దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన రుషులను వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వచ్చి వాజిపేయ మనే యజ్ఞం చేశాడు. ఆయనకు శివుడి మీద చాలా కోపంగా వున్నది. అందుచేత అందుచేత ఈ వాజిపేయంలో శివుడికి హవిర్భాగం లేకుండా చేశాడు. అప్పటికీ దక్షుడికి శివుడి పైన కోపం చల్లారలేదు. అందుచేత ఆయన 'బృహస్పతి యజ్ఞం' అనే మహాయజ్ఞం తలపెట్టి దానికి
దేవతలనూ, మహర్షులనూ ఆహ్వానించి, వచ్చిన వారిని సత్కరించటానికి తన శిష్యులనూ, బంధువులనూ నియోగించాడు. ఇందులోకూడా ఆయన శివుడికి భాగం ఇవ్వ దలచలేదు.
ఈ యజ్ఞానికి విశ్వదేవతలు, మరు త్తులూ, పితృగణాలూ, అప్సరసలూ, గంధర్వ, సిద్ధ, విద్యాధర, కిన్నర, యక్షులూ, కస్యప, అగస్త్య, అత్రి, భృగు, మరీచి, నారద, పరాశరాది మహర్షులూ వచ్చారు. బ్రహ్మ విష్ణులు తప్ప మిగిలినవారంతా దక్షు డికి భయపడే వచ్చారు. వచ్చినవారి కంద రికీ విడుదులు ఏర్పాటు చెయ్యటానికి విశ్వ కర్మ నియోగించబడ్డాడు.

దక్షుడు యజ్ఞదీక్ష వహించి, భార్యా సమేతుడై యాగశాల ప్రవేశించి, సభా వందనం చేశాడు. పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు. బ్రహ్మ విష్ణువులు పిలిచినా రాలేదు. అనేకమంది దేవతలతోనూ, మహర్షులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివభక్తులైన మరీచీ, దధీచి, భృగుడూ మొద లైన మహర్షులు సభను కలయజూసి, ' ఓ దక్షా, ఈ సభకు సతీదేవినీ, శివుణ్ణి పిలవ లేదా? వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు ? 'అని అడిగారు.

దానికి దక్షుడు, ' శివుడు కర్మభ్రష్టుడు.అందుచేత అతన్ని పిలవలేదు. అతను అప విత్రుడు, కపాలధారి, శ్మశానవాని, ప్రేత గణాలకు ప్రభువు,' అన్నాడు. ఈ శివదూషణ విని దధీచి, 'దక్షా, ఈ యాగం నెరవేరదు. శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువు ఆపదనూ, విచా రాన్నీ కొనితెచ్చుకుంటున్నావు. ఈ యాగా నికి వచ్చినవారు కూడా దుఃఖిస్తారు.' అనివామదేవుడూ, మరీచీ, గౌతముడూ, శిలా దుడూ మొదలైన అనేకమంది రుషులతో సహా సభ నుండి వెళ్ళిపోయాడు.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Telugu Topics

Telugu Topics

శివుడు

Click on any topic to open

Please wait while the audio list loads..

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |