ఆశ్లేష నక్షత్రం

Ashlesha Nakshatra symbol serpent

 

కర్కరాశి 16 డిగ్రీల 40 నిమిషాల నుండి 30 డిగ్రీల వరకు వ్యాపించే నక్షత్రాన్ని ఆశ్లేష అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది తొమ్మిదవ నక్షత్రం. 

ఆధునిక ఖగోళ శాస్త్రంలో, ఆశ్లేష δ, ε, η, ρ మరియు σ Hydraeలకు అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు - 

 • ధైర్యంగల స్వభావం
 • సందేహాస్పదమైనవారు
 • వైరుధ్య లక్షణం కలిగి ఉంటారు
 • సాథించే వారు
 • తెలివైనవారు
 • స్వార్థపరులకు
 • దూకుడుతనం ఉంటుంది
 • చక్కని భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఉంటాయి
 • వ్రాత నైపుణ్యాలు ఉంటాయి
 • బహు భాషా తెలిసినవారు
 • చెడు స్నేహం ఉంటుంది
 • సంగీతం మరియు కళల పట్ల ఆసక్తి
 • సాహిత్యంపై ఆసక్తి
 • ప్రయాణాలు అంటే ఇష్టం ఉంటుంది
 • అసూయపరులు
 • కృతజ్ఞత లేకపోవడం
 • జీవితంలో ప్రతికూల అంశాలను హైలైట్ చేస్తూ ఉంటారు
 • సంపన్నులు
 • సత్వర స్పందన
 • జీవితాన్ని అందిస్తారు
 • స్త్రీలు ఇంటి నిర్వహణలో నిష్ణాతులు

ప్రతికూల నక్షత్రాలు

 • పూర్వ ఫాల్గుణి.
 •  హస్త.
 • స్వాతి.
 • ధనిష్ట - కుంభ రాశి.
 • శతభిష.
 • పూర్వ భాద్రపద - కుంభ రాశి.

ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి. 

ఆరోగ్య సమస్యలు

ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి -

 • కీళ్ళనొప్పులు
 • శ్వాసకోశ వ్యాధులు
 • ఎడెమా
 • కామెర్లు
 • నరాల సమస్యలు
 • ఆందోళన
 • మానసిక రుగ్మతలు
 • అజీర్ణం
 • జలుబు మరియు దగ్గు
 • మోకాలి నొప్పులు
 • కాళ్ళలో నొప్పి
 • కిడ్నీ వ్యాధులు

అనుకూలమైన కెరీర్

ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు -

 • ట్రేడింగ్మ
 • మధ్యవర్తి వ్యవహారం
 • కమీషన్ ఏజెంట్
 • కళలు
 • సంగీతం
 • దిగుమతి ఎగుమతి వ్యాపారం
 • జర్నలిస్ట్ర
 • రచయిత
 • రంగు మరియు ఇంక్ పరిశ్రమ
 • డాటా ఎంట్రీ
 • ఆడిటర్
 • అనువాదం
 • దౌత్యవేత్త
 • ట్రావెల్ ఏజెంట్
 • టూర్ గైడ్
 • అటెండర్
 • నర్స్
 • గణిత శాస్త్రజ్ఞుడు
 • జ్యోతిష్యం
 • ఇంజనీర్
 • నీటి పారుదల
 • వస్త్ర వ్యాపారం
 • కాంట్రాక్టర్
 • స్టేషనరీ షాప్
 • పేపర్ పరిశ్రమ

ఆశ్లేష నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

అనుకూలంగా ఉండదు.

అదృష్ట రాయి 

పచ్చ.

అనుకూలమైన రంగులు

 ఆకుపచ్చ, తెలుపు.

 ఆశ్లేష నక్షత్రానికి పేర్లు

ఆశ్లేష నక్షత్రానికి అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

 • మొదటి చరణం- డీ
 • రెండవ చరణం - డూ
 • మూడవ చరణం - డే
 • నాల్గవ చరణం - డో

 నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్య- నానమ్మల పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. 

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - 

ట, ఠ, డ, ఢ, ప, ఫ, బ, భ, మ, స.

వివాహం

ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు వైవాహిక జీవితం కష్టతరంగా ఉండవచ్చు. 

తమ ఆధిపత్య స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. 

ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు తమ అనుమాన స్వభావాన్ని అదుపులో ఉంచుకోవాలి. 

వారు దాచవలసిన ధోరణిని కలిగి ఉంటారు. 

నివారణలు

ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి చంద్ర, శుక్ర, రాహు కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు . 

మంత్రం

 ఓం సర్పేభ్యో నమః.

ఆశ్లేష నక్షత్రం

 • భగవంతుడు - నాగ (పాము)
 • పాలించే గ్రహం - బుధుడు 
 • జంతువు - నల్ల పిల్లి
 • చెట్టు - నాగకేసరి
 • పక్షి - జెముడుకాకి
 • భూతం- జలం
 • గణం-అసుర
 • యోని - పిల్లి (మగ)
 • నాడి - అంత్య
 • చిహ్నం - పాము

 

Recommended for you

 

Video - Ashlesha Nakshatra Mantra 

 

Ashlesha Nakshatra Mantra

 

 

Video - Vishnu Sahasranamam 

 

Vishnu Sahasranamam

 

 

Video - Bhakthi Paatalu from Telugu Films 

 

Bhakthi Paatalu from Telugu Films

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Active Visitors:
4028726