విశాఖ నక్షత్రం

Vishakha Nakshatra symbol potter wheel

 

20 డిగ్రీల తులారాశి నుండి 3 డిగ్రీల 20 నిమిషాల వృశ్చిక రాశి వరకు వ్యాపించే నక్షత్రాన్ని విశాఖ అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది 16వ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, విశాఖ α Zubenelgenubi, β Zubeneschamali, γ and ι Libraeలకు అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు 

విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు: 

రాశులిద్దరికీ ఉమ్మడిగా 

  • నీతిమంతులు
  • దయాదులు
  • ధార్మికమైనవారు
  • తెలివైనవారు
  • మధురంగా ​​మాట్లాడుతారు
  • చిన్నబుచ్చుకునేవారు
  • పనిలో మంచిగా ఉంటారు
  • బాల్యంలో కష్టాలు ఉంటాయి
  • తండ్రి నుంచి పెద్దగా సపోర్ట్ ఉండదు
  • అహంభావి
  • మొండి-పట్టుదలగలవారు
  • కొన్నిసార్లు సంప్రదాయవాదిగా ఉంటారు

విశాఖ నక్షత్రం తులారాశి వారికి మాత్రమే 

  • ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది
  • మధురమైన ప్రవర్తన ఉంటుంది
  •  అణకువగా ఉంటారు
  •  పుణ్యాత్ములు
  •  నిజాయితీపరులు
  •  సంస్కారవంతమైనవారు
  •  మంచి నడవడిక ఉంటుంది

విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి వారికి మాత్రమే 

  • ప్రభావవంతమైనవారు
  • ఎనర్జిటిక్
  • గౌరవనీయులు
  • డిగ్నిఫైడ్ గా ఉంటారు
  • నేరుగా ముందుకు ఉంటారు
  • స్వతంత్ర ఆలోచనాపరులు
  • ఖర్చుకారి
  • వాదనాకారి

ప్రతికూల నక్షత్రాలు  

  • జ్యేష్ట
  • పూర్వాషాడ
  • శ్రవణం
  • విశాఖ తుల రాశి -  కృత్తిక  వృషభ రాశి, రోహిణి, మృగశిర వృషభ రాశి 
  • విశాఖ వృశ్చిక రాశి - మృగశిర మిథున రాశి, ఆరుద్ర, పునర్వసు-మిథున రాశి 

విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

ఆరోగ్య సమస్యలు 

విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ క్రింది ఆరోగ్య సమస్యలు ఉంటాయి: 

విశాఖ తులా రాశి

  • మధుమేహం
  • మూర్ఛ
  • కిడ్నీ సమస్యలు

విశాఖ వృశ్చిక రాశి

  • గర్భాశయ సమస్యలు
  • ప్రోస్టేట్ విస్తరణ
  • మూత్ర సంబంధ వ్యాధులు
  • రక్తము పలుచబడుట
  • రక్తస్రావం
  • కిడ్నీ రాయి
  • పుండు
  • ఎడెమా
  • నాసికా రక్తస్రావం

అనుకూలమైన కెరీర్ 

 విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

విశాఖ నక్షత్రం తులా రాశి

  • ట్రావెల్ ఏజెంట్
  • పర్యాటకరంగం
  • అంతర్జాతీయ అనుసంధానం
  • షిప్పింగ్
  • విమానయానం
  • ఇంటి నిర్మాణం
  • అంతర్జాతీయ వాణిజ్యం
  • పండ్లు తోటలు
  • రేటింగ్
  • పన్ను శాఖ
  • ప్రభుత్వ సేవ
  • సినిమా
  • టి.వి. 
  • పర్యాటకరంగం
  • గనుల తవ్వకం
  • ఆడిటర్
  • రత్నాలు
  • పరిమళ ద్రవ్యాలు
  • ప్రచురణ
  • జర్నలిస్ట్
  • వైద్యం
  • ఆడిటర్
  • వ్యాఖ్యానం
  • టీచర్

విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి 

  • భీమా
  • బ్యాంకింగ్
  • న్యాయంవాదం
  • క్రిమినాలజిస్ట్
  • రసాయనాలు
  • ఫార్మసిస్ట్
  • రియల్ ఎస్టేట్
  • పోర్ట్ సంబంధిత
  • భద్రత
  • మధ్యవర్తి వ్యవహారం
  • ఆయుర్వేదం

విశాఖ నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా?  

  • విశాఖ తులా రాశి - ధరించవచ్చు 
  • విశాఖ వృశ్చిక రాశి - ధరించరాదు 

అదృష్ట రాయి 

పుష్యరాగం

అనుకూలమైన రంగులు

  •  విశాఖ తులా రాశి - పసుపు, మీగడ రంగు, తెలుపు, లేత నీలం
  •  విశాఖ వృశ్చిక రాశి - పసుపు, మీగడ రంగు, ఎరుపు

విశాఖ నక్షత్రానికి పేర్లు

విశాఖ నక్షత్రానికి అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

  • మొదటి చరణం - తీ
  • రెండవ చరణం -తూ
  • మూడవ చరణం - తే
  • నాల్గవ చరణం - తో

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని కమ్యూనిటీలలో, నామకరణ వేడుకలో తాతామామ్మల పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు.

 పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరుతో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు:

 

  • విశాఖ నక్షత్రం తులా రాశి - య, ర, ల, వ, ఉ, ఊ, ఋ. ష, అం, అః, క్ష
  • విశాఖ నక్షత్రం వృశ్చిక  రాశి - అ, ఆ, ఇ, ఈ, శ, స, క, ఖ, గ, ఘ

వివాహం

విశాఖ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు తమ భర్తలను చిత్తశుద్ధితో ప్రేమిస్తారు. 

వారు శ్రేష్ఠులు మరియు పవిత్రులు. 

భార్యాభర్తలు వేర్వేరు ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంటుంది. 

నివారణలు:

విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి చంద్ర, బుధ, శుక్ర కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు -

మంత్రం

ఓం ఇంద్రాగ్నిభ్యాం నమః

విశాఖ నక్షత్రం

  • భగవంతుడు - ఇంద్రాగ్ని 
  • పాలించే గ్రహం - గురుడు/బృహస్పతి
  • జంతువు - సింహం
  • చెట్టు - Flacourtia montana
  • పక్షి - కాకి
  • భూతం - అగ్ని
  • గణం - అసుర
  • యోని - పులి (మగ)
  • నాడి - అంత్య
  • చిహ్నం - కుమ్మరి చక్రం

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |