ధనిష్ఠ నక్షత్రం

Dhanishta Nakshatra symbol drum

మకర రాశి 23 డిగ్రీల 20 నిమిషాల నుండి కుంభ రాశి 6 డిగ్రీల 40 నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రాన్ని ధనిష్ఠ అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది 23వ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, ధనిష్ఠ α "Sualocin" to δ Delphiniకి అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు: 

రాశులిద్దరికీ ఉమ్మడిగా

 • సంపన్నులు.
 • ధార్మికమైనవారు. 
 • దూకుడులు.
 • అత్యాశకరమైనవారు.
 • పదునైన మనసు కలవాడు.
 • ప్రతిష్టాత్మకమైనవారు.
 • ఆరోగ్యాన్ని పట్టించుకోరు.
 • జీవితంలో డబ్బు సంపాదించడమే ప్రధానం.
 • స్వతంత్ర ఆలోచనాపరులు.
 • పనిలో నేర్పరి.
 • మతపరమైనవారు.
 • స్వార్థపరులు.
 • విధేయత లేకపోవడం.
 • స్వీయ విశ్వాసం.
 • రహస్యాలు ఉంచే సామర్థ్యం.
 • కుటుంబ సంబంధమైనవారు. 
 • ప్రతీకారం తీర్చుకునేవారులు. 
 • దృఢమైనవారు.

 ధనిష్ఠ నక్షత్రం-మకర రాశి వారికి మాత్రమే

 • హెచ్చరికగా ఉంటారు.
 •  చురుకుగా ఉంటారు.
 • సాహసోపేతమైనవారు. 
 • ప్రభావవంతమైనవారు.

ధనిష్ఠ నక్షత్ర-కుంభ రాశి వారికి మాత్రమే

 • స్నేహశీలి.
 • త్వరిత బుద్ధి కలవారు.
 • జిజ్ఞాసువులు. 
 • చిన్నబుచ్చుకునేవారులు.

ప్రతికూల నక్షత్రాలు 

 • పూర్వాభాద్ర.
 • రేవతి.
 • భరణి.
 • ధనిష్ఠ మకర రాశి - మఘ, పూర్వ ఫాల్గుణి, ఉత్తర - సింహ రాశి.
 • ధనిష్ఠ కుంభ రాశి -  ఉత్తర- కన్యా రాశి, హస్త, చిత్త- కన్యా రాశి 

ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

ఆరోగ్య సమస్యలు

 ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు ఈ ఆరోగ్య సమస్యలకు లోనవుతారు: 

ధనిష్ఠ - మకర రాశి 

 • కాలికి గాయం.
 • దిమ్మలు .
 • ఎక్కిళ్ళు.
 • వికారం.

ధనిష్ఠ - కుంభ రాశి 

 • కాలికి గాయం.
 • రక్త రుగ్మతలు.
 • దడ దడ.
 • మూర్ఛపోవడం.
 • గుండె జబ్బులు.
 • రక్తపోటు.
 • వెరికోస్.

అనుకూలమైన కెరీర్ 

ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు:

 ధనిష్ఠ నక్షత్రం - మకర రాశి

 •  వైద్యం.
 •  గనుల తవ్వకం.
 •  భూగర్భ శాస్త్రం.
 •  ఇంజనీర్.
 •  కార్మిక శాఖ.
 •  పునరావాసం.
 •  జైలు అధికారి.
 •  తయారీ. 
 • పరికరాలు.
 •  విడి భాగాలు.
 •  సిమెంట్.
 •  ఖనిజాలు.
 •  గాజు.
 •  మద్యం.
 •  జనపనార.

 ధనిష్ఠ నక్షత్రం - కుంభ రాశి

 • టి.వి.
 •  ఫోన్.
 •  విద్యుత్. 
 • న్యూక్లియర్ సైన్స్.
 •  పరిశోధన.
 •  కోరియర్.
 •  ప్రింటింగ్.
 •  విచారణ.
 •  వ్యవసాయం.
 •  పట్టు.
 •  జనపనార పరిశ్రమ.
 •  గనుల తవ్వకం.
 •  ఇనుము & ఉక్కు.
 •  తోలు.
 •  పోలీసు.
 •  రక్షణ సేవ.
 •  రక్షించుట.

ధనిష్ఠ నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా? 

ధరించవచ్చు 

అదృష్ట రాయి 

పగడం

అనుకూలమైన రంగులు

ఎరుపు, నలుపు, ముదురు నీలం.

ధనిష్ఠ నక్షత్రానికి పేర్లు :-

ధనిష్ఠ నక్షత్రానికి అవకాహదాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం: 

 • మొదటి చరణం - గా.
 • రెండవ చరణం - గీ.
 • మూడవ చరణం - గూ.
 • నాల్గవ చరణం - గే.

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు. కొన్ని సంఘాల్లో నామకరణం సమయంలో తాతయ్య-నానమ్మల పేర్లను ఉంచుతారు. ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని  శాస్త్రం నిర్దేశిస్తుంది.  దీనిని వ్యవహారిక నామం అంటారు. 

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరుతో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - 

ధనిష్ఠ నక్షత్ర - మకర రాశి -  స, ఓ, ఔ, ట, ఠ, డ, ఢ.

ధనిష్ట నక్షత్ర - కుంభ రాశి -  ఎ, ఐ, హ, అం, క్ష, త, థ, ద, ధ, న.

వివాహం

వివాహం సుభిక్షంగా ఉంటుంది.

ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఇబ్బందులు ఎదురవుతాయి. 

నివారణలు

 ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి బుధ, గురు/బృహస్పతి, మరియు శుక్ర కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు. 

మంత్రం

ఓం వసుభ్యో నమః

ధనిష్ఠ నక్షత్రం

 • భగవంతుడు - వసు.
 • పాలించే గ్రహం - మంగళ/కుజ.
 • జంతువు - మనిషి.
 • చెట్టు - జమ్మి
 • పక్షి - నెమలి.
 • భూతం - ఆకాశం
 • గణం - మనుష్య.
 • యోని - సింహం (ఆడ).
 • నాడి - మధ్య.
 • చిహ్నం - డోలు.

 

Recommended for you

 

 

Video - DHANISHTHA Nakshatra Mantra 

 

DHANISHTHA Nakshatra Mantra

 

 

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize