ఉత్తరాభాద్ర నక్షత్రం

Uttara Bhadra Nakshatra symbol twins

మీన రాశి 3 డిగ్రీల 20 నిమిషాల నుండి 16 డిగ్రీల 40 నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రాన్ని ఉత్తరాభాద్ర అంటారు. 

వేద ఖగోళ శాస్త్రంలో ఇది 26వ నక్షత్రం. 

ఆధునిక ఖగోళ శాస్త్రంలో, ఉత్తరాభాద్ర  γ Algenib Pegasi and α Alpheratz Andromedaeకి అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు:

  • పుణ్యాత్ములు.
  • ఆధ్యాత్మికంగా ఉంటారు.
  • మధురంగా మాట్లాడుతారు.
  • నీతిమంతులు. 
  • నిజాయితీపరులు.
  • దయాదులు.
  • సానుభూతిపరులు.
  •  అమాయకంగా ఉంటారు.
  •  ఆకర్షణీయమైన స్వభావం.
  •  సహాయకారితనం.
  •  అర్థం చేసుకోవడం కష్టం.
  • స్వీయ నియంత్రణ లేకపోవడం.
  • తక్కువ  ధైర్యంవంతులు.
  •  బద్దకస్తులు.

ప్రతికూల నక్షత్రాలు

  • అశ్విని.
  • కృత్తికా.
  • మృగశిర.
  • చిత్త - తులారాశి.
  • స్వాతి.
  • విశాఖ - తులారాశి.

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి. 

ఆరోగ్య సమస్యలు

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు: 

  • ఆర్థరైటిస్.
  • కాలికి గాయం.
  • అజీర్ణం.
  • మలబద్ధకం.
  • హెర్నియా.
  • ఎడెమా.
  • టి.బి.
  •  గ్యాస్ ట్రబుల్.

 అనుకూలమైన కెరీర్

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

  • గనుల తవ్వకం.
  • డ్రైనేజీ. 
  • నీటికి సంబంధించిన వృత్తి. 
  • ఇంటి నిర్మాణం. 
  • మనోరోగచికిత్సులుగా.
  • శానిటోరియం మరియు క్వారంటైన్ సేవలు. 
  • మిలిటరీ. 
  • ఆరోగ్య నిపుణులు. 
  • NGO. 
  • భీమా. 
  • దిగుమతి ఎగుమతి. 
  • షిప్పింగ్. 
  • గొడుగు, రెయిన్ కోట్.
  • నూనెలు. 
  • చేపలు పట్టడం. 
  • నీటి రవాణా.

ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

ధరించరాదు.

అదృష్ట రాయి

 నీలమణి.

అనుకూలమైన రంగులు

నలుపు, పసుపు.

ఉత్తరాభాద్ర నక్షత్రానికి పేర్లు

ఉత్తరాభాద్ర  నక్షత్రానికి అవకాహదాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం: 

  • మొదటి చరణం - దూ.
  • రెండవ చరణం - థ.
  • మూడవ చరణం - ఝ.
  • నాల్గవ చరణం - ఞ.

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్యల పేర్లను ఉంచుతారు. ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది.  

దీనిని వ్యవహారిక నామం అంటారు.

 పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

ఉత్తరాభాద్ర  నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - ఒ, ఔ, క, ఖ, గ ఘ, ప, ఫ, బ, భ, మ.

వివాహం

వివాహం, సాధారణంగా, సంతోషంగా మరియు శాంతియుతంగా ఉంటుంది. 

ఉత్తరాభాద్రలో జన్మించిన స్త్రీలు మంచి నడవడిక మరియు మంచి స్వభావం కలిగి ఉంటారు.

వీరికి వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది.

నివారణలు

 ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి సూర్య, మంగళ/కుజ, కేతువుల కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు. 

మంత్రం

ఓం అహిర్బుధ్న్యాయ నమః

ఉత్తరాభాద్ర నక్షత్రం

  • భగవంతుడు - అహిర్బుధ్న్య. 
  • పాలించే గ్రహం - శని.
  • జంతువు - ఆవు.
  • చెట్టు - తాటి.
  • పక్షి - నెమలి.
  • భూతం - ఆకాశం.
  • గణం- మనుష్య.
  • యోని - ఆవు.
  • నాడి - మధ్య.
  • చిహ్నం - కవలలు

 

అనువాదం : వేదుల జానకి

Telugu Topics

Telugu Topics

జ్యోతిష్యం

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |