గంగా మంగల స్తోత్రం

నమస్తుభ్యం వరే గంగే మోక్షసౌమంగలావహే.
ప్రసీద మే నమో మాతర్వస మే సహ సర్వదా.
గంగా భాగీరథీ మాతా గోముఖీ సత్సుదర్శినీ.
భగీరథతపఃపూర్ణా గిరీశశీర్షవాహినీ.
గగనావతరా గంగా గంభీరస్వరఘోషిణీ.
గతితాలసుగాప్లావా గమనాద్భుతగాలయా.
గంగా హిమాపగా దివ్యా గమనారంభగోముఖీ.
గంగోత్తరీ తపస్తీర్థా గభీరదరివాహినీ.
గంగాహరిశిలారూపా గహనాంతరఘర్ఘరా.
గమనోత్తరకాశీ చ గతినిమ్నసుసంగమా.
గంగాభాగీరథీయుక్తాగంభీరాలకనందభా.
గంగా దేవప్రయాగా మా గభీరార్చితరాఘవా.
గతనిమ్నహృషీకేశా గంగాహరిపదోదకా.
గంగాగతహరిద్వారా గగనాగసమాగతా.
గతిప్రయాగసుక్షేత్రా గంగార్కతనయాయుతా.
గతమానవపాపా చ గంగా కాశీపురాగతా.
గహనాఘవినాశా చ గత్యుత్తమసుఖావనీ.
గతికాలీనివాసా చ గంగాసాగరసంగతా.
గంగా హిమసమావాహా గంభీరనిధిసాలయా.
గద్యపద్యనుతాగీతా గద్యపద్యప్రవాహిణీ.
గానపుష్పార్చితా గంగా గాహితాగహ్వగహ్వరా
గాయగాంభీర్యమాధుర్యా గాయమాధుర్యవాగ్వరా.
నమస్తే తుహినే గంగే నీహారమయనిర్ఝరి.
గంగాసహస్రవాగ్రూపే నమస్తే మానసాలయే.
మంగలం పుణ్యగంగే తే సహస్రశ్లోకసంస్ఫురే.
సహస్రాయుతసత్కీర్తే సత్త్వస్ఫూర్తే సుమంగలం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |