ఎందరో మహానుభావులు

ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు ||

చందురు వర్ణుని అంద చందమును
హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు |

సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య
మూర్ధన్యులెందరో మహానుభావులు అందరికీ వందనములు || 1 ||

మానస వన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 2 ||

 

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 3 ||

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 4 ||

హరి గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు
భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 5 ||

హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల
జుచుచును పులక శరీరులై ఆనంద పయోధి
నిమగ్నులై ముదంబునను యశము గల
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 6 ||

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || 7 ||

నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను
వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల
జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద
కిర్తనము జేయు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 8 ||

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములను
శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల
భావంబుల నెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 9 ||

ప్రేమ ముప్పిరి గొన్న వేళ నామము దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 10 ||

ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు ||

Devotional Music

Devotional Music

భక్తి పాటలు

Click on any topic to open

Copyright © 2025 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...

We use cookies