ఎండి కొండాలు ఏలేటోడా

ఎండి కొండాలు ఏలేటోడా...
అడ్డబొట్టు శంకరుడా...
జోలే వట్టుకోనీ తిరిగెటోడా...
జగాలను గాసే జంగముడా.....

.....
ఎండి కొండాలు ఏలేటోడా...
అడ్డబొట్టు శంకరుడా....
జోలే వట్టుకోనీ తిరిగెటోడా...
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
నాగభరణుడా...నంది వాహనుడా
కేదారినాధుడా...కాశీవిశ్వేశ్వరుడా
భీమా శంకరా...ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా...మా రాజరాజేశ్వరా
ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా..
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా...
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
......

పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే
పలరాలు పంచేరే...పలరాలు పంచేరే
గండాదీపాలు ఘనముగా వెలిగించేరే
గండాలు పాపమని పబ్బతులు పట్టేరే
పబ్బతులు పట్టేరే
లింగనా రూపాయి తంబాన కోడేను...
కట్టినా వారికి సుట్టనీవే
తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు
మొక్కినా వారికీ దిక్కు నీవేలే
వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే
పలికేటి దేవుడావే
కోరితే కోడుకులనిచ్చి...
అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే...మా ఇంటి దేవుడవే
ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా..
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
....

నీ ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదే
నరులకు అందని నీ లీలలూ చిత్రాలులే
లీలలూ చిత్రాలులే
కొప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ
ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడవే
ముక్కంటిశ్వరుడవే

నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడా కరుణాలాదేవుడా
కరునించామని నిన్నూ వేడుకుంటామే
త్రీలోక పూజ్యూడా... త్రీశూల ధారుడా
పంచభూతాలకు అధిపతివి నీవూరా
అధిపతివినీవురా
శరణుఅని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా
దేవనా దేవుళ్లు మెచ్చినొడా
ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా
ఆనంత జీవా కోటిని ఏలినోడా
నీవు అత్మాలింగనివిరా మాయలోడా
......
కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా
కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా
నటరాజు నాట్యాలు ఆడెటొడా
నాగుపాము ను మెడసుట్టూ సుట్టినోడా
నాగభరనుడా నంది వాహనుడా
కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓంకారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర
ఎండి కొండాలు ఏలేటోడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...

Devotional Music

Devotional Music

భక్తి పాటలు

Click on any topic to open

Copyright © 2025 | Vedadhara test | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...

We use cookies