అర్థంతో హనుమాన్ చాలీసా

శ్రీగురు చరన సరోజ రజ నిజ మన ముకుర సుధారి ౹
బరనఉఁ రఘుబర బిమల జస జో దాయక ఫల చారి ౹౹

నా గురువుగారి పాద ధూళితో నన్ను నేను పవిత్రంగా మార్చుకున్న తర్వాత, పుణ్యాలు, సంపదలు, కోరికలు మరియు మోక్షాలను ఇచ్చే శ్రీ రాములవారి యొక్క గొప్పతనాన్ని నేను వర్ణిస్తున్నాను.

బుద్ధి హీన తను జానికై సుమిరౌం పవనకుమార ౹
బల బుధి బిద్యా దేహు మోహిం హరహు కలేశ బికార ౹౹

నేను అంత తెలివైనవాడిని కాదని గుర్తించి, ఓ హనుమంతుడా, నాకు అధికారం ఇవ్వు. నాకు జ్ఞానం ప్రసాదించు. నా సమస్యలన్నింటినీ తొలగించు.

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ౹
జయ కపీశ తిహుఁ లోక ఉజాగర ౹౹ .1.

నువ్వు అపారమైన జ్ఞానాన్ని పొందావు. నీలో గొప్ప గుణాలు ఉన్నాయి. వానరులలో నువ్వే గొప్పవాడివి. నువ్వు మూడు లోకాలలోనూ ప్రసిద్ధుడైన వాడివి. నీకు జయ్ జయ్ లు.

రామ దూత అతులిత బల ధామా ౹
అంజనిపుత్ర పవనసుత నామా ౹౹ .2.

నువ్వు శ్రీ రాములవారి దూతవు. నీ బలానికి పోలిక లేదు. నీ రెండు పేర్లూ చాలా ప్రసిద్ధమైనవి- అంజనీపుత్ర మరియు పవనసుత.

మహాబీర బిక్రమ బజరంగీ ౹
కుమతి నివార సుమతికే సంగీ౹౹ .3.

నువ్వు చాలా పరాక్రమ వంతుడివి. నీ శరీరం వజ్రంలా గట్టిది. నువ్వు చెడుని నాశనం చేస్తావు. నువ్వు ఎల్లప్పుడూ నీ భక్తులకు సహాయం చేస్తావు.

కంచన బరన బిరాజ సుబేసా ౹
కానన కుండల కుంచిత కేసా౹౹ .4.

నీ శరీరం బంగారు ఛాయలో ఉంటుంది. నీ బట్టలు అందంగా ఉంటాయి. నువ్వు అద్భుతమైన చెవి ఆభరణాలను ధరిస్తావు. నీ జుట్టు వంకర్లతో కలిగి ఉంటుంది.

హాథ బజ్ర అరు ధ్వజా బిరాజై ౹
కాంధే మూంజ జనేఉఁ ఛాజై౹౹ .5.

నువ్వు రాములవారి థ్వజాన్ని నీ చేతిలో పట్టుకుని ఉంటావు. నువ్వు యజ్ఞోపవీతాన్ని ధరించి ఉంటావు.

శంకర స్వయం కేసరీనందన ౹
తేజ ప్రతాప మహా జగ బందన౹౹ .6.

నువ్వే శంకర భగవానుడివి. నువ్వు కేసరి కొడుకువి. నీ తేజస్సు అద్భుతం. ప్రపంచం మొత్తం నీ ముందు సాష్టాంగ ప్రణామం చేస్తుంది

బిద్యావాన గుణీ అతి చాతుర ౹
రామ కాజ కరిబే కో ఆతుర౹౹ .7.

నీకు అన్నీ తెలుసు. నీకు అన్ని గుణాలు ఉన్నాయి. నువ్వు ఎల్లవేళలా రాములవారి పని చేయడం పట్ల ఆసక్తి కలిగి ఉంటావు.

ప్రభు చరిత్ర సునిబేకో రసియా౹
రామ లఖన సీతా మన బసియా౹౹ .8.

శ్రీ రాములవారి యొక్క శౌర్య- సాహసాల గురించి నువ్వు వినడానికి ఇష్టపడతావు. శ్రీ రాముడు, లక్ష్మణుడు మరియు సీతమ్మ ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తారు.

సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా ౹
బికట రూప ధరి లంక జరావా౹౹ .9.

ఒక చిన్న రూపాన్ని దాల్చి సీతమ్మ ఎక్కడ ఉందో నువ్వు కనుగొన్నావు. ఉగ్రరూపం దాల్చి లంకను దహనం చేసావు.

భీమ రూప ధరి అసుర సంహారే౹
రామచంద్ర కే కాజ సంవారే౹౹ .10.

భారీ రూపాన్ని దాల్చి అసురులను చంపి, శ్రీ రాముల వారి పని చేసావు.

లాయ సంజీవని లఖన జియాయే ౹
శ్రీరఘుబీర హరషి ఉర లాయే౹౹ .11.

నీవు సంజీవని తెచ్చి లక్ష్మణుడిని రక్షించావు. శ్రీ రాముడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు.

రఘుపతి కీన్హీ బహుత బఢాయి ౹
తుమ మమ ప్రియ భరతహిఁ సమ భాయి ౹౹ .12.

శ్రీ రాముడు నిన్ను స్తుతిస్తూనే ఉంటారు. నువ్వు తన ప్రియమైన తమ్ముడు భరతుడి లాంటివాడివి అని అన్నారు.

సహస బదన తుమ్హరో జస గావైఁ ౹
అస కహి శ్రీపతి కంఠ లగావైఁ౹౹ .13.

ఆది శేషుడు కూడా తన వేయి తలలతో నిన్ను కీర్తించాడని శ్రీ రాముడు మళ్లీ మళ్లీ ఆలింగనం చేసుకున్నాడు.

సనకాదిక బ్రహ్మాది మునీశా ౹
నారద సారద సహిత అహీశా౹౹ .14.

నువ్వు సనకాదిక-బ్రహ్మాది మునులు నారద సరస్వతి వంటి వారిచే స్తుతించబడ్డావు.

జమ కుబేర దిగపాల జహాఁ తే ౹
కబి కోబిద కహి సకై కహాఁ తే ౹౹ .15.

యముడు, కుబేరుడు మరియు దిక్పాలకులు నీ అంతులేని మహిమలను గానం చేసినప్పుడు కవులు మరియు పండితులు ఇంకా ఏమి స్తుతించ గలరు?

తుమ ఉపకార సుగ్రీవహిఁ కీన్హా ౹
రామ మిలాయ రాజ-పద దీన్హా ౹౹ .16.

నువ్వు సుగ్రీవుడిని-శ్రీ రాముడిని కలిసేలా చేసావు. ఈ కారణంగానే సుగ్రీవుడికి కిష్కింధ యొక్క రాజ్యాధికారం లభించింది.

తుమ్హరో మంత్ర బిభీషన మానా ౹
లంకేశ్వర భయె సబ జగ జానా ౹౹ .17.

విభీషణుడు శ్రీ రాముని పట్ల నీ భక్తిని అనుసరించాడు. దీంతో లంకకు పాలకుడయ్యాడు.

జుగ సహస్ర జోజన పర భానూ ౹
లీల్యో తాహి మధుర ఫల జానూ ౹౹ .18.

నువ్వు ఒకసారి సూర్యుడిని తీయనిపండుగా భావించి మింగడానికి ప్రయత్నించావు.

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీఁ ౹
జలధి లాంఘి గయే అచరజ నాహీఁ ౹౹ .19.

శ్రీ రాముడు పేరుగల ఉంగరాన్ని తీసుకొని నువ్వు సముద్రాన్ని దాటావు.

దుర్గమ కాజ జగత కే జే తే ౹
సుగమ అనుగ్రహ తుమ్హరే తే తే ౹౹ .20.

నీ ఆశీర్వాదంతో కష్టమైన పనులన్నీ సులభంగా సాధించవచ్చు.

రామ దుఆరే తుమ రఖవారే ౹
హోత న ఆజ్ఞా బిను పైసారే ౹౹ .21.

నువ్వు శ్రీ రాముడి రాజభవనం యొక్క ద్వారం వద్ద కాపలాగా ఉంటావు. నీ అనుమతి లేకుండా, ఎవ్వరూ కూడా అక్కడకి ప్రవేశించలేరు.

సబ సుఖ లహహిఁ తుమ్హారీ శరనా ౹
తుమ రక్షక కాహూ కో డర నా ౹౹ .22.

నిన్ను ఆశ్రయించిన వారు సకల సౌఖ్యాలను సాధిస్తారు. వారు దేనికీ భయపడరు.

ఆపన తేజ సమ్హారో ఆపే ౹
తీనో లోక హాఁక తే కాఁపే ౹౹ ..23..

నీ తేజస్సును చూసి మూడు లోకాలూ వణికిపోతాయి.

భూత పిశాచ నికట నహీఁ ఆవై ౹
మహాబీర జబ నామ సునావై ౹౹ .24.

నీ పేరు వింటే దురాత్మలు దగ్గరకు రావడానికి కూడా సాహసించవు.

నాసై రోగ హరై సబ పీరా ౹
జపత నిరంతర హనుమత బీరా ౹౹ .25.

భక్తులు నీ పేరుని స్మరిస్తే, నువ్వు వారి అనారోగ్యాన్ని నయం చేస్తావు.

సంకట తేఁ హనుమాన ఛుడావై ౹
మన క్రమ బచన ధ్యాన జో లావై ౹౹ .26.

మనసుతో, మాటలతో లేదా పనులతో హనుమంతుని స్మరించండి. అతను అన్ని కష్టాలనుండి ఉపశమనం కలిగిస్తాడు.

సబ పర రామ రాయ సిరతాజా ౹
తిన కే కాజ సకల తుమ సాజా ౹౹ .27.

రాజులలో శ్రీ రాముడు గొప్పవాడు. నువ్వు అతని పని అంతా సాధించావు.

ఔర మనోరథ జో కోయి లావై ౹
తాసు అమిత జీవన ఫల పావై ౹౹ .28.

భక్తులు తమ కోరికలతో నీ వద్దకు వస్తారు. నువ్వు వాటన్నింటినీ నెరవేర్చు.

చారిఉ జుగ పరతాప తుమ్హారా ౹
హై పరసిద్ధ జగత ఉజియారా ౹౹ .29.

నీ తేజస్సు నాలుగు యుగాలలో ప్రసిద్ధి చెందినది. ఇది ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది.

సాధు సంత కే తుమ రఖవారే ౹
అసుర నికందన రామ దులారే ౹౹ ..30..

నువ్వు రాక్షసులను నాశనం చేశావు. నీవు ఋషుల యొక్క రక్షకుడవు.

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా ౹
అస బర దీన్హ జానకీ మాతా ౹౹ .31.

నువ్వు ఎనిమిది సిద్ధులను ప్రసాదిస్తావని మరియు తొమ్మిది సంపదలతో ఆశీర్వదిస్తావని, సీతమ్మ నీకు వరం ఇచ్చింది.

రామ రసాయన తుమ్హరే పాసా ౹
సాదర హౌ రఘుపతి కే దాసా ౹౹ .32.

నువ్వు శ్రీ రాముడిని చాలా ప్రేమిస్తావు. నిన్ను నువ్వుగా అతని సేవకునిగా భావిస్తావు.

తుమ్హరే భజన రామ కో పావై ౹
జనమ జనమ కే దుఖ బిసరావై ౹౹ .33.

నిన్ను ప్రార్థించడం వల్ల, శ్రీ రాముడిని పొందవచ్చు. శ్రీ రాముడిని పొందిన తర్వాత, అనేక జన్మల కష్టాలు తొలగి పోతాయి.

అంత కాల రఘుబర పుర జాయీ ౹
జహాం జన్మ హరి భగత కహాయీ ౹౹ .34.

ఎవరైతే నిన్ను ప్రార్థిస్తారో, అతడు శ్రీ రాముడి భక్తుడు అని పిలువబడతాడు. ఆఖరున అతను శ్రీ రాముడి ప్రపంచాన్ని పొందుతాడు.

ఔర దేవతా చిత్త న ధరయీ ౹
హనుమత సేఇ సర్బ సుఖ కరయీ ౹౹ .35.

ఇతర దేవుళ్లను స్మరించకపోయినా, హనుమంతుడిని ప్రార్థిస్తే అన్ని సుఖాలు లభిస్తాయి.

సంకట కటై మిటై సబ పీరా ౹
జో సుమిరై హనుమత బలబీరా ౹౹ .36.

హనుమంతుడిని స్మరించే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. వారి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

జయ జయ జయ హనుమాన గోసాయీఁ ౹
కృపా కరహు గురుదేవ కీ నాయీఁ ౹౹ .37.

హనుమంతునికి జయ్ జయ్ లు. నా పట్ల గురువులా దయ చూపు.

జో శత బార పాఠ కర కోయీ ౹
ఛూటహిం బంది మహా సుఖ హోయీ ౹౹ .38.

హనుమాన్ చాలీసాను వందసార్లు చదివిన వారు అన్ని బంధాల నుండి విముక్తి పొందుతారు. వారు గొప్ప ఆనందాన్ని పొందుతారు.

జో యహ పఢైఁ హనుమాన చాలీసా ౹
హోయ సిద్ధి సాఖీ గౌరీసా ౹౹ .39.

ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివితే విజయం లభిస్తుంది. దీనికి శివుడు వాగ్దానం చేసారు.

తులసీదాస సదా హరి చేరా ౹
కీజై నాథ హృదయ మహఁ డేరా ౹౹ .40.

ఓ హనుమంతుడా, నువ్వు శ్రీ రాముడికి నిత్య సేవ చేస్తావు. దయచేసి నా (తులసీదాస్) హృదయంలో నివసించు.

పవన తనయ సంకట హరన మంగల మూరతి రూప ౹
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప ౹౹

నీవు సమస్త కష్టాలను తొలగించేవాడివి. నువ్వు చాలా మంగళకరమైన వాడివి. దయచేసి శ్రీ రామ లక్ష్మణ సీతమ్మతో పాటు కలిసి నా హృదయంలో నివసించు.

 

Click on the image below to listen to Hanuman Chalisa - Normal chanting - No Music 

 

 Hanuman chalisa Normal Chanting No Music

 

Click on the image below to listen to Hanuman Chalisa - Soorya Gayatri

 

Hanuman chalisa Soorya Gayatri

 

90.1K

Comments Telugu

fq76n
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |