అశ్విని నక్షత్రం

Ashwini Nakshatra Symbol

 

మేష రాశి యొక్క 0 డిగ్రీల నుండి 13 డిగ్రీల 20 నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రాన్ని అశ్విని అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది మొదటి నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, అశ్విని మేషరాశి అధిపతికి అనుగుణంగా ఉంటుంది, ఇందులో బీటా (β) మరియు గామా (γ) అరిటిస్ నక్షత్రాలు ఉన్నాయి. వేదాలలో అశ్వినిని ఆశ్వయుజం అని కూడా అంటారు.

Click below to listen to Ashwini Nakshatra Mantra 

 

Ashwini Nakshatra Mantra 108 Times | Ashwini Nakshatra Devta Mantra | Nakshatra Vedic Mantra Jaap

 

అశ్విని నక్షత్ర అధిపతి

అశ్విని నక్షత్రం అశ్వినులు / అశ్విని కుమారులచే పాలించబడుతుంది. వారు స్వర్గం యొక్క వైద్యులు. సూర్యుడి భార్య సంజ్ఞ అతని వేడిని తట్టుకోలేక, తనను తాను గుర్రం (సంస్కృతంలో అశ్వం)గా మార్చుకుంది మరియు తపస్సులో నిమగ్నమవడానికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సూర్యుడు ఆమెతో ఐక్యం అవడం వల్ల అశ్వినిలు పుట్టారు.

 

అశ్విని నక్షత్రం యొక్క పాలించే గ్రహం

కేతువు.

 

అశ్విని నక్షత్ర లక్షణాలు

అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు:

  • తెలివితేటలు
  • ధైర్యం
  • తెలివైనవారు
  • మంచి జ్ఞాపకశక్తి
  • మరింత ఎక్కువగా నేర్చుకోవాలనే ఆసక్తి
  • విశాలమైన నుదురు
  • పెద్ద కళ్ళు
  • ప్రశాంతత కలిగినవారు
  • వినయవంతులు
  • ఒత్తిడికి లొంగరు
  • కొన్నిసార్లు మొండిగా ఉంటారు
  • దృఢమైన నిర్ణయాలు సహాయకారిగా ఉంటారు
  • కష్టపడి పనిచేసేవారు
  • కొందరిలో తాగుడు అలవాటు ఉన్నవారు
  • వైద్యం చేసే శక్తి కలిగినవారు
  • జనాదరణ పొందినవారు
  • అదృష్టవంతులు
  • నీతిమంతులు
  • గౌరవం లభిస్తారు
  • మంచి సలహాదారుగా ఉంటారు
  • ఆధ్యాత్మికతపై ఆసక్తి, ఖర్చుపెట్టేవారు
  • చిన్నబుచ్చుకునేవాడు
  • ఎప్పుడూ హడావిడిగా ఉంటారు
  • ఎక్కువ మాటాడేవారు
  • రాడే ప్రకృతి కలిగినవారు
  • ప్రయాణం అంటే ఇష్టపడతారు,
  • తోబుట్టువులతో సత్సంబంధాలు ఉంచుకుంటారు
  • ఆస్తి విషయంలో ఆందోళన చెందుతారు
  • అంతగా సంపన్నులు కారు

 

అశ్విని నక్షత్రానికి ప్రతికూలమైన నక్షత్రాలు

  • కృత్తిక
  • మృగశిర
  • పునర్వసు
  • విశాఖ 4వ పాదము
  • అనురాధ
  • జ్యేష్ట

అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు పైన చెప్పిన నక్షత్రం కలిగియున్న రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

 

అశ్విని నక్షత్రం- ఆరోగ్య సమస్యలు

అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఈ క్రింది ఆరోగ్య సమస్యలు ఉంటాయి:

  • తలకు గాయాలు
  • అల్సర్లు
  • రుమాటిక్ నొప్పి
  • బ్లాక్అవుట్
  • మెదడు రక్తం గడ్డకట్టటం
  • కారణం తెలియని మెదడువాపు వ్యాధి
  • బ్రెయిన్ హెమరేజ్
  • స్ట్రోక్
  • మూర్ఛరోగము
  • నిద్రలేమి
  • మలేరియా
  • మశూచి

 

అశ్విని నక్షత్ర దోషం

అశ్విని నక్షత్రం యొక్క మొదటి పాదం/చరణం వారు గండాంత ​​దోషంతో బాధపడుతారు. గండాంత శాంతి నిర్వహించవచ్చు. గండాంత ​​దోషంతో జన్మించిన వారు కుటుంబానికి చెడ్డపేరు మరియు అవమానం కలిగిస్తారు.

అశ్విని నక్షత్ర పరిహారాలు

అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి సూర్యుడు, కుజుడు, గురుగ్రహ కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చును.

  • గణపతికి అర్చన
  • కార్తికేయుడికి ప్రార్థన
  • భద్రకాళికి ప్రార్థన
  • ప్రతి నెల జన్మ నక్షత్రం నాడు గణపతి హోమం చేయటం
  • చతుర్థి వ్రతాన్ని ఆచరించటం
  • కేతు మంత్రాలు మరియు స్తోత్రాలను జపించటం
  • మంగళ (కుజ) మంత్రాలు మరియు స్తోత్రాలను జపించటం
  • మంగళవారాల్లో ఎరుపు రంగు దుస్తులు ధరించటం

 

అశ్విని నక్షత్ర వృత్తి

అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి కెరీర్-తెలివైనవారు మరియు కష్టపడి పనిచేసేవారు వారి కెరీర్‌లో బాగా రాణిస్తారు. వారు తమ నిగ్రహాన్ని మరియు ఉద్రేకపూరిత స్వభావంపై నియంత్రణను కలిగి ఉండాలి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు:

  • పోలీసు
  • రక్షణ దళాలు
  • రైల్వేలు
  • పారిశ్రామికవేత్తం
  • చట్టం
  • ఉక్కు మరియు రాగి పరిశ్రమం
  • బోధనం
  • జర్నలిజ
  • రాయడం
  • వైద్యం
  • గుర్రపు స్వారీ లేదా గుర్రానికి సంబంధించిన కెరీర్
  • యోగా శిక్షణ నేర్పించవచ్చు

 

అశ్విని నక్షత్ర మంత్రం

ఓం అశ్వినా తేజసా చక్షుః' ప్రాణేన సరస్వతీ వీర్యం వాచేంద్రో బాలేంద్రాయ దధురింద్రియమ్

ఓం అశ్వినీకుమారాభ్యాం నమః

 

అశ్విని నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా?

ఒద్దు, ధరించరాదు. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు వజ్రాలు ధరించకూడదు. ఇది హానికరం.

 

అశ్విని నక్షత్రం యొక్క అదృష్ట రాయి

వైడూర్యం.

 

అశ్విని నక్షత్ర జంతువు - గుర్రం

అశ్విని నక్షత్ర వృక్షం - ముషిడి

అశ్విని నక్షత్ర పక్షి - శిక్ర

అశ్విని నక్షత్ర భూతం - పృథ్వీ (భూమి)

అశ్విని నక్షత్ర గణం - దేవ గణం

అశ్విని నక్షత్ర యోని - గుర్రం

అశ్విని నక్షత్ర నాడి - ఆద్య

అశ్విని నక్షత్రం చిహ్నం- గుర్రపు తల

 

అశ్విని నక్షత్రం పేర్లు

అశ్విని నక్షత్రానికి అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

  • మొదటి పాదం/చరణం - చూ
  • రెండవ పాదం/చరణం - చే
  • మూడవ పాదం/చరణం - చో
  • నాల్గవ పాదం/చరణం- లా

నామకరణం సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్రం పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు.
కొన్ని సంఘాలలో, నామకరణం సమయంలో తాత, అమ్మమ్మల పేర్లను ఉంచుతారు. ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు.

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. దీనిని వ్యవహారిక నామం అంటారు. పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి.

అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో, మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - అం, క్ష, చ, ఛ, జ, ఝ, జ్ఞ, య, ర, ల, వ.

 

అశ్విని నక్షత్ర వివాహ జీవితం

అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు మరొకరిి నియంత్రణలో ఉండేందుకు ఇష్టపడరు. వారు తమ వ్యక్తిత్వాన్ని గౌరవించే జీవిత భాగస్వామి కోసం వెతకాలి. వారు జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉంటారు. వారు విస్వసనీయులు మరియు సంరక్షణ కల్పిస్తారు. వారు సంతోషంగా కుటుంబ బాధ్యతలను స్వీకరించి, అందజేస్తారు. వారు సాధారణ స్వభావం కలిగి ఉంటారు మరియు జీవిత భాగస్వామి యొక్క అవసరాలకు సులభంగా వసతి కల్పించగలరు మరియు సర్దుబాటు చేయగలరు. పెళ్లయిన తర్వాత కూడా వారు తల్లిదండ్రులు మరియు తోబుట్టువులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు.

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |