ఆరుద్ర నక్షత్రం

Ardra Nakshatra Symbol

 మిథున రాశి 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 20 డిగ్రీల వరకు వ్యాపించే నక్షత్రాన్ని ఆర్ద్ర (ఆరుద్ర) అంటారు.  

వైదిక  ఖగోళ శాస్త్రంలో ఇది ఆరవ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, ఆరుద్ర Betelgeuse అనుగుణంగా ఉంటుంది.    

లక్షణాలు 

ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు: 

  • విజ్ఞానవంతులు
  • డబ్బు సంపాదించాలనే తపన 
  • జీవితంలో హెచ్చు తగ్గులు 
  • మాట్లాడే విధానం ఆసక్తికరంగా ఉంటుంది 
  • నిర్ణయాలలో అస్థిరత 
  • మొండితనం మరియు పట్టుదలగలవారు
  • అహంభావి 
  • వారికి తగిన ఖ్యాతి లభించదు
  • కృతజ్ఞతాభావం లేనివారు
  • స్త్రీలు చెడుగా మాట్లాడే అవకాశం ఉంటుంది 
  • అల్లకల్లోల వివాహం
  • సాహిత్యంపై ఆసక్తి 
  • నిజాయితీ లేనివారు 
  • చీకటి కార్యకలాపాలు  
  • మద్యపాన ధోరణి

 

ప్రతికూల నక్షత్రాలు  

  • పుష్యమి
  • మఘా 
  • ఉత్తర ఫాల్గుణి 
  • ఉత్తరాషాడ మకర రాశి 
  • శ్రవణ 
  • ధనిష్ట మకర రాశి  

ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి. 

ఆరోగ్య సమస్యలు 

ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు: 

  • గొంతు సమస్యలు 
  • మెడలో వాపు 
  • ఆస్తమా 
  • పొడి దగ్గు 
  • శ్వాసకోశ వ్యాధులు 
  • చెవి వ్యాధులు 
  • థైరాయిడ్ సమస్యలు 

అనుకూలమైన కెరీర్ 

వారు పనిలో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. 

సందేహాస్పద కార్యకలాపాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తాయి.  

ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు:  

  • వ్యాపారం 
  • పుస్తకాలు
  • కొరియర్
  • పోస్టల్ సర్వీస్ 
  • రచనలు 
  • ప్రచురణ 
  • ప్రింటింగ్ 
  • పర్యాటక కార్యకర్త 
  • రవాణా 
  • పరిశోధన 
  • డిజైన్ మరియు అభివృద్ధి 
  • మందులు
  • భౌతిక శాస్త్రవేత్త
  • గణిత శాస్త్రజ్ఞులు
  • జ్యోతిష్యం 
  • గ్రాఫాలజీ 
  • పారిశ్రామిక కార్మికులుగా
  • కళాకారులుగా
  • పోలీసు 
  • రక్షణ 
  • మేజిక్
  • తాంత్రికులుగా

ఆరుద్ర నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా?  

ధరించవచ్చు  వజ్రం అనుకూలమైనది.

అదృష్ట రాయి  

గోమేధికం

అనుకూలమైన రంగులు 

నలుపు, ముదురు నీలం

ఆరుద్ర నక్షత్రానికి పేర్లు  

ఆరుద్ర నక్షత్రానికి అవకాహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:  

  • మొదటి పాదం/చరణం -  కూ 
  • రెండవ పాదం/చరణం -  ఘ 
  • మూడవ పాదం/చరణం -  ఙ 
  • నాల్గవ పాదం/చరణం - ఛ 

ఈ అక్షరాలను నామకరణ వేడుక సమయంలో ఉంచిన సాంప్రదాయ నక్షత్రం పేరు కోసం ఉపయోగించవచ్చు. 

కొన్ని సంఘాలలో, నామకరణం సమయంలో తాత, నానమ్మల పేర్లను ఉంచుతారు. 

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి.  

ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - చ, ఛ, జ, ఝ, త, థ,  ద, ధ, న, ఉ, ఊ, రి, శ

వివాహం 

ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు జీవిత భాగస్వామి పట్ల అనైతికంగా ప్రవర్తించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

నివారణలు  

సాధారణంగా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి సూర్యుడు, శని, కేతువుల కాలాలు ప్రతికూలంగా ఉంటాయి.

వారు ఈ క్రింది నివారణలను చేయవలెను. 

మంత్రం 

ఓం రుద్రాయ నమః' 

ఆరుద్ర నక్షత్రం  

  • భగవంతుడు - రుద్రుడు 
  • పాలించే గ్రహం - రాహువు
  • జంతువు - ఆడ కుక్క 
  • చెట్టు - Diospyros candolleana
  • పక్షి - జెముడుకాకి (Centropus sinensis) 
  • భూతం - జలం 
  • గణం - మనుష్య 
  • యోని - కుక్క (ఆడ) 
  • నాడి - ఆద్య 
  • చిహ్నం - వజ్రం

అనువాదం : వేదుల జానకి

తెలుగు

తెలుగు

జ్యోతిష్యం

Click on any topic to open

0

Copyright © 2026 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize

We use cookies