ఉత్తరాషాడ నక్షత్రం

Uttarashada Nakshatra symbol elephant tusk

 

ధనస్సు రాశి 26 డిగ్రీల 40 నిమిషాల నుండి 10 డిగ్రీల మకర రాశి వరకు వ్యాపించే నక్షత్రాన్ని ఉత్తరాషాడ  అంటారు. 

వేద ఖగోళ శాస్త్రంలో ఇది 21వ నక్షత్రం. 

ఆధునిక ఖగోళ శాస్త్రంలో, ఉత్తరాషాడ ζ Ascella and σ Nunki Sagittariiకి అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు:

రాశులిద్దరికీ ఉమ్మడిగా:-

  • కృతజ్ఞతతా
  • తెలివైనవారు
  • నీతిమంతులు
  • సహాయకరంగా ఉండే స్నేహితులు ఉంటారు
  • నిష్కపటమైనవారు
  • సానుభూతిపరులు
  • ఇతరులకు హాని చేయరు
  • నమ్రతతో ఉంటారు
  • శ్రమతో లాభాలు
  • ప్రారంభ జీవితంలో పోరాటం
  • కుటుంబ సమస్యలు

ఉత్తరాషాడ నక్షత్రం ధనస్సు రాశి వారికి మాత్రమే

  •  నేర్పరులు
  •  జీవితాన్ని ఆనందింస్తారు
  • సూత్రప్రాయులు
  • సహాయకారులు

ఉత్తరాషాడ నక్షత్రం మకర రాశి వారికి మాత్రమే

  • పదునైన తెలివి ఉంటుంది
  • విజనరీ
  • అణకువగా ఉంటారు
  • ధార్మికమైనవారు
  • వాక్ నైపుణ్యత ఉంటుంది
  • నిజాయితీపరులు
  • విశ్వసనీయమైనవారు
  • మితమైన ఖర్చు

ప్రతికూల నక్షత్రాలు

  • ధనిష్ఠ
  • పూర్వాభాద్ర
  • రేవతి
  • ఉత్తరాషాడ ధనస్సు రాశి - పునర్వసు-కర్క రాశి, పుష్యమి, ఆశ్లేష
  • ఉత్తరాషాడ మకర రాశి - మఘ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర - సింహ రాశి

ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

ఆరోగ్య సమస్యలు

ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి: 

ఉత్తరాషాడ ధనస్సు రాశి

  • సయాటికా
  • ఆర్థరైటిస్
  • వెన్ను నొప్పి
  • స్ట్రోక్
  • కడుపు నొప్పి
  •  చర్మ వ్యాధులు
  •  కంటి వ్యాధులు
  •  శ్వాసకోశ సమస్యలు

ఉత్తరాషాడ మకర రాశి

  • గ్యాస్ ట్రబుల్
  • తామర
  • కుష్టువ్యాధి
  • ఆర్థరైటిస్
  • గుండె జబ్బులు
  • దడ దడ
  • అజీర్ణం 
  • ల్యూకోడెర్మా 
  • చర్మ వ్యాధులు

అనుకూలమైన కెరీర్

ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

ఉత్తరాషాడ నక్షత్రం ధనస్సు రాశి

  • బోధన
  • మతం
  • న్యాయమూర్తి
  • బ్యాంక్
  • ఫైనాన్స్ వృత్తి
  • రాజకీయం
  • దౌత్యవేత్త
  • ఆరోగ్య నిపుణులు
  • జైలు అధికారి
  • సుంకపు అధికారి
  • నీటి రవాణా
  • అంతర్జాతీయ వ్యాపారం
  • మందులు
  • మిలిటరీ
  • క్రీడలు మరియు ఆటలు

ఉత్తరాషాడ నక్షత్రం మకర రాశి

  • రియల్ ఎస్టేట్
  • గనుల తవ్వకం
  • ఫైనాన్స్ ప్రొఫెషనల్
  •  పన్ను శాఖ
  • శాస్త్రవేత్త
  • వర్తింపు
  • జైలు అధికారి
  • ఇంజనీర్
  • ఉన్ని
  • తోలు
  • ఆర్కియాలజీ
  • పురాతన వస్తువులు
  • వ్యాఖ్యాత
  • భాషావేత్త

ఉత్తరాషాడ నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా?

  • ఉత్తరాషాడ ధనస్సు రాశి - ధరించరాదు
  • ఉత్తరాషాడ మకర రాశి - ధరించవచ్చు 

అదృష్ట రాయి

కెంపు (Ruby)

అనుకూలమైన రంగులు

  • ఉత్తరాషాడ ధనస్సు రాశి - పసుపు, తెలుపు 
  • ఉత్తరాషాడ మకర రాశి - నలుపు, ముదురు నీలం

ఉత్తరాషాడ నక్షత్రానికి పేర్లు 

ఉత్తరాషాడ నక్షత్రానికి అవకాహదాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం: 

  • మొదటి చరణం - భే
  • రెండవ చరణం - భో
  • మూడవ చరణం - జా
  •  నాల్గవ చరణం - జీ

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్య-నానమ్మల పేర్లను ఉంచుతారు. ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది.

దీనిని వ్యవహారిక నామం అంటారు. 

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరుతో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు -

  • ఉత్తరాషాడ నక్షత్ర ధనస్సు రాశి - ఉ, ఊ, ఋ, ష, ఎ, ఐ, హ, చ, ఛ, జ, ఝ
  • ఉత్తరాషాడ నక్షత్రం మకర రాశి - స, ఒ, ఔ, ట, ఠ, డ, ఢ

 వివాహం

ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు తమ భర్తల పట్ల ఆప్యాయత కలిగి ఉంటారు మరియు దైవభక్తి కలిగి ఉంటారు. 

కొందరు అహంభావంతో ఉంటారు మరియు కొన్నిసార్లు అసభ్యంగా మాట్లాడతారు. వివాహం సాధారణంగా, సంతోషంగా మరియు శాంతియుతంగా ఉంటుంది.

 నివారణలు

ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన వారికి మంగళ/కుజ, బుధ, గురు/బృహస్పతి కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి.

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు. 

మంత్రం

ఓం విశ్వేభ్యో దేవేభ్యో నమః

ఉత్తరాషాడ నక్షత్రం

  • భగవాన్ - విశ్వేదేవా
  • పాలించే గ్రహం - సూర్యుడు
  • జంతువు - ఎద్దు
  • చెట్టు - పణస చెట్టు
  • పక్షి - కోడి
  • భూతం - వాయు
  •  గణం - మనుష్య
  •  యోని - ముంగిస (మగ)
  • నాడి - అంత్య
  •  చిహ్నం - ఏనుగు దంతము

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |