శేషశైలావాస శ్రీవెంకటేశా

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

 

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ

ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి..

మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా..

 

పట్టు పానుపుపైన పవళించర స్వామి..

పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ..

చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము..

చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము.

 

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

123.6K
18.8K

Comments

ytcy5
ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద.... ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా గోవిందా గోవింద.... శేష శైలా వాసా శ్రీ వేంకటేశ అంటూ తన గాన మాధుర్యంతో ఆ వేంకటేశ్వరుని అనుగ్రహం పొందిన ఘంటసాల గారు ధన్యులు..... విన్నవారి జన్మ ధన్యం కదా.... గోవింద నామ స్మరణం పూర్వ జన్మ సుకృతం.....😌😇 -Srilakshmi

ఘంటసాల గారు మీ గాన అమృతం శ్రీనివాసుడే ప్రత్యక్షమై నట్టు ఉంది గోవిందా గోవిందా 🙏🌺🌺 -Ramakrishna

శేష శైలా వాస శ్రీ వెంకటేశ..... అనునిత్యము ఏడుకొండలపైన ప్రతిధ్వనించు భక్తి పరవశం.... 🙏 -Subbirami Reddy

ఓం నమో వేంకటేశాయ👍❤️💯 -Srinivasamurthy

మధురమైన పాట, ఆ అమర గంధర్వ నట గాయకులు ఘంటసాల గారు పాడిన 60 ఏళ్ల క్రితం పాట ఇప్పటికీ సూపర్ హిట్ 👍❤️ -Kothur Murthy

Read more comments

బ్రహ్మవాదినీ మరియు ఋషికాలు ఒకరేనా?

బ్రహ్మవాదీ అంటే వేదాల యొక్క శాశ్వతమైన జ్ఞానం గురించి మాట్లాడే వ్యక్తి. బ్రహ్మవాదినీ ఒక మహిళా పండితురాలు, బ్రహ్మవాది యొక్క స్త్రీ లింగం. ఒక ఋషి ఒక పురుషుడు, వీరికి ఒక మంత్రం వెల్లడి చేయబడింది. ఒక ఋషికా ఒక స్త్రీ, వీరికి ఒక మంత్రం వెల్లడి చేయబడింది. ఋషికులందరూ బ్రహ్మవాదినీలే, కానీ బ్రహ్మవాదినీ అందరూ ఋషికులు కాకూడదు.

హనుమాన్ జీ ఏ లక్షణాలు లేదా సద్గుణాలను సూచిస్తాడు?

హనుమాన్ జీ భక్తి, విధేయత, ధైర్యం, బలం, వినయం మరియు నిస్వార్థతకు ప్రతీక. ఇది మీ స్వంత జీవితంలో ఈ సద్గుణాలను పొందుపరచడానికి, వ్యక్తిగత ఎదుగుదల మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించడానికి మీకు స్ఫూర్తినిస్తుంది మరియు మార్గనిర్దేశం చేస్తుంది

Quiz

సంతానం కోసం వ్యాసుడు ఎక్కడ తపస్సు చేశాడు?
Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |