మూల నక్షత్రం

Mula Nakshatra symbol elephant goad

 

ధనస్సు రాశి 0 డిగ్రీల 13 డిగ్రీల 20 నిమిషాల నుండి వ్యాపించే నక్షత్రాన్ని మూల అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది 19వ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, ములా అనేదిε Larawag, ζ, η, θ Sargas, ι, κ, λ Shaula, μ and ν Jabbah Scorpionisకు అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు 

మూల నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు: 

  • అహంభావి
  • గౌరవనీయులు
  • సంపన్నులు
  • మృదుస్వభావి
  • శాంతియుతమైనవారు
  • కొన్నిసార్లు అశాంతి
  • జీవితాన్ని ఆశ్వాదిస్తారు
  • ఖర్చుపెట్టుతనం
  • స్వతంత్ర ఆలోచనాపరులు
  • పనిలో నేర్పరితనం
  • ఆధ్యాత్మిక ఆధారితవంతులు
  • నీతిమంతులు
  • పుణ్యాత్ములు
  • సహాయకారితనం
  • దయాదులు
  • అదృష్టవంతులు
  • ధైర్యవంతులు
  • నాయకత్వపు లక్షణాలు
  • పట్టుదలగలవారు
  • చట్టాన్ని గౌరవించేవారు
  • తండ్రి నుంచి పెద్దగా సపోర్ట్ ఉండదు
  • ధార్మికమైనవారు
  • ఓర్పుతనం
  • ఆశావాది.
  • ఆప్యాయంగా ఉంటారు
  • ఉల్లాసంగా ఉంటారు
  • మూఢనమ్మకస్తులు

ప్రతికూల నక్షత్రాలు

  • ఉత్తరాషాడ
  • ధనిష్ఠ
  • పూర్వాభాద్ర
  • పునర్వసు - కర్క రాశి 
  • పుష్యమి
  • ఆశ్లేష

మూల నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా మనివారించాలి.

ఆరోగ్య సమస్యలు

 మూల నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు:

  • వెన్నునొప్పి
  • ఆర్థరైటిస్
  • శ్వాసకోశ వ్యాధులు
  • అల్ప రక్తపోటు
  • మానసిక రుగ్మతలు

అనుకూలమైన కెరీర్

మూల నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

  • ఆధ్యాత్మికత
  • జ్యోతిష్యం
  • పౌరహిత్యం
  • కథలు చెప్పడం
  •  దౌత్యవేత్త
  •  వ్యాఖ్యాత
  •  వైద్యం
  •  మందులు
  •  సలహాదారు
  •  సామాజిక సేవ
  •  న్యాయవాద వృత్తి
  •  రాజకీయం
  •  జర్నలిస్ట్

మూల నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

ధరించరాదు 

అదృష్ట రాయి

వైడూర్యం 

అనుకూలమైన రంగులు

తెలుపు, పసుపు

మూల నక్షత్రానికి పేర్లు

మూల నక్షత్రం కోసం అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం: 

  • మొదటి చరణం - యే. 
  • రెండవ చరణం - యో.
  • మూడవ చరణం - భా
  • నాల్గవ చరణం - భీ

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాత-నానమ్మల పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. 

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

మూలా నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - ఉ, ఊ, ఋ, ష, ఎ, ఐ, హ, చ, ఛ, జ, ఝ, ఞ.

వివాహం

మూల నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆధిపత్యం వహించగలరు. 

వారి వైవాహిక జీవితం ఇబ్బందికరంగా ఉండవచ్చు.

నివారణలు

మూల నక్షత్రంలో జన్మించిన వారికి సూర్య, మంగళ/కుజ, మరియు గురు/బృహస్పతి కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు -

మంత్రం

ఓం నిరృతయే నమః 

మూల నక్షత్రం

  • భగవంతుడు - నిరృతి
  • పాలించే గ్రహం - కేతువు
  • జంతువు - కుక్క
  • చెట్టు - ధూప దామర
  • పక్షి - కోడి
  •  భూతం - వాయు
  •  గణం - అసుర 
  • యోని - కుక్క (పురుషుడు)
  • నాడి - ఆద్య
  • చిహ్నం - ఏనుగు యొక్క అంకుశం

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |