స్వాతి నక్షత్రం

Swati Nakshatra symbol coral

 

తులా రాశి 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 20 డిగ్రీల వరకు వ్యాపించే నక్షత్రాన్ని స్వాతి అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది 15వ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, స్వాతి Arcturusకు అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు: 

  • తెలివైనవారు
  • జీవితంలో సుఖంగా ఉంటారు
  • ధార్మికమైనవారు
  • నీతిమంతులు
  • దయాదులు
  • ప్రతిష్టాత్మకమైనవారు
  • తెలివైనవారు
  • చక్కని భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఉంటాయి
  • కళలు, సంగీతం పట్ల ఆసక్తి
  • మద్యపానం, ధూమ్రపానం మొదలైన వాటిపై మొగ్గు
  • చిన్నబుచ్చుకునేవారు
  • స్వతంత్ర ఆలోచన ఉంటుంది
  • మానవీయులు
  • అణకువగా ఉంటారు
  • సహజమైన మధురమైన ప్రవర్తన
  • వ్యాపార నైపుణ్యాలు ఉంటాయి
  •  క్రమబద్ధమైనవారు

ప్రతికూల నక్షత్రాలు

  • అనురాధ
  •  మూల
  • ఉత్తరాషాడ
  • కృత్తిక - వృషభ రాశి
  •  రోహిణి
  •  మృగశిర - వృషభ రాశి

స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

ఆరోగ్య సమస్యలు

స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు:

  • మూత్ర సంబంధ వ్యాధులు
  • చర్మ వ్యాధులు
  •  ల్యూకోడెర్మా
  •  కుష్టు వ్యాధి
  •  మధుమేహం
  •  కిడ్నీ సమస్యలు

అనుకూలమైన కెరీర్

స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

  • విద్యుత్తు పరికరములు
  • వాహనాలు
  • రవాణా
  •  ప్రయాణం మరియు పర్యాటకం
  • సినిమా
  • టి.వి. 
  • సంగీతం
  • కళలు 
  • ప్రదర్శనలు
  • అలంకరణలు
  • శాస్త్రవేత్త
  • న్యాయమూర్తి
  • కవి
  • యాంకర్
  • బేకరీ
  • పాల వ్యాపారం
  • లెదర్ ఇండస్ట్రీ
  • వంట
  • అటెండర్
  • ఫోటోగ్రఫీ
  • వీడియోగ్రఫీ
  • వస్త్రాలు పరిమళ ద్రవ్యాలు
  • ప్లాస్టిక్స్
  • గాజు

స్వాతి నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

ధరించవచ్చు.

అదృష్ట రాయి

గోమేధికం.

అనుకూలమైన రంగులు

నలుపు, తెలుపు, లేత నీలం.

స్వాతి నక్షత్రానికి పేర్లు

స్వాతి నక్షత్రం కోసం అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:-

  • మొదటి చరణం - రూ
  • రెండవ చరణం - రే
  • మూడవ చరణం - రో
  • నాల్గవ చరణం - తా

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్యల/నానమ్మల పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. 

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - య, ర, ల, వ, ఉ, ఊ , ఋ, ష, అం, అః, క్ష.

వివాహం

స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సుఖవంతమైన మరియు విజయవంతమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారు.

వారు గొప్పవారు, మంచి మర్యాదలు కలిగి ఉంటారు మరియు వారి జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉంటారు. 

పురుషులు మద్యపానం వంటి దురాచారాలకు దూరంగా ఉండాలి. 

నివారణలు

స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి సూర్య, శని, కేతువుల కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు.

మంత్రం

 ఓం వాయవే నమ

స్వాతి నక్షత్రం

  • భగవంతుడు - వాయు
  •  పాలించే గ్రహం - రాహువు
  • జంతువు - గేదె
  • చెట్టు - అర్జున్ చెట్టు (టెర్మినలియా అర్జున)
  • పక్షి. - కాకి
  •  భూతం - అగ్ని
  •  గణం - దేవ
  •  యోని - గేదె (మగ)
  • నాడి - అంత్య
  • చిహ్నం - పగడం

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |