భరణి నక్షత్రం

Other languages: EnglishMalayalamHindiKannada

Listen to this article


మేష రాశి 13 డిగ్రీల 20 నిమిషాల నుండి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రాన్ని భరణి అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది రెండవ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, భరణి 35, 39 మరియు 41 అరియెటిస్‌లకు అనుగుణంగా ఉంటుంది. భరణిని సంస్కృతంలో అపభరణి అంటారు. భరణి ఉగ్ర-నక్షత్ర వర్గానికి చెందినవారు (క్రూరమైన నక్షత్రాలు).

భరణి నక్షత్ర అధిపతి

భరణి నక్షత్రానికి అధిపతి - యముడు.

భరణి నక్షత్రాన్ని పాలించే గ్రహం

శుక్రుడు.

భరణి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు

 • ఆకర్షణీయమైన ప్రవర్తన
 • ఆహ్లాదకరమైన మర్యాదలు
 • నిజాయితీపరులు
 • నైపుణ్యం కలవారు
 • సాహసోపేత జీవితాన్ని ఆనందిస్తారు
 • సంపన్నులు
 • తప్పుడు ఆరోపణలకు మరియు అపకీర్తికి గురి అవుతారు
 • లక్ష్యం-ఆధారిత పని చేసేవారు
 • కఠిన హృదయం కలవారు
 • కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు
 • ప్రతిదానిలోనూ ప్రతికూలం వైపు చూస్తారు
 • ఆరోగ్యకరమైన మరియు దృఢమైన శరీరాకృతి కలిగి ఉంటారు
 • ఇంద్రియ విషయాలలో స్వీయ నియంత్రణ ఉంచుకోరు
 • వారు చేసే కష్టానికి తగిన ఫలితాలను ఎప్పుడూ పొందరు
 • ధూమ్రపానం మరియు మద్యపానం అలవాట్లకు గురవుతారు
 • స్వార్థపరులు
 • విధిని నమ్ముతారు
 • కృతజ్ఞత లేనివారు

భరణికి ప్రతికూలమైన నక్షత్రాలు

 • రోహిణి
 • ఆరుద్ర
 • పుష్యమి
 • విశాఖ 4వ పాదము
 • అనురాధ
 • జ్యేష్ఠ

భరణి నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి.

భరణి నక్షత్రం ఆరోగ్య సమస్యలు

భరణి నక్షత్రంలో జన్మించిన వారు ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు గురవుతారు

 • కళ్ళ దగ్గర గాయాలు
 • వెనిరియల్ వ్యాధులు
 • చర్మ వ్యాధులు
 • చలి వేడి సంబంధిత వ్యాధులు
 • జ్వరం

భరణి నక్షత్ర పరిహారాలు

భరణి నక్షత్రంలో జన్మించిన వారికి చంద్ర, రాహు, శని కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు.

 • లక్ష్మీదేవిని ప్రార్థించడం
 • అన్నపూర్ణేశ్వరిని ప్రార్థించడం
 • భద్రకాళిని ప్రార్థించడం.
 • ప్రతి నెల జన్మ నక్షత్రం నాడు లక్ష్మీ పూజ చేయడం
 • శుక్రవారం ఉపవాసం పాటించడం
 • శుక్ర మంత్రాలు మరియు స్తోత్రాలను జపించడం మరియు శుక్రవారం తెల్లటి దుస్తులు ధరించడం

భరణి నక్షత్ర వృత్తి

భరణి నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు:

 • వినోదం
 • సినిమా మరియు మీడియా పరిశ్రమ
 • క్రీడలు
 • కళలు ప్రకటన
 • వెండి పరిశ్రమ
 • పట్టు పరిశ్రమ
 • ఆటోమొబైల్స్
 • ఎరువుల పరిశ్రమ
 • జంతువుల పెంపకం
 • వెటర్నరీ డాక్టర్
 • టీ మరియు కాఫీ పరిశ్రమ
 • రెస్టారెంట్, క్రిమినాలజీ
 • చర్మం మరియు సౌందర్య సాధనాలకు సంబంధించిన వృత్తులు
 • లెదర్ ఇండస్ట్రీ
 • నిర్మాణం
 • ఇంజనీర్
 • సర్జన్
 • గైనకాలజిస్ట్
 • వెనెరియాలజిస్ట్
 • వ్యవసాయం
 • నేత్ర వైద్యుడు
 • ఆప్టీషియన్
 • ప్లాస్టిక్
 • క్రీడా పరికరాలు
 • మాంసం పరిశ్రమ

భరణి నక్షత్ర మంత్రం

ఓం యమాయ నమః

భరణి నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా?

ధరించవచ్చు. భరణి నక్షత్రాన్ని పాలించే గ్రహం శుక్రుడు. వజ్రం అనుకూలమైనది.

భరణి నక్షత్రం అదృష్టపు రాయి

వజ్రం (డైమండ్)

భరణి నక్షత్ర జంతువు - ఏనుగు
భరణి నక్షత్రం చెట్టు - జామకాయ
భరణి నక్షత్ర పక్షి - శిక్ర
భరణి నక్షత్ర భూతం - పృథ్వీ
భరణి నక్షత్ర గణం - మనుష్య
భరణి నక్షత్ర యోని - ఏనుగు (మగ)
భరణి నక్షత్ర నాడి - మధ్య
భరణి నక్షత్రం గుర్తు - త్రిభుజం

భరణి నక్షత్రానికి పేర్లు

భరణి నక్షత్రానికి అవకహడాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం:

 • మొదటి పాదం/చరణం - లీ
 • రెండవ పాదం/చరణం - లూ
 • మూడవ పాదం/చరణం - లే
 • నాల్గవ పాదం/చరణం - లో

నామకరణం సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్రం పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు.

కొన్ని సంఘాలలో, నామకరణం సమయంలో తాత, నానమ్మల పేర్లను ఉంచుతారు. ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. దీనిని వ్యవహారిక నామం అంటారు.

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి.

భరణి నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరులో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు - అం, క్ష, చ, ఛ, జ, ఝ, ఞ, య, ర, ల, వ.

భరణి నక్షత్ర వివాహ జీవితం

సాఫీ వైవాహిక జీవితానికి స్వార్థం హానికరం. భరణి నక్షత్రంలో జన్మించిన వారు తమ జీవిత భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు వారికి చోటు కల్పించడానికి ప్రయత్నం చేయాలి. వారు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాల్సిన మరో అంశం అహం. ఆనందాన్ని పొందాలనే వారి మొగ్గు వైవాహిక జీవితాన్ని ఉల్లాసంగా మార్చగలిగినప్పటికీ, వారు ఇంద్రియ విషయాలలో అతిగా మునిగిపోకుండా జాగ్రత్తపడాలి.

Author

అనువాదం : వేదుల జానకి

Recommended for you

శ్రీ గణపతి అథర్వశీర్షం

Audios

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Active Visitors:
2615078