోరుహాయ శోణాధరాయాఖిలభాగ్యదాయ.
కాణాదశాస్త్రప్రముఖేషు చండప్రజ్ఞాప్రదాయాస్తు నమో మహిమ్నే.
చంద్రప్రభాయేశసహోదరాయ చంద్రార్భకాలంకృతమస్తకాయ.
ఇంద్రాదిదేవోత్తమపూజితాయ కారుణ్యసాంద్రాయ నమో మహిమ్నే.