హస్తా నక్షత్రం

Hasta Nakshatra symbol hand

 

కన్యా రాశి 10 డిగ్రీల నుండి 23 డిగ్రీల 20 నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రాన్ని హస్తా  అంటారు. 

వేద ఖగోళ శాస్త్రంలో ఇది 13వ నక్షత్రం. 

ఆధునిక ఖగోళ శాస్త్రంలో, హస్తాα Alchiba, β Kraz, γ, δ Algorab and ε Minkar Corviకి అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

హస్తా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు:-

  • విజ్ఞానవంతులు
  •  జిజ్ఞాసువులు
  •  గౌరవప్రదమైన ప్రవర్తన
  • కష్టపడి పనిచేసేవారు
  • ఆకర్షణీయమైనవారు
  • శాంతియుతమైనవారు
  • స్వయం నియంత్రణ ఉంటుంది
  • స్వీయ క్రమశిక్షణ ఉంటుంది
  • జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి
  • తెలివైనవారు
  • కొందరు స్వార్థపరులు
  • తప్పు కనుగొనే స్వభావం ఉంటుంది
  • విశ్లేషణ నైపుణ్యాలు ఉంటాయి
  • సౌకర్యవంతమైన వృద్ధాప్యం
  • అధికారం మరియు స్థానం
  •  సృజనాత్మకమైనవారు
  • సమర్థవంతమైనవారు
  • కమ్యూనికేషన్
  • మద్యపాన ధోరణి మొదలైనవి ఉంటాయి
  • ఇంటికి దూరంగా ఉండాలనే మొగ్గు
  • కొన్నిసార్లు అజాగ్రత్తగా ఉంటారు
  • హేతువాది
  • వాగ్వివాదం ధోరణి ఉంటుంది
  • చట్టాన్ని ఉల్లంఘించే ధోరణి ఉంటుంది

ప్రతికూల  నక్షత్రాలు

  •  స్వాతి
  • అనురాధ
  •  మూల
  •  అశ్విని
  •  భరణి
  •  కృత్తిక - మేష రాశి

హస్తా నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

ఆరోగ్య సమస్యలు

 హస్తా నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు:

  • గ్యాస్
  •  కడుపు నొప్పి
  •  పేగు బ్లాక్
  •  ప్రేగుల వాపు
  •  అజీర్ణం
  •  కలరా
  •  విరేచనాలు
  •  శ్వాసకోశ వ్యాధి
  •  పురుగుల ఇబ్బంది
  •  నరాల నొప్పి
  •  మానసిక రుగ్మతలు

అనుకూలమైన కెరీర్

 హస్తా నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు:

  • ట్రేడింగ్
  •  పోస్టల్ సేవలు
  •  కొరియర్
  •  షిప్పింగ్
  •  నూలు నిర్మాణం
  •  రంగు మరియు ఇంక్ పరిశ్రమ
  •  కళాకారులు
  •  రాజకీయ నాయకులు
  •  న్యాయవాద వృత్తి
  •  దిగుమతి ఎగుమతి
  • దౌత్యవేత్త

హస్తా నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

ధరించవచ్చు. 

అదృష్ట రాయి

ముత్యం.

 అనుకూలమైన రంగులు

 తెలుపు, ఆకుపచ్చ.

హస్తా నక్షత్రానికి పేర్లు

హస్తా నక్షత్రానికి అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

  • మొదటి చరణం - పూ
  • రెండవ చరణం - ష
  • మూడవ చరణం - ణ 
  • నాల్గవ చరణం - ఠ

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్యల/నానమ్మల పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. 

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

హస్తా నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరుతో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు -  ప, ఫ, బ, భ, మ , అ, ఆ, ఇ, ఈ, శ, ఓ, ఔ.

వివాహం.-

 

హస్తా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు గౌరవం, సమృద్ధి మరియు ఆకర్షణీయమైన ప్రవర్తన కలిగి ఉంటారు. హస్తా నక్షత్రంలో జన్మించిన వారు తమ జీవిత భాగస్వామిలో తప్పులు కనుగొనే ధోరణిని అరికట్టడానికి ప్రయత్నించాలి. వారు వైవాహిక జీవితంలో మరింత శ్రద్ధగల విధానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. 

నివారణలు

 హస్తా నక్షత్రంలో జన్మించిన వారికి శని, రాహు, కేతువుల కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు. 

మంత్రం

ఓం సవిత్రే నమః

హస్తా నక్షత్రం

  • భగవంతుడు - సవితా
  • పాలించే గ్రహం - చంద్రుడు
  • జంతువు - గేదె
  • చెట్టు - అంపిలేపి
  •  పక్షి - కాకి
  •  భూతం - అగ్ని
  •  గణం - దేవ
  • యోని - గేదె (ఆడ)
  • నాడి - ఆద్య
  •  చిహ్నం - చెయ్యి

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |