సౌందర్యలహరి

సంస్కృత శ్లోకము శ్లో. శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్త: ప్రభవితుమ్ నచే దేవం దేవో నఖలు కుశల: స్పందితు మపి అతస్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభి రపి ప్రణంతుం స్తోతుం వా కథ మకృతపుణ్యః ప్రభవతి.
టీక (తల్లీ జగజ్జననీ 1) శివః - శివుడు; శక్త్యా - శక్తితో యుక్తః - కూడి యున్నవుడు; ప్రభవితుం - సృష్టించుటకు; శక్తః - సమర్ధుడు; ఏవం - ఈ విధముగా; నచేత్ - కాదేని (అనగా శక్తితో కూడి ఉండనిచో) దేవః - ఆ శివుడు; స్పందితుం అపి - చలించుటకు కూడా; నకుశలః - నేర్పరికాడు అతః - ఈ కారణము వలన హరిహరవిరించాది భిరపి - విష్ణువు శివుడు బ్రహ్మ మొదలగు వారి చేత గూడా; ఆరాధ్యాం - పూజింపదగిన; త్వాం - నిన్ను గూట్చి ప్రణంతుం - నమస్కరించుటకుగాని; స్తోతుందా - స్తుతించుటకుగాని; అకృతపుణ్య ః - పుణ్యము చేయనివాడు; కథం - ఏ విధముగా; ప్రభవతి - శక్తుడగును?

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |