బ్రహ్మమొకటే

తందనాన అహి - తందనాన పురె
తందనాన భళా తందనాన

బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే
బ్రహ్మమొకటే - పర బ్రహ్మమొకటే

కందువగు హీనాధికములిందులేవు
అందరికీ శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకులమంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే
అండనే బంటు నిద్ర - అదియు ఒకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే
చండాలుడుండేటి సరిభూమి ఒకటే

అనుగు దేవతలకును అల కామ సుఖమొకటే
ఘన కీట పశువులకు కామ సుఖమొకటే
దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటే
ఓనర నిరుపేదకును ఒక్కటే అవియు

కొరలి శిష్టాన్నములు తును నాకలొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే
పరగ దుర్గంధములపై వాయువొకటే
వరస పరిమళముపై వాయువొకటే

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే
కడు పుణ్యులను పాప కర్ములను సరిగా వా
జడియు శ్రీ వేంకటేశ్వరునామమొకటే

Devotional Music

Devotional Music

భక్తి పాటలు

Click on any topic to open

0

Copyright © 2026 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize

We use cookies