స్త్రీల వ్రత కథలు

strila_vrata_kathalu_pdf_cover_page

ప్రథమ భాగము
1. మోచేటి పద్మము (మూగనోము)

ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక శుద్ధ పూర్ణిమ వరకును
మూడుపూటలు భోజనముచేసి సాయంకాల సమయమున కంఠ స్నానముచేసి
శుచియై తొలియేట తులసివద్ద నాలుగు పద్మములు పెట్టుకొని నాలుగు వత్తుల
దీపము పెట్టుకొని మాట్లాడకుండా
నలుగురు ముత్తయిదువులకు బొట్టుపెట్టి తరువాత
నాలుగు నక్షత్రములను లెక్కపెట్టవలయును. రెండవయేట యెనిమిది పద్మములు
పెట్టి యెనిమిది వత్తులదీపము వెలిగించి యెనమండుగురు ముత్తయిదువులకు
బొట్టుపెట్టి యెనిమిది నక్షత్రములు లెక్కపెట్టవలయును. మూడవయేట పండ్రెండు
పద్మములకు పండ్రెండు వత్తుల దీపమునును పెట్టి పండ్రెండుగురు ముత్తయిదువులకు
బొట్టుపెట్టి పండ్రెండు నక్షత్రములు లెక్క పెట్టవలయును.

దీనికి ఉద్యాపనము :- తొలియేట నాలుగేసి అట్లు నలుగురు ముత్తయిదువు
లకు వాయనమిచ్చి దక్షిణతాంబూలము, నల్లపూసలు, లక్కజోళ్లు ఇయ్యవలెను.
నోము నోచుకున్న వారలకు రెండు చేతుల మీద రెండు అట్లున్ను, రెండు డబ్బులున్నూ,
రెండుకాళ్లమీద రెండు అట్లున్ను, రెండు డబ్బులున్ను వుంచి, అన్నగారు తలుపు
వెనుకనుండి “తిని కుడిచే కాలానకు రాకే పెడసరగండ” అంటే “ఇప్పుడు రానా?
మాపునరానా ఏం? అని అడుగవలయును. అప్పుడు నోముపట్టిన కన్య, “యిప్పుడే
రమ్ము” అనవలయును, అన్న వచ్చి పుస్తకముతో నాలుగు దెబ్బలుకొట్టి నాలుగుఅట్లు,
నాలుగు డబ్బులు తీసికొనవలయును. ఈ (ప్రకారము రెండవయేట యెనిమిది
వాయనములును, మూడవయేట పండ్రెండు వాయనములును ముత్తయిదువులకివయ్యవలెను.

 

మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

 

 

Video - ANNAPURNA DEVI TELUGU BHAKTI SONGS 

 

ANNAPURNA DEVI TELUGU BHAKTI SONGS

 

 

 

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize