ఉత్తర నక్షత్రం

Uttara Phalguni Nakshatra symbol hammock

 

సింహ రాశి 26 డిగ్రీల 40 నిమిషాల నుండి కన్యా రాశి 10 డిగ్రీల వరకు వ్యాపించే నక్షత్రాన్ని ఉత్తర (ఉత్తరఫాల్గుణి) అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది 12వ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, ఉత్తర Denebolaకు అనుగుణంగా ఉంటుంది. 

లక్షణాలు

ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు:

రెండు రాశులకు ఉమ్మడిగా

 • శక్తివంతమైనవారు
 • గౌరవనీయులు
 • కీర్తిగలవారు
 • స్వచ్ఛమైనవారు
 • ఏదైనా అంగీకరించగలవారు
 •  సంపన్నులు
 • ఆశావాదులు
 • నాయకత్వపు లక్షణాలు ఉంటాయి
 • కష్టపడి పనిచేసేవారు
 • స్వీయ కేంద్రీకృతం కలవారు
 • శాస్త్రజ్ఞులు
 • జనాదరణ పొందినవారు
 • దయాదులు

ఉత్తర  నక్షత్రం - సింహ రాశి వారికి మాత్రమే

 • ప్రతిష్టాత్మకమైనవారు
 • స్వతంత్రంగా ఉంటారు
 • అధికృతం
 • ఎనర్జిటిక్
 • ఉల్లాసంగా ఉంటారు
 • అణకువగా ఉంటారు
 •  ప్రగల్భాలు ఉంటాయి
 •  అసూయపడే వారు
 •  ప్రదర్శించడానికి ఇష్టపడతారు
 • మొండివారు
 •  పురుషులకు మంచిది

 ఉత్తర నక్షత్రం - కన్యా రాశి వారికి మాత్రమే 

 • చర్చలలో నైపుణ్యం
 • తెలివైనవారు
 • నైపుణ్యం కలవారు
 •  వ్యాపార నైపుణ్యాలు ఉంటాయి
 •  విశ్లేషణ నైపుణ్యాలు ఉంటాయి
 •  స్త్రీలకు మంచిది
 • పురుషులు స్త్రీ లక్షణాలను ప్రదర్శించవచ్చును
 • మితిమీరిన ఇంద్రియాలు

ప్రతికూల  నక్షత్రాలు 

 • చిత్త.
 • విశాఖ.
 • జ్యేష్ట.
 • ఉత్తర నక్షత్రం - సింహ రాశి వారికి -   పూర్వాభాద్రా- మీన రాశి, ఉత్తరాభాద్ర,రేవతి. 
 • ఉత్తర నక్షత్రం- కన్యా రాశి వారికి -  అశ్విని, భరణి, కృత్తిక - మేష రాశి. 

ఉత్తర  నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

ఆరోగ్య సమస్యలు

ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు:

 ఉత్తర నక్షత్రం - సింహ రాశి

 • వెన్నునొప్పి
 • తలనొప్పి
 • రుమాటిజం
 • రక్తపోటు
 • మూర్ఛ రుగ్మత
 • మానసిక రుగ్మతలు
 • తట్టు (మిజిల్స)
 • టైఫాయిడ్

ఉత్తర నక్షత్రం - కన్యా రాశి

 •  ప్రేగుల వాపు
 •  కడుపు సమస్యలు
 • పేగు బ్లాక్
 • గొంతు మరియు మెడలో వాపు
 • కాలేయ సమస్యలు
 • జ్వరం

అనుకూలమైన కెరీర్

ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

ఉత్తర నక్షత్రం - సింహ రాశి

 • ప్రభుత్వ సేవ
 • వైద్యం
 • రక్షణ సేవ
 • మర్చంట్ నేవీ
 • వ్యాపారం
 • స్టాక్ మార్కెట్
 • గుండె నిపుణులు
 •  గైనకాలజిస్ట్

