రేవతి నక్షత్రం

Revati nakshatra symbol fish

మీన రాశి 16 డిగ్రీల 40 నిమిషాల నుండి 30 డిగ్రీల వరకు వ్యాపించే నక్షత్రాన్ని రేవతి  అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది 27వ నక్షత్రం. 

ఆధునిక ఖగోళ శాస్త్రంలో, రేవతి Lyraకు అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

రేవతి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు: 

  • తెలివైనవారు.
  • లాజికల్ గా ఉంటారు.
  • హేతుబద్ధముగా ఉంటారు.
  • స్వయం ఆశ్రితులు.
  • ధైర్యవంతులు.
  • ఆరోగ్యవంతులు.
  • అధిక అర్హత ఉంటుంది.
  • ఆధ్యాత్మికంగా ఉంటారు.
  • నీతిమంతులు.
  • కష్టపడి పనిచేసేవారు.
  • సహాయకారిగా ఉంటారు.
  • గౌరవనీయులు.
  • చంచల బుద్ధి కలవారు.

ప్రతికూల నక్షత్రాలు

  • భరణి.
  • రోహిణి.
  • అరుద్ర.
  • చిత్త - తులా రాశి. 
  • స్వాతి.
  • విశాఖ - తులా రాశి 

రేవతి నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి. 

ఆరోగ్య సమస్యలు

రేవతి నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు:

  • కాలి నొప్పి.
  • కాలు వైకల్యాలు.
  • పేగు పూతలు.
  • వినికిడి సమస్యలు.
  • చెవి ఇన్ఫెక్షన్.
  • కిడ్నీ సమస్యలు.
  • స్ట్రోక్.

అనుకూలమైన కెరీర్

రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

  • దూతగా.
  • ఎలక్ట్రానిక్ పరికరాలు.
  • జర్నలిజం.
  • ప్రచురణ.
  • మతం.
  • చట్టపరమైన రచనలు.
  • న్యాయవాద వృత్తి.
  • ప్రకటన.
  • బోధన.
  • రాజకీయం.
  • జ్యోతిష్యం.
  • గణితం.
  • కమీషన్ ఏజెంట్.
  • మధ్యవర్తిగా.
  • బ్యాంకింగ్.
  • అంతర్జాతీయ వ్యాపారం.
  • ఆడిటర్.
  • గ్రాఫాలజిస్ట్.
  • వేలిముద్ర నిపుణులు.

రేవతి నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

ధరించరాదు.

అదృష్ట రాయి

పచ్చ.

అనుకూలమైన రంగులు

ఆకుపచ్చ, పసుపు.

రేవతి నక్షత్రానికి పేర్లు

రేవతి నక్షత్రం కోసం అవకాహదాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

  • మొదటి చరణం - దే.
  • రెండవ చరణం - దో.
  • మూడవ చరణం - చా.
  • నాల్గవ చరణం - చీ.

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్య-నానమ్మల పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

రేవతి నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - 

ఒ, ఔ, క, ఖ, గ, ఘ, ప, ఫ, బ, భ, మ.

వివాహం

వివాహం, సాధారణంగా, సంతోషంగా మరియు శాంతియుతంగా ఉంటుంది. 

రేవతిలో జన్మించిన స్త్రీలు గొప్పవారు మరియు ఆధ్యాత్మిక దృష్టిని కలిగి ఉంటారు. 

నివారణలు

రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి చంద్ర, శుక్ర, రాహు కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు.

రేవతి నక్షత్రం

  • భగవంతుడు - పూష.
  • పాలించే గ్రహం - బుధుడు. 
  • జంతువు - ఏనుగు.
  • చెట్టు - ఇప్ప
  • పక్షి - నెమలి.
  • భూతం - ఆకాశం.
  • గణం - దేవ.
  • యోని - ఏనుగు (ఆడ).
  • నాడి - అంత్య.
  • చిహ్నం - చేప.

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |