పోతన భాగవతం

Krishna

ఈ విధంగా మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది కుంతీదేవి. ఆమె ప్రార్థనను స్వీకరించిన శ్రీకృష్ణుడు మాయా మయమైన తన మధుర మందహాసంతో పాండవ జననిని మైమరపించి రథారూఢుడై హస్తినాపురానికి తిరిగివచ్చాడు.

కొంత కాలమైన తర్వాత కుంతికీ సుభద్రకూ చెప్పి ద్వారకానగరానికి ప్రయాణమైన గోవిందుడు కొంతకాలం ఉండుమని ధర్మరాజు బతిమాలగా ఉండిపోయాడు.

చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మరాజును కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైనవారు ఎన్నో విధాల ఓదార్చారు. అయినా ఆయన మనస్సుకు ఊరట లభించలేదు. వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఈ విధంగా అనుకొన్నాడు

మ. తన దేహంబునకై యవేకమృగ పంతావంబుఁ జంపించు దు గ్రమభంగిం గురుబాలకద్విజ తమాజు భ్రాతృ సంఘంబు వి ట్లవి: జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షిప్ నాకు పో యన లక్షావధి వైన ఘోరవరక వ్యాసంగముల్ మామవే?

తన శరీరపోషణకోసం అమాయికాలైన అనేక మృగాలను చంపించే దుర్మార్గుడు లాగా, రాజ్యం కోసం గురువులనూ, బాలకులనూ, బ్రాహ్మణులనూ, ఆత్మజులనూ, అన్నదమ్ములనూ సమర రంగంలో చంపించాను. ఇంతటి పాపానికి ఒడిగట్టిన నాకు నూరు వేల సంవత్సరాల పర్యంతం ఘోరమైన నరకం అనుభవించక తప్పదు.

ప. మటియు, బ్రజాపరిపాలనపరుం డయిన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధియించివం బాపంబు లేదని శాస్త్ర వచనంబు గల, దయిన వది విజ్ఞానంబు కొలుకు సమర్థంబు గాదు; చతురంగంబుల సవేకా-హిణీ సంఖ్యాతంబులం జంపించితి; హతబంధులయిన సతుల కేసు వేసిన ద్రోహంబు దప్పించుకొవ నేర్పు లేదు; గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగ మేధాది యాగంబుల చేత బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబులవలన విడివడి నిర్మలుండగు పని నిగమంబులు నిగమించు; బంకంబువ్వ బంకిలస్థలంబువడు, మద్యంబున మద్యభాండంబువకు శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబు లయిన యాగంబులచేతం బురుషులకుఁ బాపబాహుళ్యంబ కాని పాప విర్ముక్తిగాదని శంకించెద.

ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను సంహరించటంలో దోషం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయినా ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసంగా కన్పించటం లేదు. రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, కాలిబంట్లతో కూడిన పెక్కు అక్షౌహిణులను చంపించాను. పతులనూ, బంధువులనూ హతమార్చి సతులకు నేను క్షమించరాని మహా ద్రోహం చేశాను. నా యీ పాపానికి పరిహారం లేదు. గృహస్థధర్మాలైన అశ్వమేధాది యాగాలు ఆచరిస్తే బ్రహ్మహత్యాది దోషాలు పరిహార మౌతాయని వేదాలు అనుశాసిస్తున్నాయి. బురదవల్ల బురదనేల పరిశుభ్రం కాదు. కల్లుపోసి కడిగి నందువల్ల కల్లుకుండకు శుద్ధి లభించదు. అలాగే బుద్ధి పూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాలవల్ల మానవుల పాపం పెరుగుతుందే కాని తరుగదని నా సందేహం.

మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు

తెలుగు

ఆధ్యాత్మిక పుస్తకాలు

Click on any topic to open

Copyright © 2025 | Vedadhara test | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...

We use cookies