 ఉత్తర నక్షత్రం - కన్యా రాశి

 • జర్నలిస్ట్
 •  ప్రచురణ
 • రచయిత
 • ప్రజా సంబంధాలు
 • దౌత్యవేత్త
 • నిర్వాహకుడు
 • ఖగోళ శాస్త్రవేత్త
 • జ్యోతిష్యం
 • గ్రాఫోలజిస్ట్
 • ఫోన్ పరిశ్రమ
 • గనుల తవ్వకం
 • కాంట్రాక్టర్
 • మధ్యవర్తి
 • గుండె నిపుణులు
 • కంటి నిపుణులు
 • ఆరోగ్య నిపుణులు
 • రసాయనాలు
 • ప్రయాణం మరియు పర్యాటకం
 • పోస్టల్ సేవలు
 • కొరియర్
 • రసాయన శాస్త్రవేత్త
 • వైద్యం
 • సంగీత వాయిద్యాలు

ఉత్తర నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

ఉత్తర నక్షత్రం సింహ రాశి - ధరించరాదు.

ఉత్తర నక్షత్రం కన్యా రాశి - ధరించవచ్చు.

అదృష్ట రాయి

కెంపు (Ruby)

అనుకూలమైన రంగులు

ఎరుపు, కుంకుమ, ఆకుపచ్చ.

ఉత్తర నక్షత్రానికి పేర్లు

ఉత్తర నక్షత్రానికి అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం: 

 • మొదటి చరణం - టే
 • రెండవ చరణం - టో
 • మూడవ చరణం - పా
 • నాల్గవ చరణం - పీ

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్యల/నానమ్మల పేర్లను ఉంచుతారు. ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎటువంటిి  నష్టం లేదు. రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. దీనిని వ్యవహారిక నామం అంటారు. పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు -

 • ఉత్తర  నక్షత్రం సింహ రాశి - త, థ, ద, ధ, న, య, ర, ల, వ, ఎ, ఐ, హ.
 • ఉత్తర  నక్షత్రం కన్యా రాశి - ప, ఫ, బ, భ, మ, అ, ఆ, ఇ, ఈ, శ, ఓ, ఔ

వివాహం

 

ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా ఉల్లాసంగా ఉంటారు, వారి వైవాహిక జీవితం సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది. వారు బయటి నుండి సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

 నివారణలు

ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి సాధారణంగా కుజ/మంగళ, బుధ, గురు/బృహస్పతి కాలాలు   ప్రతికూలంగా ఉంటాయి.

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు. 

 • మృత్యుంజయ హోమం నిర్వహించడం
 • ఉత్తర నక్షత్రం సింహ రాశి - సూర్య శాంతి హోమం నిర్వహించడం
 • ఉత్తర నక్షత్రం  కన్యా రాశి - బుధ శాంతి హోమం నిర్వహించడం
 • ఈ శివ మంత్రాన్ని ప్రతిరోజూ వినండం
 • ఉత్తర నక్షత్రం  సింహ రాశి - ఈ సూర్య మంత్రాన్ని ప్రతిరోజూ వినండి
 • ఉత్తర నక్షత్రం  కన్యా రాశి -  ఈ బుధ మంత్రాన్ని ప్రతిరోజూ వినండి

మంత్రం

ఓం భగాయ నమః

ఉత్తర నక్షత్రం

 • భగవంతుడు - భగ
 • పాలించే గ్రహం - సూర్యుడు
 • జంతువు - ఒంటె
 • చెట్టు - Ficus microcarpa
 • పక్షి - కాకి
 • భూతం - అగ్ని
 • గణం - మనుష్య
 • యోని - ఆవు/ఎద్దు (మగ) 
 • నాడి - ఆద్య
 • చిహ్నం - ఊయల

 

Recommended for you

 

Video - జయ జనార్ధన 

 

జయ జనార్ధన

 

 

Video - Sri Rama Rajyam (శ్రీ రామ రాజ్యం) Telugu Movie Full Songs 

 

Sri Rama Rajyam (శ్రీ రామ రాజ్యం) Telugu Movie Full Songs

 

 

Video - Vakratunda Stava 

 

Vakratunda Stava

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Active Visitors:
4018716