ద్వాపరయుగమున శ్రీమన్నారాయణుడు లక్ష్మీతో యేకాంత
ముననుండదలంచి ఆది శేషుని బిలచి నీవీ ద్వారముననుండి నెవ్వరినింగాని లోనికిం ప్రవేశింపకూడదని యాజ్ఞనొసంగెను. అంత నాయాది శేషుడా మేరకు ద్వారముగాంచియుండెను. ఇంతలో వాయుదేవుడు విష్ణుదర్శ నార్థమైవచ్చి లోపలికింజన ప్రయత్నించెను. అంత శేషుడు విష్ణుదేవుడు రమాదేవితో యేకాంతముననున్నాడు. యిప్పుడు పోవుటకు వీలు
కాదనినుడివెను.
అందులకావాయుదేవుడు కోపోద్దీపితుడై ఓ రీ ! మూర్ఖనిన్నిప్పుడే శపియించెదజూడుమన శేషుడు క్రుద్ధుడై ఓరీ దుర్మా ర్గుడా నన్నేల నీవు శపించెదవు. భగవంతుడు నిద్రించుచున్నాడు. యెదరో దేవతలును, ఋషులును, అనేక వేలు భక్తులు యిచ్చోటికరు మరలినారు. గనుక నీవు యిప్పుడు లోనికిజోవుటకు సాధ్యము గాదని చెప్పెను. యిట్లిరువురు గొప్పశబ్దములతో తగవులాడుచుండ వీర్ల యొక్క జగడములను లక్ష్మీదేవి విష్ణుమూర్తి కెరింగించె. లక్ష్మీపతి
వెంటనే యచ్చోటి కరుదెంచి వీరిరువులు సంభాషణలు గ్రహించి అంత శ్రీమన్నారాయణుండు శేషుని గర్వమడంపదలంచి ఓ! భుజగేంద్రా యీ భూతలమునందు అంజనాచలంబొకటిగలదు. దా ని ని నిద్రేహముతో గప్పికొనుము. అప్పుడు వాయుదేవుడు నిన్ను బారదోలినయడల వాయువధికుడని యెన్నుదము. అట్లు చేయ లేక పోయినయెడల నీవధికుడ పని ముల్లోకములనెల్ల కొనియాడబడుదువు. అప్పుడు గదా మీ బల పరాక్రమములు లో క ము లో వెల్లడికాగలదని వచించె. శేషుడాప్రకార మొనర్చెను. అప్పుడు వాయువులచ్చోటి కేగి తన పాదము మోపి యొకకొనవ్రేలితో ఆగిరిని గదలించి దవ్వున విసరివై చెను.
అంతట అంత దేవతులు, రాక్షసులు యీయొక్క వింతలను జూచుచు శ్రీమన్నారాయణమూర్తి చేసిన వింతకు ఆశ్చర్యపడుచు నాటి మొదలు నాపర్వతమునకు దేవతలందరు శేషాద్రియని పేరిడిరి. అది మొదలు నా పర్వతమునకు శేషాద్రియని పేరుగలిగినది.
కలియుగమున వెంకటాద్రి ప్రభావము.
కథ నారాయణుడనువిప్రు ఢారూఢికదపము సేసి హరి మెప్పించెన్ | ధారుణితత్కారణమున | నారాయణా రాయణాద్రి యనమమయ్యెన్ కలియుగమునందు యీపర్వతమునందు త్రిలోక కర్త యగు శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవి సమేతముగా నివసించి భక్తులకు ముక్తి యిచ్చుచుండుటచే అటువంటి జగత్ప్రక్షకుడైన పరంధామునకు వాసస్థానంబై తన్ను యెవరు భక్తి శ్రద్ధలతో దర్శించెదరో వారియొక్క పాపములను పోగొట్టి అనేక వేలజనులకు ముక్తి నొసంగి కాపాడు చుండుటచే యప్పర్వతమునకు వెంకటాద్రియని కారణముకలిగినది.
పూర్వకాలమునందు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అను యిద్దరు రాక్షసులు భూలోకమునగల భక్తులను హింసించుచు దేవలోక మునకుబోయి దేవతలను కష్టపెట్టుచు నేనే దేవుడనియు, నన్నే స్తుతించ వలసినదిగా శ్రీమన్నారాయణ భక్తులకు అనేక కష్టములను కలిగించు చుండె. దేవతలు యీ కష్టముల కోర్వలేక శ్రీ మహావిష్ణు చెంతకరిగి మొరలిడిరి. తరువాత శ్రీమన్నారాయణుడు త్వరలోనే వానిని సంహ రించెదనని దేవతలకు అభయమిచ్చి పంపివేసెను. తరువాత శ్రీమన్నారా యణుని నాభికమలమందు బ్రహ్మముద్భవింపజేయ నా చతుర్ముఖుడు వారియాజ్ఞగై కొని సచరాచర సర్వప పంచమును సృష్టించినవాడా యెను. ఇట్లుండ నాకాలమున హిరణ్యాక్షుడను రాక్షసుడు భూమిని చాపగా చుట్టి తెచ్చి సముద్రమున బడవైచెను. అంత నాతడు రసాతలము నకుబోయి ఆనందపరవశుడైయుండెను. అప్పుడు సమస్తమును ర్ణనమై పెక్కు సంవత్సరములు తిమిరమునిండుకొన శ్రీమహావిష్ణు యా జలము పైన చిన్న బిడ్డయై వటపత్రమున యోగనిద్రవహించియుండెను. అంత బ్రహ్మ శ్రీమన్నారాయణుని సందర్శించి భూలోకమునగల భక్తులకు హిరణ్యామునివలన గలుగు బాధలన్నియు వివరించి సత్వర ముగా భక్తులను కాపాడవలయుననికోరెను. అంత శ్రీమన్నారాయ ణుడు అతిక కోపోద్దీపితుడై పునసృష్టి చేయదలచి శ్వేత వరాహరూపం బున పాతాళమునకుబోయి ధరిత్రిని పైకెత్తెను. అప్పుడు హేమాడు డను రాక్షసుడు శ్రీమన్నారాయణునితో యుద్ధ మొనర్చ వరహావతార ముననున్న శ్రీహరి ఆరాక్షసుని తలదునిమి హతంబొనర్చె. అంత దేవ తలు గంధర్వులు శ్రీహరికి పుష్పవర్షములు గురిపించిరి. అంత నావరహా వతారమెత్తిన శ్రీహరి తన కోరలచే భూమిని పైకెత్తెను. నీటిపైకి తేబడిన నాథరిత్రినింగాంచి జీ వ త లు, ఖుద్రాదులు, ఋషులు యావన్మంది.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |