యుగం అంటే ఏమిటి

 

యుగం యొక్క అర్థం మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, పురాణాలు మరియు ఇతిహాసాలలో సమయం ఎలాగ లెక్కించబడుతుందో మనం తెలుసుకోవాలి.

కల్పం అంటే ఏమిటి?

విశ్వం ఒకసారి సృష్టించబడినప్పుడు 432 కోట్ల సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ కాలాన్ని కల్పం అంటారు. దీని తరువాత, నైమిత్తిక ప్రళయం సంభవిస్తుంది.

మన్వంతరం అంటే ఏమిటి?

ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి.

 

 

చతుర్యుగం లేదా మహాయుగం అంటే ఏమిటి?

ఒక మన్వంతరంలో 71 చతుర్యుగాలు లేదా మహాయుగాలు ఉంటాయి.

కృతయుగం - త్రేతాయుగం - ద్వాపరయుగం - కలియుగం, ఈ నాలుగింటిని కలిపి చతుర్యుగం అంటారు. కృతయుగాన్ని సత్యయుగమని కూడా అంటారు.

ఒక యుగంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి?

కృతయుగం - 17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం - 12,96,000 సంవత్సరాలు
ద్వాపరయుగం - 8,64,000 సంవత్సరాలు
కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

ఇప్పుడు ఏ యుగం నడుస్తోంది?

ప్రస్తుత కల్పానికి శ్వేతవరాహ కల్పం అని పేరు. ఇందులో 7వ మన్వంతరం జరుగుతోంది. దీని పేరు వైవస్వత మన్వంతరం. ఇందులో 28వ చతుర్యుగం జరుగుతోంది.

ఇందులో ఇప్పుడు క్రీస్తు పూర్వం 3102 లో ప్రారంభమైన కలియుగం నడుస్తోంది. ఇది క్రీస్తు శకం 4,28,899 లో ముగుస్తుంది.

క్రీస్తు శకం 2021 లో విశ్వం ఆవిర్భవించి 1,96,08,53,123 సంవత్సరాలు అయింది.

 

Click below to listen to Bhakta Prahlada Songs In Telugu 

 

Evergreen Devotional Video Songs In Telugu - Bhakta Prahlada Songs In Telugu

 

95.4K

Comments

4Gien
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

Read more comments

మహాభారత కథ ప్రకారం గాంధారికి వంద మంది కొడుకులు ఎలా పుట్టారు?

గాంధారి వ్యాస మహర్షి నుండి వందమంది బలవంతులైన కొడుకుల కోసం వరం కోరింది. వ్యాసుని ఆశీర్వాదం ఆమె గర్భవతికి దారితీసింది, కానీ ఆమె సుదీర్ఘమైన గర్భధారణను ఎదుర్కొంది. కుంతికి కొడుకు పుట్టగానే గాంధారి విసుగు చెంది ఆమె బొడ్డుపై కొట్టింది. ఆమె బొడ్డు నుండి మాంసపు ముద్ద బయటకు వచ్చింది. వ్యాసుడు మళ్ళీ వచ్చి, కొన్ని కర్మలు చేసి, ఒక అద్వితీయమైన ప్రక్రియ ద్వారా, ఆ ముద్దను వంద మంది కొడుకులుగా మరియు ఒక కుమార్తెగా మార్చాడు. ఈ కథ ప్రతీకాత్మకతతో సమృద్ధిగా ఉంది, సహనం, నిరాశ మరియు దైవిక జోక్య శక్తి యొక్క ఇతివృత్తాలను హైలైట్ చేస్తుంది. ఇది మానవ చర్యలు మరియు దైవ సంకల్పం మధ్య పరస్పర చర్యను చూపుతుంది

వేదవ్యాసుని తల్లిదండ్రులు ఎవరు?

పరాశర ఋషి మరియు సత్యవతి.

Quiz

యజ్ఞాలలో "హోత" అనే పురోహితుడు ఏ వేదశాఖకు చెందినవారు?

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |