గరుడగమన రారా

గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమ పురుష యే వెరపు లేక నీ మరుగు జొచ్చితి నన్నరమర సేయకు
పిలువగానే రమ్మి నాకభయము తలపగానే యిమ్మి
కలిమి బలిమి నా కిలలోనివని కలవరించితిని నలువను గన్నయ్య
పాల కడలిశయన దశరథ బాల జలజ నయన
పాలముంచు నను నీళ్ళముంచు నీపాల బడితి నికజాలము సేయకు
ఏల రావు స్వామి నను నిపుడేవకోవదేమి
ఏలువాడని చాల నమ్మితి నేల రావు కరుణాలవాల హరి
ఇంత పంతమేల భద్రగిరీష వర కృపాళ చింతలణచి
శ్రీ రామదాసునియంతరంగ పతియై రక్షింపుమి

 

 

12.9K

Comments

j7km6

హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడా?

అవును. హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడు. ఎక్కువగా గంధమాదన పర్వతం పైన తపస్సులో మునిగి ఉంటాడు. శ్రీరాముని అవతారం 24వ త్రేతాయుగంలో అయింది. ప్రస్తుత ఇరవై ఎనిమిదవ(28) చతుర్యుగం తాలుక, ద్వాపరయుగంలో, దాదాపు ఒక కోటి డబ్భై అయిదు లక్షల సంవత్సరాల తరువాత, సౌగంధికా పుష్పాలను పొందేందుకు వెళ్లినప్పుడు, భీముడు అతనిని కలిశాడు. ఎనిమిది మంది చిరంజీవిలలో హనుమంతుడు ఒకడు. అతను రెండు వందల ముప్ఫై అయిదు కోట్ల తొంభై ఒక లక్షల నలబై ఆరు వేల ఎనిమిది వందల డబ్భై ఏడు (2,35,91,46,877) సంవత్సరాల దూరంలో ఉన్న కల్పం ముగిసే వరకు జీవించే ఉంటాడు.

నరసింహుడు అహోబిలాన్ని ఎందుకు తన నివాసంగా ఎంచుకున్నాడు?

ఇక్కడే హిరణ్యకశిపుని సంహరించినందున నరసింహ భగవానుడు అహోబిలాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు. ఈ సంఘటన తరువాత, హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లాదుడు, విష్ణువు యొక్క గట్టి భక్తుడు, అహోబిలాన్ని తన శాశ్వత నివాసంగా మార్చమని నరసింహుడిని ప్రార్థించాడు. ప్రహ్లాదుని హృదయపూర్వక ప్రార్థనలకు ప్రతిస్పందించిన నరసింహ భగవానుడు ఈ ప్రదేశాన్ని తన నివాసంగా చేసుకొని అనుగ్రహించాడు. నరసింహ భగవానుడు అహోబిలాన్ని తన నివాసంగా ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకోవడం వల్ల మీ ఆధ్యాత్మిక అంతర్దృష్టి మరింతగా పెరుగుతుంది, భక్తిని ప్రేరేపిస్తుంది మరియు తీర్థయాత్ర అనుభవాలను సుసంపన్నం చేస్తుంది

Quiz

మహాత్మా గాంధీ ఏ విధమైన పఠనాన్ని సిఫార్సు చేశారు?
Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |