తాత్పర్యము

 ఓ తల్లీ - హిమశైలపుత్రీ - ఆనందపరచువారిని సంతోష పరచుదానా- విశ్వమును వినోదింప చేయుదానా - నందీశ్వరునిచే కీర్తింపబడుదానా - వింధ్యాద్రిపై నివాసము గలదానా - విష్ణు (మాయా) విలాసములకు మూలకారణమైనదానా - ఇంద్రునిచే స్తుతింపబడుదానా- ఓ భగవత్స్వరూపిణీ - శివుని ఇల్లాలా - విశ్వ కుటుంబినీ - గొప్ప గొప్ప పనులు చేయుదానా - లేదా గొప్పగా అనుగ్రహించుదానా- అందమైన జడల ముడులు గలదానా - మహిషాసురుని వధించిన దానా - నీకు జయపరంపర అగుగాక -

విశేషాంశములు

అయి : పూజనీయురాలైన అమ్మవారిని అత్యంత భక్తి పూర్వక సాన్నిహిత్యంతో ఓ తల్లీ అని పిలవడానికి సంబోధన పూర్వకంగా ముందు చెప్పే సంస్కృత పదం అయి- అయీ పదానికి సంబోధన ప్రథమా విభక్తి రూపమే అయి. మన అమ్మకు మనపై ఎంత చనవు

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |