కృత్తికా నక్షత్రం

Krittika Nakshatra Symbol


మేష రాశి 26 డిగ్రీల 40 నిమిషాల నుండి వృషభ రాశి 10 డిగ్రీల వరకు వ్యాపించే నక్షత్రాన్ని కృత్తిక అంటారు. వైదిక ఖగోళ శాస్త్రంలో ఇది మూడవ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, కృత్తికా ప్లీయేడ్స్‌కు అనుగుణంగా ఉంటుంది.

Click below to listen to Veda Mantra of Krittika Nakshatra  

 

Krittika Nakshatra Veda Mantra

 

కృత్తిక నక్షత్ర అధిపతి

కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్ని.

 

కృత్తికా నక్షత్రం పాలించే గ్రహం

సూర్యుడు.

 

కృత్తికా నక్షత్ర లక్షణాలు

కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు:

రాశులిద్దరికీ ఉమ్మడిగా

  • సంకల్ప శక్తి
  • మాట్లాడటం ఇష్టం కళాత్మకమైనవారు
  • ఆడంబరం ఇష్టం
  • తల్లిదండ్రులు మరియు తోబుట్టువుల నుండి తక్కువ మద్దతు
  • చిన్నబుచ్చుకునేవారు
  • మొండి పట్టుదలగలవారు విమర్శించడం ఇష్ట పడరు
  • కారంగా ఉండే ఆహారం ఇష్టం

కృత్తిక నక్షత్రం మేష రాశి వారికి మాత్రమే

  • చాలా చురుకుగా
  • ఆరోగ్యకరంగా ఉంటారు
  • పురోగతికి ఆత్రుత
  • నాయకత్వపు లక్షణాలు
  • వాదించే మరియు ఒప్పించే శక్తి ప్రసిద్ధి
  • పోటీ చేసే ధోరణి
  • దూకుడు
  • వివాహేతర సంబంధాలకు మొగ్గు

కృత్తిక నక్షత్రం వృషభ రాశి వారికి మాత్రమే

  • పౌర భావం
  • మంచి హోస్ట్
  • దయాదులు
  • మంచి స్నేహితులు
  • జీవితాన్ని ఆనందిస్తారు
  • జనాదరణ పొంది ఉంటారు
  • ప్రభావవంతమైన వారు
  • ఆహ్లాదకరమైన వారు
  • సృజనాత్మకమైన వారు
  • విజయవంతమైనవారు
  • తెలివైన వారు
  • వ్యాపార నైపుణ్యాలు ఉంటాయి
  • ఊహాగానాలు మరియు జూదంలో ఆసక్తి
  • ప్రత్యర్థులపై కఠినంగా వ్యవహరిస్తారు

 

కృత్తికకు ప్రతికూలమైన నక్షత్రాలు

  • మృగశిర
  • పునర్వసు
  • ఆశ్లేష
  • కృత్తిక మేష రాశి వారికి - విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ట
  • కృత్తిక వృషభ రాశి వారికి - మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం

కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

 

కృత్తిక నక్షత్రం యొక్క ఆరోగ్య సమస్యలు

కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు:

కృత్తిక మేష రాశి

  • జ్వరం
  • మలేరియా
  • మశూచి
  • తట్టు
  • కారణం తెలియని మెదడువాపు వ్యాధి ప్రమాదాలు
  • గాయాలు
  • పుండ్లు
  • కాలిన గాయాలు
  • పేలుళ్ల నుండి గాయాలు
  • ఫైలేరియాసిస్

కృత్తిక వృషభ రాశి

  • మొటిమలు
  • కంటి వ్యాధులు
  • గాయాలు
  • టాన్సిలిటిస్
  • మెడ నొప్పి మరియు దృఢత్వం
  • నాసికా పాలిప్స్
  • బొబ్బలు
  • దద్దుర్లు
  • మూర్ఛ
  • మోకాలి కణితి

 

కృత్తిక నక్షత్రం వృత్తి

కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు:

కృత్తికా నక్షత్రం మేష రాశి

  • రక్షణ సేవలు
  • పోలీసు
  • తయారీ పనులు
  • వైద్యం
  • సర్జన్
  • భద్రత
  • రసాయనాలు
  • ఆయుధాలు
  • పేలుడు పదార్థాలు
  • అగ్ని మరియు భద్రత
  • రియల్ ఎస్టేట్
  • నిర్మాణం
  • ఉక్కు మరియు ఇత్తడి పాత్రల పరిశ్రమ
  • క్షౌరశాల
  • కుమ్మరి
  • పూజారి
  • జ్యోతిష్యుడు

కృత్తికా నక్షత్రం వృషభ రాశి

  • ప్రభుత్వ ఒప్పందాలు
  • విదేశాలతో వ్యాపారం
  • వస్త్రాలు
  • రత్నాలు మరియు నగలు రుణాల రికవరీ
  • కళలు
  • పెయింటింగ్ మరియు గ్రాఫిక్స్
  • శిల్పం
  • ఫోటోగ్రఫీ
  • పట్టు
  • అంతర్జాతీయ వాణిజ్యం
  • మేకప్
  • అంతర్గత అలంకరణ
  • ఆరోగ్య నిపుణులు
  • ఇంజనీర్
  • పన్ను అధికారి
  • వెనెరియాలజిస్ట్
  • ఉన్ని పరిశ్రమ

 

కృత్తికా నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా?

  • కృత్తిక మేష రాశి - ఒద్దు ధరించరాదు
  • కృత్తిక వృషభ రాశి - ధరించవచ్చు

 

కృత్తికా నక్షత్రం అదృష్ట రాయి

రూబీ.

 

కృత్తికా నక్షత్రం అనుకూలమైన రంగు

ఎరుపు, కుంకుమ

 

కృత్తికా నక్షత్ర జంతువు - మేక
కృత్తికా నక్షత్రం చెట్టు - అత్తి చెట్టు
కృత్తిక నక్షత్ర పక్షి - శిక్ర
కృత్తికా నక్షత్ర భూతం - పృథ్వీ
కృత్తిక నక్షత్ర గణం - అసుర
కృత్తికా నక్షత్ర యోని - మేక (ఆడ)
కృత్తికా నక్షత్ర నాడి - అంత్య
కృత్తికా నక్షత్రం గుర్తు - గొడ్డలి

 

కృత్తిక నక్షత్రానికి పేర్లు

కృత్తిక నక్షత్రం కోసం అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

  • మొదటి చరణం - ఆ
  • రెండవ చరణం - ఈ
  • మూడవ చరణం - ఊ
  • నాల్గవ చరణం - ఏ

నామకరణం సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్రం పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు.

కొన్ని సంఘాలలో, నామకరణం సమయంలో తాత, నానమ్మల పేర్లను ఉంచుతారు. ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు.

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. దీనిని వ్యవహారిక నామం అంటారు. పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి.

కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరుతో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు -

  • కృత్తికా నక్షత్రం మేష రాశి - అం, క్ష, చ, ఛ, జ, ఝ, య, ర, ల, వ
  • కృత్తిక నక్షత్రం వృషభ రాశి - క, ఖ, గ, ఘ, ట, ఠ, డ, ఢ, అ, ఆ ఇ, ఎ, ష

 

కృత్తికా నక్షత్రం యొక్క వివాహ జీవితం

కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు దూకుడు మరియు కలహాలు కలిగి ఉంటారు, వారి వైవాహిక జీవితం సాధారణంగా, గందరగోళంగా ఉంటుంది. వారు కుటుంబానికి వెలుపల ఉన్నవారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. వారు జీవిత భాగస్వామికి నమ్మకద్రోహం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి

 

కృత్తికా నక్షత్ర పరిహారాలు

కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి కుజ, బుధ మరియు గురు కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు.

 

కృత్తికా నక్షత్ర మంత్రం

ఓం అగ్నయే నమః

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |