పాహి రామ ప్రభో

పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో


ఇందిరా హృదయార విందాధిరూఢ సుందరాకార నానంద రామ
ఎందునేజూడ మీ సుందరానందమును కందునో కన్నులింపొంద శ్రీ రామ


బృందారకాది బృందార్చిత పదారవిందముల(నీ) సందర్శితానంద
తల్లివి నీవె మా తండ్రివి నీవె మా దాతవు నీవు మా భ్రాత రామ ప్ర ||


నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపుకున్నా వదేమి రా
ఆది మధ్యాంత బహిరంతరాత్మ డనుచు వాదింతునే జగన్నాధ రామ


శ్రీ రామ రామేతి శ్రేష్ట మంత్రము సారె సారెకును వింతగా జదువ రామ
శ్రీ రామ నీ నామ చింత నామృత పాన సారమే నాదు మదిగోరు రా


కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలిసితివి భద్రాద్రి నిలయ రా
అవ్యయుడవైన నీ యవతారముల వలన దివ్యులైనారు మునులయ్య రా


పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్ర శైల రా
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో

Devotional Music

Devotional Music

భక్తి పాటలు

Click on any topic to open

0

Copyright © 2026 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize

We use cookies