మఘా నక్షత్రం

Magha Nakshatra symbol throne

 

సింహ రాశి 0 డిగ్రీల నుండి 13 డిగ్రీల 20 నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రాన్ని మఘా (मघा) అంటారు. 

వేద ఖగోళ శాస్త్రంలో ఇది పదవ నక్షత్రం. 

ఆధునిక ఖగోళ శాస్త్రంలో, మఘా Regulusకు అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

మఘా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు:

  • జిజ్ఞాసువు
  • స్వీయ గౌరవం
  • పనిలో నేర్పరి. చిన్నబుచ్చుకునేవారు. నీతిమంతులు
  • అందమైనవారు.
  • సంపన్నులు
  • ఇతరుల కింద పనిచేయడం ఇష్టం ఉండదు
  • వారు ఏమనుకుంటున్నారో బహిరంగంగా వ్యక్తపరుస్తారు
  • జీవితం ఆనందింస్తారు
  • పొగిడే ధోరణి
  • రహస్యాలు దాచుకుంటారు
  • అధికారుల నుండి మద్దతు ఉంటుంది
  • మంచి ప్రజా సంబంధాలు ఉంటాయి
  • ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది
  • బలంగా ఉంటారు
  • బాథ్యతలు వహిస్తారు
  • క్రీడాకారితనం
  • సహాయపరులు
  • విశ్వసనీయమైనవారు
  • ధైర్యవంతులు. ప్రతిష్టాత్మకమైనవారు
  • పోరాడే ధోరణి ఉంటాయి
  • శృంగారవంతులు

ప్రతికూల నక్షత్రాలు

  • ఉత్తర ఫల్గుణి
  • చిత్త
  • విశాఖ
  • పూర్వ భాద్రపద - మీన రాశి
  • ఉత్తర భాద్రపద
  • రేవతి

మఘా నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

ఆరోగ్య సమస్యలు

మఘా నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు:

  • గుండె జబ్బులు
  • వెన్నునొప్పి
  • దడ దడ
  • మూర్ఛ
  • మూత్రపిండంలో రాయి
  • కలరా
  • మానసిక రుగ్మతలు

అనుకూలమైన కెరీర్ 

మఘా నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

  • కాంట్రాక్టర్
  • మందులు మరియు రసాయనాలు
  • క్రిమినాలజీ
  • రక్షణ సేవ
  • వైద్యుం
  • అనుకరణ నగలు.
  • ఆయుధాలు

మఘా నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

అనుకూలంగా ఉండదు. 

అదృష్ట రాయి

వైడూర్యం 

అనుకూలమైన రంగు

ఎరుపు. 

మఘా నక్షత్రానికి పేర్లు

మఘా నక్షత్రానికి అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

  • మొదటి చరణం- మా.
  • రెండవ చరణం- మీ.
  • మూడవ చరణం - మూ.
  • నాల్గవ చరణం - మే 

నామకరణం సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్రం పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్యల పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. 

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

మఘా నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరుతో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - 

త, థ, ద, ధ, న,  య, ర, ల, వ, ఎ, ఐ, హ.

వివాహం

మఘా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ధన్యులుగా భావిస్తారు. 

వారికి మంచి వైవాహిక జీవితం ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది.

నివారణలు

సూర్య, మంగళ/కుజ, బృహస్పతి కాలాలు సాధారణంగా మఘా నక్షత్రంలో జన్మించిన వారికి ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు.

మఘా నక్షత్రం 

  • ప్రభువు - పూర్వీకులు
  • పాలించే గ్రహం - కేతువు
  • జంతువు - ఎలుక
  • చెట్టు - మర్రి
  • పక్షి - జెముడుకాకి
  • భూతం - జలం
  • గణం - అసుర
  • యోని - ఎలుక (మగ)
  • నాడి - అంత్య
  • చిహ్నం - సింహాసనం

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |