శివపురాణం - Part 1

 

 

47.6K

Comments

q8jay
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

Read more comments

ధృతరాష్ట్రునికి ఎంతమంది పిల్లలు?

కురు రాజు అయిన ధృతరాష్ట్రుడికి మొత్తం 102 మంది పిల్లలు. అతనికి కౌరవులు అని పిలువబడే వంద మంది కుమారులు, దుశ్శాల అనే కుమార్తె మరియు గాంధారి దాసి నుండి జన్మించిన యుయుత్సుడు అనే మరో కుమారుడు ఉన్నారు. మహాభారతంలోని పాత్రల గురించి అర్థం చేసుకోవడం, దాని గొప్ప కథనం పట్ల మీ ప్రశంసలను మరింతగా పెంచుతుంది

హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

హనుమాన్ చాలీసా అనేది గోస్వామి తులసీదాస్ జీ స్వరపరిచిన భక్తి గీతం, ఇది హనుమాన్ స్వామి యొక్క సద్గుణాలు మరియు పనులను కీర్తిస్తుంది. రక్షణ, ధైర్యం మరియు ఆశీర్వాదం కోసం అవసరమైన సమయాల్లో లేదా రోజువారీ దినచర్యలో భాగంగా మీరు దీనిని పఠించవచ్చు.

Quiz

క్షీరసాగరంలో పుట్టిన కూతురు ఎవరు?

సృష్టికి పూర్వం ప్రపంచం జలమయమై, పదార్థశూన్యమై, అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహా తేజస్సు పుట్టింది. కాలక్రమాన అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది. అదే పరమేశ్వరుడైన శివుడు. ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధభాగం నుంచి మహాశక్తి పుట్టింది. ఆ మహాశక్తినే ప్రకృతి అనీ, మహామాయ అనీ పిలుస్తారు. కాలక్రమాన పరమేశ్వరీ పరమేశ్వరులు మహావిష్ణువును సృష్టించారు. మహావిష్ణువు నాభి నుండి మహాపద్మం పుట్టింది. అది అనేక వేల యోజనాల నిడివి గలిగి మహా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆ మహాపద్మంలో అయిదు ముఖాలతో బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మతో బాటే సరస్వతీ పుట్టింది. ప్రపంచమంతా జలమయంగా ఉండటం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని ఊర్ధ్వ అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు. బ్రహ్మ ఓంకారాన్ని జపించగా దాని ఫలి తంగా విష్ణువు బ్రహ్మ ఎదట ప్రత్యక్ష మయాడు. తానే సృష్టిలో మొదటివాణ్ణి అనుకుంటున్న బ్రహ్మ విష్ణువును చూసి, ఎవరు నువు? ఇక్కడి కెందుకు వచ్చావు? అని అడిగాడు.

సృష్టి చేయటానికి నిన్ను నా నాభి కమలం నుంచి పుట్టించాను. నేను విష్ణు వును, అన్నాడు విష్ణువు,
బ్రహ్మ అహంకరించి, నీ ప్రగల్భాలు కట్టి పెట్టు. లేదా నాతో యుద్ధానికి రా. నేను స్వయంభువును, జగత్కర్తను, అన్నాడు. అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వ రుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణు వుల మధ్య ప్రత్యక్షమయాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, దీని ఆద్యంతాలు మనిద్దరిలో ఎవరు కనుక్కుంటె వారు గొప్ప, అన్నాడు. బ్రహ్మ అందుకు సమ్మ తించాడు. కాని ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి యథా స్థానికి తిరిగి వచ్చి, పరమేశ్వరుణ్ణి ప్రార్ధించారు.

పరమేశ్వరుడు వారి ఎదట ప్రత్యక్షమై, నువు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించటానికి గాను ఈ విష్ణువు యొక్క నాభికమలం నుంచి సృష్టించబడినవాడివి. అందుచేత సృష్టి ఆరంభించు, అని బ్రహ్మతో అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరుణ్ణి చూసి, నువు ఎవడివి? నాతో సమంగా నీకు అయిదు ముఖా దుకున్నాయి?

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Telugu Topics

Telugu Topics

శివుడు

Click on any topic to open

Please wait while the audio list loads..

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |