Special - Kubera Homa - 20th, September

Seeking financial freedom? Participate in the Kubera Homa for blessings of wealth and success.

Click here to participate

శివపురాణం - Part 2

 

 

58.6K
8.8K

Comments

c25G6
ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

Read more comments

Knowledge Bank

మాయావాదం స్వయంగా ఒక మాయా?

మాయావాదం అసచ్ఛాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధం ఉచ్యతే మయైవ విహితం దేవి కలౌ బ్రాహ్మణ-మూర్తినా (పద్మ పురాణం, ఉత్తర ఖండ 43.6) - పద్మ పురాణం ప్రకారం, మాయావాదం, ప్రపంచం మాయగా ఉందని చెబుతుంది, దానికంటే మోసపూరితమైనదిగా లేదా తప్పుదారి పట్టించేదిగా భావించబడింది, దీనిని 'దాగి ఉన్న బౌద్ధం' అని పిలుస్తారు. ఈ తత్వశాస్త్రం సంప్రదాయ వేద శిక్షణలతో విరుద్ధంగా ఉంది, ఇది దివ్యుని వ్యక్తిగత కోణాన్ని తిరస్కరిస్తుంది మరియు భౌతిక ప్రపంచాన్ని కేవలం మాయగా పరిగణిస్తుంది. కలి యుగంలో ఈ విధమైన సిద్ధాంతాలలో పాల్గొనడం ఒకరి ఆధ్యాత్మిక మార్గానికి సవాలు కావచ్చు, ఎందుకంటే ఇది దైవీ జీవిత సత్యాన్ని గుర్తించకుండా భౌతిక ప్రపంచం నుండి విరివిగా ప్రోత్సహిస్తుంది. ఈ తత్వాన్ని వివేచనతో అర్థం చేసుకోవడం ముఖ్యమైనది, దాని ఆలోచనాత్మక అంతర్దృష్టులను అంగీకరించాలి, కానీ వేద జ్ఞానపు సారాన్ని మరచిపోవద్దు. మాయావాదం భౌతిక ఉనికిని దాటి చూడమని ప్రోత్సహించినప్పటికీ, అది వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక వికాసాన్ని విస్మరించకూడదు, ఇది దైవిక సృష్టిని అర్థం చేసుకోవడం మరియు అందులో పాల్గొనడం ద్వారా అందించబడుతుంది. నిజమైన అవగాహన కోసం భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాల మధ్య సమతుల్యత అత్యవసరం.

రోజువారీ విధుల ద్వారా జీవితంలోని మూడు రుణాలను తీర్చడం

మానవుడు మూడు రుణాలతో జన్మించాడు: ఋషి రిణ (ఋషులకు ఋణం), పితృ ఋణ (పూర్వీకులకు ఋణం), మరియు దేవా రిణ (దేవతల ఋణం). ఈ రుణాల నుండి విముక్తి పొందేందుకు, గ్రంథాలు రోజువారీ విధులను నిర్దేశిస్తాయి. శారీరక శుద్దీకరణ, సంధ్యావందనం (రోజువారీ ప్రార్థనలు), తర్పణ (పూర్వీకుల ఆచారాలు), దేవతలను ఆరాధించడం, ఇతర రోజువారీ ఆచారాలు మరియు గ్రంథాల అధ్యయనం వంటివి ఉన్నాయి. శారీరక శుద్ధి ద్వారా పరిశుభ్రతను కాపాడుకోండి, సంధ్యావందనం ద్వారా రోజువారీ ప్రార్థనలు చేయండి, తర్పణ ద్వారా పూర్వీకులను స్మరించండి, క్రమం తప్పకుండా దేవతలను పూజించండి, ఇతర నిర్దేశించిన రోజువారీ ఆచారాలను అనుసరించండి మరియు గ్రంధాల అధ్యయనం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందండి. ఈ చర్యలకు కట్టుబడి, మనం మన ఆధ్యాత్మిక బాధ్యతలను నెరవేరుస్తాము

Quiz

కింది వారిలో వైదిక దేవుడు ఎవరు కాదు?

దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన రుషులను వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వచ్చి వాజిపేయ మనే యజ్ఞం చేశాడు. ఆయనకు శివుడి మీద చాలా కోపంగా వున్నది. అందుచేత అందుచేత ఈ వాజిపేయంలో శివుడికి హవిర్భాగం లేకుండా చేశాడు. అప్పటికీ దక్షుడికి శివుడి పైన కోపం చల్లారలేదు. అందుచేత ఆయన 'బృహస్పతి యజ్ఞం' అనే మహాయజ్ఞం తలపెట్టి దానికి
దేవతలనూ, మహర్షులనూ ఆహ్వానించి, వచ్చిన వారిని సత్కరించటానికి తన శిష్యులనూ, బంధువులనూ నియోగించాడు. ఇందులోకూడా ఆయన శివుడికి భాగం ఇవ్వ దలచలేదు.
ఈ యజ్ఞానికి విశ్వదేవతలు, మరు త్తులూ, పితృగణాలూ, అప్సరసలూ, గంధర్వ, సిద్ధ, విద్యాధర, కిన్నర, యక్షులూ, కస్యప, అగస్త్య, అత్రి, భృగు, మరీచి, నారద, పరాశరాది మహర్షులూ వచ్చారు. బ్రహ్మ విష్ణులు తప్ప మిగిలినవారంతా దక్షు డికి భయపడే వచ్చారు. వచ్చినవారి కంద రికీ విడుదులు ఏర్పాటు చెయ్యటానికి విశ్వ కర్మ నియోగించబడ్డాడు.

దక్షుడు యజ్ఞదీక్ష వహించి, భార్యా సమేతుడై యాగశాల ప్రవేశించి, సభా వందనం చేశాడు. పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు. బ్రహ్మ విష్ణువులు పిలిచినా రాలేదు. అనేకమంది దేవతలతోనూ, మహర్షులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివభక్తులైన మరీచీ, దధీచి, భృగుడూ మొద లైన మహర్షులు సభను కలయజూసి, ' ఓ దక్షా, ఈ సభకు సతీదేవినీ, శివుణ్ణి పిలవ లేదా? వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు ? 'అని అడిగారు.

దానికి దక్షుడు, ' శివుడు కర్మభ్రష్టుడు.అందుచేత అతన్ని పిలవలేదు. అతను అప విత్రుడు, కపాలధారి, శ్మశానవాని, ప్రేత గణాలకు ప్రభువు,' అన్నాడు. ఈ శివదూషణ విని దధీచి, 'దక్షా, ఈ యాగం నెరవేరదు. శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువు ఆపదనూ, విచా రాన్నీ కొనితెచ్చుకుంటున్నావు. ఈ యాగా నికి వచ్చినవారు కూడా దుఃఖిస్తారు.' అనివామదేవుడూ, మరీచీ, గౌతముడూ, శిలా దుడూ మొదలైన అనేకమంది రుషులతో సహా సభ నుండి వెళ్ళిపోయాడు.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

తెలుగు

తెలుగు

శివుడు

Click on any topic to open

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon