బ్రంహమొక్కటే

తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన
బ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె
కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతానొక్కటె
అందరికి శ్రీహరే అంతరాత్మ
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె
అంటనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె
చండాలు డుండేటి సరిభూమి యొకటే
కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె

 

Bramham Okate by Singer Vijay Prakash

 

43.9K

Comments

zs67h

ఋషి మరియు ముని మధ్య తేడా ఏమిటి?

ఋషి అంటే కొంత శాశ్వతమైన జ్ఞానం వెల్లడి చేయబడిన వ్యక్తి. అతని ద్వారా, ఈ జ్ఞానం మంత్రం రూపంలో వ్యక్తమవుతుంది. ముని అంటే జ్ఞాని, తెలివైనవాడు మరియు లోతైన ఆలోచనా సామర్థ్యం ఉన్నవాడు. మునిలకు కూడా తాము చెప్పేదానిపై నియంత్రణ ఉంటుంది.

మరణం యొక్క సృష్టి

సృష్టించే సమయంలో, బ్రహ్మ ఈ ప్రపంచం త్వరలోనే జీవచేతులతో నిండిపోతుందని ఊహించలేదు. బ్రహ్మ ప్రపంచ పరిస్థితిని చూసి ఆందోళన చెందాడు మరియు అన్ని వస్తువులను దహనం చేయడానికి అగ్నిని పంపాడు. భగవాన్ శివుడు జోక్యం చేసుకొని జనాభాను నియంత్రించడానికి ఒక వ్యవస్థతో కూడిన మార్గాన్ని సూచించాడు. అప్పుడు బ్రహ్మ ఆ విధానాన్ని అమలు చేయడానికి మరణాన్ని మరియు మరణదేవతను సృష్టించాడు

Quiz

షట్చక్రాలలో గణపతి స్థానం ఏది?
Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |