శతభిష నక్షత్రం

Shatabhisha Nakshatra symbol circle

కుంభ రాశి 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 20 డిగ్రీల వరకు వ్యాపించే నక్షత్రాన్ని శతభిష  అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది 24వ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, శతభిష γ Aquarii Sadachbiaకు అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు 

శతభిష నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు: 

  • స్వతంత్ర ఆలోచనాపరులు.
  • చురుకుగా ఉంటారు. 
  • గౌరవప్రదమైన ప్రవర్తన కలిగి ఉంటారు.
  • ఆదర్శప్రాయమైనవారు. 
  • ధార్మికమైనవారు.
  • ప్రత్యర్థులను ఓడించగల సమర్థులు.
  • సాహసోపేతంగా ఉంటారు.
  •  స్పష్టంగా మాట్లాడే ధైర్యం.  
  • ఎందరో శత్రువులు ఉంటారు. 
  • సాంప్రదాయకంగా ఉంటారు.
  • క్షుద్ర విద్యల పట్ల ఆసక్తి.
  • ఆధ్యాత్మికంగా ఉంటారు.
  • సహాయకారిగా ఉంటారు.
  • తల్లితో ఎక్కువ అనుబంధం ఉంటుంది.
  • నిజాయితీపరులు.
  •  ధైర్యవంతులు.

ప్రతికూల  నక్షత్రాలు

  • ఉత్తరాభాద్ర.
  •  అశ్విని.
  •  కృత్తికా.
  •  ఉత్తర - కన్యా రాశి
  •  హస్త.
  •  చిత్త-కన్యా రాశి.

 శతభిష నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

ఆరోగ్య సమస్యలు

 శతభిష నక్షత్రంలో జన్మించిన వారు ఈ ఆరోగ్య సమస్యలకు గురవుతారు: 

  • ఆర్థరైటిస్. 
  • అధిక రక్త పోటు.
  •  గుండె సమస్యలు.
  •  కాలు ఫ్రాక్చర్.
  •  తామర.
  •  కుష్టు వ్యాధి.

అనుకూలమైన కెరీర్

శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

  • జ్యోతిష్యం.
  • శాస్త్రవేత్త.
  • విద్యుత్ సంబంధిత.
  • అణు శాస్త్రం.
  • విమానయానం.
  • గాలి శక్తి. 
  • మెకానిక్.
  • ప్రయోగశాల.
  • తోలు.
  • గణాంకాలు.
  • ప్రజా పంపిణీ.
  • జైలు అధికారి.
  • అనువాదకులు.
  • వ్యాఖ్యాత.
  • రహస్య ఏజెంట్.

శతభిష నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా?

ధరించవచ్చు 

అదృష్ట రాయి

గోమేధికం

అనుకూలమైన రంగులు

నలుపు.

శతభిష నక్షత్రానికి పేర్లు

శతభిష నక్షత్రానికి అవకాహదాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

  • మొదటి చరణం - గో.
  • రెండవ చరణం - సా.
  • మూడవ చరణం - సీ.
  • నాల్గవ చరణం - సూ.

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్యల -నానమ్మల పేర్లను ఉంచుతారు. ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

శతభిష నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - 

ఎ, ఐ, హ, అం, క్ష, త, థ, ద, ధ, న.

వివాహం

వివాహం సాధారణంగా, సంతోషంగా మరియు సంపన్నంగా ఉంటుంది. 

శతభిషలో జన్మించిన స్త్రీలకు వివాహ సంబంధమైన ఇబ్బందులు ఎదురవుతాయి.

నివారణలు

శతభిష నక్షత్రంలో పుట్టిన వారికి సూర్య, శని, కేతువుల కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు. 

మంత్రం:-

 ఓం వరుణాయ నమః 

శతభిష నక్షత్రం

  • భగవంతుడు - వరుణుడు
  • పాలించే గ్రహం - రాహువు
  • జంతువు - గుర్రం.
  • చెట్టు - కదంబ.
  • పక్షి - నెమలి.
  • భూతం - ఆకాశం.
  • గణం - అసుర.
  • యోని - గుర్రం (ఆడ).
  • నాడి - ఆద్య.
  • చిహ్నం - వృత్తం

 

 

 

Video - Shatabhisha Nakshatra Mantra 

 

Shatabhisha Nakshatra Mantra

 

 

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize