పరమసత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురుశిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి.
నే ననుసరించిన మార్గం నన్ను దైవస్వరూపులైన . ఒక ఋషి దగ్గరికి నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందినది. భారతదేశానికి నిజమైన సంపద అయిన మహానుభావుల్లో ఆయన ఒకరు, , అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ, ప్రాచీనకాలంలో ఈజిప్టుకూ బాబిలోనియాకూ పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు.
నా స్మృతిపథంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వ జన్మకు సంబంధించిన అస్తవ్యస్త 'విషయాలతో నిండి ఉన్నవి. చాలా వెనకటి జన్మలో ఎప్పుడో నేను, హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగి'గా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |