యుగం అంటే ఏమిటి

 

యుగం యొక్క అర్థం మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, పురాణాలు మరియు ఇతిహాసాలలో సమయం ఎలాగ లెక్కించబడుతుందో మనం తెలుసుకోవాలి.

కల్పం అంటే ఏమిటి?

విశ్వం ఒకసారి సృష్టించబడినప్పుడు 432 కోట్ల సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ కాలాన్ని కల్పం అంటారు. దీని తరువాత, నైమిత్తిక ప్రళయం సంభవిస్తుంది.

మన్వంతరం అంటే ఏమిటి?

ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి.

 

 

చతుర్యుగం లేదా మహాయుగం అంటే ఏమిటి?

ఒక మన్వంతరంలో 71 చతుర్యుగాలు లేదా మహాయుగాలు ఉంటాయి.

కృతయుగం - త్రేతాయుగం - ద్వాపరయుగం - కలియుగం, ఈ నాలుగింటిని కలిపి చతుర్యుగం అంటారు. కృతయుగాన్ని సత్యయుగమని కూడా అంటారు.

ఒక యుగంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి?

కృతయుగం - 17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం - 12,96,000 సంవత్సరాలు
ద్వాపరయుగం - 8,64,000 సంవత్సరాలు
కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

ఇప్పుడు ఏ యుగం నడుస్తోంది?

ప్రస్తుత కల్పానికి శ్వేతవరాహ కల్పం అని పేరు. ఇందులో 7వ మన్వంతరం జరుగుతోంది. దీని పేరు వైవస్వత మన్వంతరం. ఇందులో 28వ చతుర్యుగం జరుగుతోంది.

ఇందులో ఇప్పుడు క్రీస్తు పూర్వం 3102 లో ప్రారంభమైన కలియుగం నడుస్తోంది. ఇది క్రీస్తు శకం 4,28,899 లో ముగుస్తుంది.

క్రీస్తు శకం 2021 లో విశ్వం ఆవిర్భవించి 1,96,08,53,123 సంవత్సరాలు అయింది.

 

Click below to listen to Bhakta Prahlada Songs In Telugu 

 

Evergreen Devotional Video Songs In Telugu - Bhakta Prahlada Songs In Telugu

 

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |