లలితా సహస్రనామం

మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

lalita_sahasranama_telugu_pdf_cover_page

Recommended for you

 

లలితా సహస్ర నామ వివరణము - Part 2

 

లలితా సహస్ర నామ వివరణము - Part 3

 

లలితా సహస్ర నామ వివరణము - Part 4

 

 

 

Video - Lalita Sahasranamam with Telugu lyrics 

 

Lalita 
Sahasranamam with Telugu lyrics

 

 

 

శ్రీ గణేశాయ నమః
శ్రీమత్రిపుర సుందర్యై నమః
|| 1. శ్రీ మాతా || ఇది లలితాదేవి యొక్క మొదటి నామం. ఇది మూడక్షరాల నామం. లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు "శ్రీ మాత్రే నమః " అని చెప్పాలి. అంటే "శ్రీమాత కొఱకు నమస్కారం" అని అర్థం. అంతేగాని 'శ్రీమాతనమః' అని చెప్పకూడదు - వ్యాకరణ దోషం వస్తుంది. తెలుగులో 'శ్రీ మాతకు నమస్కారం' అని అంటాము. కాని, సంస్కృతంలో నమస్కారం చతుర్థి విభక్తిలో చెప్పటమే సంప్రదాయం. ఉదా: శివాయ నమః = 'శివుని కొఱకు నమస్కారం, గురవే నమః = గురువు కొఱకు నమస్కారం, హరయే నమః = హరి కొఱకు నమస్కారం.' 'మాత', 'అంబా' ఈ సంస్కృత పదాలకు 'తల్లి' అని అర్థం. 'మాతృ' పదం నుండే ఆంగ్లంలో 'మదర్' అనే పదం వచ్చి వుంటుంది. ఈ మొదటి నామానికి ఎన్నో రకాల అర్థాలున్నాయి.
'శ్రీ' - అంటే మంగళకరమైన లేదా శుభ ప్రదమైన, 'మాతా' అంటే 'తల్లి' అని అర్ధం. మన శుభాన్ని కోరే వారిలో తల్లిదే అగ్రస్థానం. అందుకే 'మాతృదేవోభవ' అని ముందుగా చెప్పబడింది. 'కుపుత్రో జాయేత్ క్వచిదపి కుమాతా న భవతి' అని ఆర్యోక్తి, అంటే ' కుపుత్రుడు (తల్లి పట్ల చెడ్డ కొడుకు) వుంటే వుండవచ్చు గాని, కుమాత (కొడుకు పట్ల చెడ్డతల్లి) ఉండదు' అని అర్థం. సీతాతన్వంగి, రఘుమహారాజు,
హిమాలయ పర్వతము, గోదావరీ నది - మొదలైన సంభావనా పూర్వపద కర్మధారయ సమాసాల్లాగానే ' శ్రీమాతా' అనే పదాన్ని కూడా అర్థం చేసుకుంటే 'శ్రీ' అనే తల్లి - అని అర్థం చెప్పుకోవలసి వుంటుంది. సమస్త విశ్వానికి తల్లిగా ఒక వ్యక్తి వుంటే - ఆ వ్యక్తి పేరు 'శ్రీ' అని గాని, ఎక్కడైనా, ఎప్పుడైనా పదార్థమయమైన దేహంతో పుట్టుక జరిగితే - ఆ దేహాన్నిచ్చిన తల్లిని సంకేతించడానికి ఉపయోగించే పదం 'శ్రీ' అని గాని ఈ పదానికి అర్థం చెప్పుకోవచ్చును.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize