పుబ్బ నక్షత్రం

Purva Phalguni Nakshatra symbol hammock

 

సింహ రాశి 13 డిగ్రీల 20 నిమిషాల నుండి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రాన్ని పుబ్బ (పూర్వ ఫల్గుణి) అంటారు. 

వైదిక ఖగోళ శాస్త్రంలో ఇది పదకొండవ నక్షత్రం. 

ఆధునిక ఖగోళశాస్త్రంలో, పూర్వఫల్గుణి δ Zosma and θ Chertan Leonis. అనుగుణంగా ఉంటుంది. 

లక్షణాలు 

పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు:

  • అందమైన/సౌందర్య వంతులు.  
  • నైపుణ్యం కలవారు
  • కమాండింగ్ పవర్
  • మధురంగా ​​మాట్లాడుతారు
  • నాయకత్వపు లక్షణాలు ఉంటాయి
  •  నీతిమంతులు
  •  స్వీయ గౌరవం
  •  మర్యాదస్తులు 
  • కళలు, సంగీతం పట్ల ఆసక్తి 
  • ఇతరులకు విధేయత చూపడం ఇష్టం పడరు 
  • సానుభూతిపరులు
  • నిజాయితీపరులు
  • హెచ్చరికతంగా ఉంటారు
  • జీవితాన్ని ఆనందిస్తారు
  • ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది
  • విపరీతమైన ఇంద్రియాలు
  • ఆడవారు ఆడంబరాన్ని ఇష్టపడతారు
  • ధైర్యంగల స్వభావం గల స్త్రీలు

ప్రతికూల  నక్షత్రాలు 

  • హస్త
  • స్వాతి
  • అనురాధ
  • పూర్వ భాద్రపద - మీన రాశి
  • ఉత్తర భాద్రపద, రేవతి-మీన రాశి

పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి. 

ఆరోగ్య సమస్యలు

పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు: 

  • సంతానలేమి
  • పునరుత్పత్తి వ్యవస్థలో సమస్యలు
  • గుండె జబ్బులు
  • వెన్నెముక రుగ్మత
  • రక్త రుగ్మతలు
  • రక్తపోటు
  • కాలి నొప్పి
  • నరాల సమస్యలు
  • చీలమండలంలో వాపు

అనుకూలమైన కెరీర్ 

పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

  • ప్రభుత్వ సేవ
  • ప్రయాణాలు
  • రవాణా
  • రేడియో జాకీ
  • వినోదం
  • సంగీతం
  • సినిమా
  •  హోటల్
  •  కథ చెప్పడం
  • తేనె తయారీ
  • ఉప్పు పరిశ్రమ
  • వాహనాలు
  • మ్యూజియం
  • పురాతన వస్తువులు
  • క్రీడలు
  • పశువుల పెంపకం
  • వెటర్నరీ డాక్టర్
  • వెనెరాలజిస్ట్
  • గైనకాలజిస్ట్
  • సర్జన్
  • తోలు మరియు ఎముకల పరిశ్రమ
  • టీచర్
  • విద్యావేత్త
  • గాజు
  • ఆప్టికల్స్
  • సిగరెట్లు
  • జైలు అధికారి

పుబ్బ నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

ధరించవచ్చు.

అదృష్ట రాయి 

వజ్రం.

అనుకూలమైన రంగులు

తెలుపు, లేత నీలం,  ఎరుపు.

పుబ్బ నక్షత్రానికి పేర్లు

పుబ్బ నక్షత్రానికి అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

  • మొదటి చరణం - మో
  • రెండవ చరణం - టా
  • మూడవ చరణం - టీ
  •  నాల్గవ చరణం - టూ

 నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్యల/నానమ్మల  పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. 

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి.

పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు -  త, థ, ద, ధ, న, య, ర, ల, వ, ఎ, ఐ, హ.

వివాహం

పుబ్బ (పూర్వఫల్గుణి) నక్షత్రంలో జన్మించిన వారు దయ, శ్రద్ధ మరియు సానుభూతి కలిగి ఉంటారు. 

స్త్రీలు ఆధిపత్య స్వభావాన్ని పెంపొందించుకోకుండా జాగ్రత్తపడాలి.

నివారణలు

పుబ్బ  నక్షత్రంలో జన్మించిన వారికి చంద్ర, శని, రాహు కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు.

మంత్రం

ఓం అర్యమ్ణే నమః

పుబ్బ  నక్షత్రం

  • భగవంతుడు - అర్యమ
  • పాలించే గ్రహం - శుక్రుడు
  • జంతువు - ఎలుక
  • చెట్టు - మోదుగ
  • పక్షి - జెముడుకాకి
  • భూతం- జలం
  • గణం- మనుష్య
  • యోని - ఎలుక (ఆడ)
  • నాడి - మధ్య
  • చిహ్నం - ఊయల

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |