చిత్త నక్షత్రం

Chitra Nakshatra symbol pearl

 

కన్యారాశి 23 డిగ్రీల 20 నిమిషాల నుండి తులా రాశి 6 డిగ్రీల 40 నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రాన్ని చిత్త (చిత్ర) అంటారు. 

వేద ఖగోళ శాస్త్రంలో ఇది 14వ నక్షత్రం. 

ఆధునిక ఖగోళ శాస్త్రంలో, చిత్త Spicaకు అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

చిత్త నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు: 

రాశులిద్దరికీ ఉమ్మడిగా

 • ప్రతిష్టాత్మకమైనవారు
 • సాహసోపేతవంతులు
 • విజనరీ
 • ఆకర్షణీయమైన కళ్ళు ఉంటాయి
 • కళల పట్ల ఆసక్తి ఉంటుంది
 • పొగిడే ధోరణి ఉంటుంది
 • ఉత్సాహవంతులు
 • విదేశాల్లో అదృష్టం ఉంటుంది
 • తల్లి నుండి మద్దతు ఉంటుంది
 • ధార్మికమైనవారు
 •  జీవితం యొక్క రెండవ సగం సౌకర్యవంతంగా ఉంటుంది 

చిత్త నక్షత్రం కన్యా రాశి వారికి మాత్రమే

 • అందమైనవారు
 • కష్టపడి పనిచేసేవారు
 • చక్కని భావవ్యక్తీకరణ 
 • నైపుణ్యాలు ఉంటాయి
 • నిర్భయవంతులు
 • చదువుకున్నవారు
 • ఉల్లాసంగా ఉంటారు
 • చిన్నబుచ్చుకునేవారు
 • వాదించే వారు
 • చిరాకు పడే వారు 

చిత్త నక్షత్రం తులారాశి వారికి మాత్రమే

 • ఆదర్శవాదులు
 • వివేకవంతులు
 •  వైఞానిక దృష్టికోణం ఉంటుంది
 • అంతర్ దృష్టి ఉంటుంది

ప్రతికూల నక్షత్రాలు

 • విశాఖ
 • జ్యేష్ట
 • పూర్వాషాడ
 • చిత్త కన్యా రాశి వారికి -  అశ్విని,  భరణి,  కృత్తిక - మేష రాశి
 • చిత్త తులా రాశి వారికి - కృత్తిక వృషభ రాశి, రోహిణి, మృగశిర - వృషభ రాశి

 చిత్త నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

ఆరోగ్య సమస్యలు

 చిత్త నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు: 

చిత్త - కన్యా రాశి

 • పేగు పూతలు
 • కడుపు నొప్పి
 • పురుగుల ఇబ్బంది
 • బొడ్డు మీద దురద
 •  కాలి నొప్పి
 • సరీసృపాలు మరియు కీటకాల వల్ల విషం
 • జంతువుల దాడి
 •  కలరా
 •  మూత్ర సంబంధ వ్యాధులు 
 • మూత్ర వ్యవస్థలో రాయి

చిత్త - తులా రాశి

 • కిడ్నీ సమస్యలు
 • మధుమేహం
 • మూత్ర వ్యవస్థలో రాయి
 • తలనొప్పి
 • మెదడువాపు వ్యాధి
 • వెన్నునొప్పి
 • వడ దెబ్బ

అనుకూలమైన కెరీర్

చిత్త నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు:

చిత్త నక్షత్రం - కన్యా రాశి

 • ప్రింటింగ్
 •  ప్రచురణ
 •  రచయిత
 •  ఇంటి నిర్మాణం
 •  మధ్యవర్తి
 •  ట్రాఫిక్ నియంత్రణ
 •  భద్రత
 •  రక్షణ సేవలు
 •  వ్యాపారి
 •  పన్ను అధికారి
 •  ప్రభుత్వ సేవ
 •  తయారీ
 •  విద్యుత్
 •  గనుల తవ్వకం
 •  మెకానిక్
 •  ఇంజనీర్
 •  రైలు అధికారి
 • వైద్యం
 •  క్రిమినాలజిస్ట్
 • వేలిముద్ర నిపుణుడు
 • పరిమళ ద్రవ్యాలు
 • వస్త్రాలు

చిత్త నక్షత్రం - తులా రాశి

 • న్యాయవాద వృత్తి
 • వైద్యం
 • శాస్త్రవేత్త
 • తత్వవేత్త
 • మతం
 •  ట్రేడింగ్
 •  కమీషన్ ఏజెంట్
 •  రక్షణ సేవలు
 •  భద్రత
 •  పోలీసు
 •  కాంట్రాక్టర్
 •  ప్రింటింగ్
 •  గ్రాఫిక్స్
 •  అలంకరణ
 •  కళాకారులు
 •  పరిమళ ద్రవ్యాలు
 •  నూనె
 •  వివాహ సేవలు
 •  క్రీడలు
 •  సంగీత వాయిద్యాలు
 •  ఫోన్
 •  ఎలక్ట్రానిక్ పరికరాలు
 •  నాణ్యత నియంత్రణ
 •  రేటింగ్
 •  ఇంధనాలు
 •  పొగాకు

చిత్త నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా?

చిత్త-కన్యా రాశి - ధరించవచ్చు

చిత్త-తులా రాశి- ధరించవచ్చు

అదృష్ట రాయి

పగడం 

అనుకూలమైన రంగులు

 చిత్త - కన్యా రాశి - ఎరుపు, ఆకుపచ్చ.

 చిత్త - తులా రాశి - తెలుపు, లేత నీలం.

చిత్త నక్షత్రానికి పేర్లు

చిత్త నక్షత్రం కోసం అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

 •  మొదటి చరణం -  పే
 •  రెండవ చరణం - పో
 •  మూడవ చరణం - రా
 •  నాల్గవ చరణం - రీ

 నామకరణం సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్రం పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్యల/నానమ్మల పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

చిత్త నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరుతో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు -

 చిత్త నక్షత్రం - కన్యా రాశి - ప, ఫ, బ, భ, మ, అ, ఆ, ఇ, ఈ, శ, ఓ , ఔ.

చిత్త నక్షత్రం - తులా రాశి - య, ర, ల, వ, ఉ, ఊ, ఋ, ఫ, అం, అః, క్ష.

వివాహం

చిత్తారాశిలో జన్మించిన వారు వివాహేతర సంబంధాలకు మొగ్గు చూపవచ్చు. 

వారు దానికి దూరంగా ఉండాలి.

మహిళలకు- వైవాహిక జీవితం సంపన్నంగా ఉంటుంది, కానీ అనేక ఇబ్బందులతో ఉంటుంది.

నివారణలు

చిత్త నక్షత్రంలో జన్మించిన వారికి బుధ, గురు/బృహస్పతి మరియు శుక్ర కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చును. 

మంత్రం

ఓం త్వష్ట్రే నమః

ఓం విశ్వకర్మణే నమః

చిత్త నక్షత్రం

 • భగవంతుడు - త్వష్టా/విశ్వకర్మ
 • పాలించే గ్రహం - మంగళ/కుజ
 • జంతువు - పులి
 • చెట్టు - బెల్/బిల్వా
 • పక్షి - కాకి
 • భూతం - అగ్ని
 • గణం - అసుర
 • యోని - పులి (ఆడ)
 • నాడి - అంత్య
 • చిహ్నం - ముత్యం

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |