శ్రీకాళహస్తి - FAQs

Other languages: English

శ్రీకాళహస్తి ఆలయం ఏ దేవుడిది?
శివుడిది. అతను భార్య జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి సమేతుడై పూజలు అందుకుంటున్నారు.

శ్రీకాళహస్తి కథ
శ్రీకాళహస్తి అనే పేరు మూడు భాగాలతో తయారు చేయబడింది- శ్రీ (సాలిపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). పరమశివుడు, శ్రీకాళహస్తీశ్వరుడు తనపై ఉన్న అమితమైన భక్తికి మెచ్చి ముగ్గురికీ మోక్షన్ని ప్రసాదించేడు. తన భక్తి యొక్క ఉచ్ఛస్థితిలో, వారు తమ ప్రాణాలను కూడా వదులుకోలేదు. సాలిపురుగు శివలింగాన్ని రక్షించడానికి దాని చుట్టూ తన జాలాన్ని నేసింది మరియు లింగాన్ని అంతటా పూజించింది. భగవంతుడు దాని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు, గాలి కారణంగా ఆలయంలో దీపం నుండి మంటలు వ్యాపించాయి. సాలిపురుగు ఆవేశంతో మంటలపై దాడి చేసి తన ప్రాణాలను పణంగా పెట్టింది. సాలిపురుగుకి మోక్షం లభించింది. ఒక పాము నాగలోకం నుండి విలువైన రత్నాలను తెచ్చి, వాటితో లింగాన్ని పూజించింది. పాము తరువాత, ఒక ఏనుగు సమీపంలోని నది నుండి బిల్వ ఆకులు మరియు నీటితో వచ్చీ, రత్నాలను తొలగించి, వాటి స్థానంలో తాను తెచ్చిన వాటిని సమర్పించింది. మరుసటి రోజు పాము తిరిగి వచ్చినప్పుడు, రత్నాలను తీసివేసి వాటి స్థానంలో ఉంచిన ఆకులను చూసింది. ఆకులను తీసివేసి మళ్లీ రత్నాలను ఉంచింది. పాము పోయిన తరువాత, ఏనుగు ఆకులు మరియు నీటితో మళ్లీ వచ్చి. మరల రత్నాలను తీసివేసి, ఆకులు మరియు నీటితో పూజ చేసింది. ఇలా కొన్ని రోజులు సాగింది. పాముకి కోపం వచ్చి రత్నాలను ఎవరు తీస్తున్నారో తెలుసుకోవాలని, తన పూజానంతరం దాక్కొని వేచి చూసింది. ఏనుగు ఏం చేస్తుందో చూడగానే ఏనుగు తొండం లోపలికి జారుకుని కాటు వేసింది. ఏనుగు తన ముఖాన్ని గోడకు పగులగొట్టి పామును చంపేసింది. శ్రీకాళహస్తీశ్వరుడు ఇద్దరికీ మోక్షం ప్రసాదించాడు. సాలిపురుగు, పాము, ఏనుగు దంతాల చిత్రాలు శివలింగంపై ఇప్పటికీ కూడా చెక్కబడి ఉన్నాయి.

దక్షిణ కైలాసం -శ్రీకాళహస్తి.
ఒకసారి ఆదిశేషునికి, వాయుదేవునికి మథ్య ఎవరు ఎక్కువ అని గొడవ జరిగింది. వాయుదేవుడు ప్రవేశించకుండా ఆదిశేషుడు కైలాస పర్వతం చుట్టూ తిరిగాడు. వాయుదేవుడు పెనుగాలిని సృష్టించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కైలాసానికి చెందిన ఎనిమిది ముక్కలు శ్రీకాళహస్తి, త్రింకోమలీ, తిరుచ్చిరామలై, తిరుఎంకోయిమలై, రజతగిరి, నీర్తగిరి, రత్నగిరి, తిరుపంగీళి వంటి ప్రదేశాలలో పడ్డాయి. ఆ పర్వతాన్ని శ్రీకాళహస్తిలో ఉంచి, శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం చేయాలని శివుడు బ్రహ్మను కోరాడు. ఈ పర్వతాన్ని శివానందైక నిలయం మరియు కన్నప్ప పర్వతం అని పిలుస్తారు.

కన్నప్ప ఎవరు?
కన్నప్ప ఒక నాయనార్, దక్షిణ భారతదేశంలోని 63 మంది శైవ సాధువులలో ఒకరు. అతను అర్జునుడికి పునర్జన్మ. అతను వేటగాడుగా జన్మించాడు. అతని అసలు పేరు తిన్నన్. ఇతను శ్రీకాళహస్తీశ్వర భక్తుడు. వేటగాడు కావడంతో చంపిన జంతువుల మాంసాన్ని తీసుకొచ్చి స్వామికి సమర్పించేవాడు. పక్కనే ఉన్న స్వర్ణముఖీ నదిలోని నీళ్లతో నోటిని నింపుకుని అభిషేకం చేశేవాడు. అతను ప్రతి రోజు మర్చిపోకుండా ఇలా చేసేవాడు. ఒకరోజు, ఈశ్వరుడు అతని విశ్వాసాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. భగవంతుని (లింగం) ఒక కన్ను నుండి రక్తం కారడాన్ని కన్నప్ప గమనించాడు. అతను తన కంటిని తానే తీసుకుని దాని స్థానంలో ఉంచాడు. అప్పుడు లింగం యొక్క రెండవ కన్నునుండి కూడా రక్తస్రావం ప్రారంభమైంది. అతను తన రెండవ కన్ను తీయబోతూ అనుకున్నాడు - నేను పూర్తిగా అంధుడిని అవుతాను. నేను లింగం యొక్క రెండో కంటి స్థానాన్ని ఎలా తెలుసుకోవాలి?. కాబట్టి అతను లింగంపై కన్ను స్థానాన్ని గుర్తించడానికి తన పాదాల యొక్క బొటకనవేలు ఉంచాడు. అతను తన రెండవ కన్ను తీయబోతుండగా, ఈశ్వరుడు అతన్ని ఆపాడు. ఈశ్వరుడు అతనికి మకన్ను తిరిగి ఇచ్చాడు. తిన్నన్ ఈశ్వరుడికి తన స్వంత కన్ను సమర్పించే ఈ చర్య కారణంగా కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు.

వాయు లింగం - శ్రీకాళహస్తి
పంచ భూత లింగాలు అని పిలువబడే ఐదు ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయి, ప్రతి ఒక్క శివలింగం ఐదు ప్రాథమిక అంశాలలో ఒకదానిని సూచిస్తాయి. 1. పృథ్వీ లింగం- ఏకాంబరేశ్వరం, కాంచీపురం. 2. జలలింగం- జంబుకేశ్వరం, తిరువనైకావల్. 3. అగ్ని లింగం- అరుణాచలేశ్వరం, తిరువణ్ణామలై. 4. వాయు లింగం- శ్రీకాళహస్తి. 5 ఆకాశ లింగం- చిదంబరం, నటరాజ. వాయుదేవుడు చాలా కాలం పాటు కర్పూర శివలింగాన్ని పూజించాడు. శివుడు అతని ముందు ప్రత్యక్షమైనప్పుడు, వాయుదేవుడు మూడు వరాలను కోరాడు. 1. నేను ప్రతిచోటా ఉండాలి. 2. ప్రతి జీవి లోపల నేను ఉండాలి. 3. నేను పూజించిన ఈ లింగము తరువాత నా పేరుతో తెలియాలి. శ్రీకాళహస్తిలో ఉన్న ఈ లింగమే వాయు లింగంగా పిలువబడుతుంది.

శ్రీ కాళహస్తి ఆలయ చరిత్ర
ఈ ఆలయాన్ని మొదట పల్లవ రాజులు నిర్మించారని నమ్ముతారు. 11వ శతాబ్దంలో, మొదటి రాజేంద్ర చోళుడు ప్రధాన కట్టడాన్ని పునరుద్ధరించి నిర్మించాడు. క్రీస్తు శకం 1516లో కృష్ణదేవరాయలు 100 స్తంభాల హాలును నిర్మించారు. చోళ మరియు విజయనగర రాజవంశాలకు చెందిన పలువురు రాజులు ఆలయ సముదాయం, నిర్మాణానికి మరియు నిర్వహణకు సహకరించారు.

జ్ఞానప్రసూనాంబిక
శ్రీకాళహస్తీశ్వరుని భార్య జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కూడా శివ-జ్ఞానమే. శివుడు ఒకసారి పార్వతీదేవిని భూలోకంలో పుట్టమని శపించాడు. దేవి, శ్రీకాళహస్తిలో తపస్సు చేసింది మరియు శివుడు ఆమెకు పూర్వం కంటే చాలా అందమైన దివ్య శరీరాన్ని తిరిగి ఇచ్చాడు.

స్వర్ణముఖీ నది
స్వర్ణముఖీ, శ్రీకాళహస్తిలో ఉన్న నది. ఈ నదిని దివ్య గంగ అని కూడా అంటారు.

శ్రీ కాళహస్తిలో రాహు కేతు పూజ
రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలతో బాధపడేవారు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకుంటారు. రాహుకాల సమయంలో పూజ చేయడం ఉత్తమం.

శ్రీ కాళహస్తి పూజా సమయాలు
ఆలయం ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 వరకు తెరిచి ఉంటుంది. శని, ఆది, సోమవారాల్లో ఆలయాన్ని రాత్రి 9.30 గంటలకు మూస్తారు.

తిరుపతి నుండి శ్రీకాళహస్తి వరకు దూరం
36 కిలోమీటర్లు

చెన్నై నుండి శ్రీకాళహస్తి వరకు దూరం
113 కిలోమీటర్లు

శ్రీ కాళహస్తి రైల్వే స్టేషన్
ఇది ఆలయానికి 3 కిలో మీటర్ల దూరంలో ఉంది.

శ్రీ కాళహస్తి ఆలయ సంప్రదింపు సంఖ్య(ఫోను నంబరు)
08578 - 222240

శ్రీ కాళహస్తి ఆలయ చిరునామా
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, పిన్ - 517 644, ఆంధ్రప్రదేశ్

Audios

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Active Visitors:
2656032