భీముడు 10,000 ఏనుగుల బలాన్ని ఎలా పెంచుకున్నాడు?

Listen to this article

భీముడు 10,000 ఏనుగులతో సమానమైన శక్తికి ప్రసిద్ధి చెందినవాడు. మరి అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

దుర్యోధనుడు భీమునిపై విషం ప్రయోగించాడు

ఒకమారు పాండవులు మరియు కౌరవులు కలిసి గంగా తీరంలో విహారయాత్రకి వెళ్లేరు. వారు ఆడుకునే చోట అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన ఒక తోట ఉండేది.

పిల్లలు రాజభవనం నుండి తెచ్చిన తినుబండారాలను ఒకరి నోటిలో ఒకరు తినిపించుకున్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముడికి కాలకూటం అనే ప్రాణాంతకమైన విషాన్ని తినిపించేడు.

అప్పుడేం జరిగింది?

తర్వాత అందరూ నీళ్లలో ఆడుకున్నారు. సాయంత్రానికి అందరూ అలసిపోయారు. రాత్రంతా అక్కడే గడపాలని నిశ్చయించుకున్నారు. వారందరూ నిద్రకు ఉపక్రమించగా, భీముడు విషం యొక్క ప్రభావంతో ఆక్రమించబడ్డాడని దుర్యోధనుడు గ్రహించి వాడిని లతలతో కట్టి గంగలోకి తోసేసాడు.

భీముడు 10,000 ఏనుగుల బలాన్ని ఎలా పెంచుకున్నాడు?

అపస్మారక స్థితిలో గంగలో మునిగిపోయిన భీముడు నాగలోకానికి చేరుకున్నాడు. చాలా మంది నాగులు అతన్ని శత్రువుగా భావించి కొరికారు. దుర్యోధనుడు ఇచ్చిన విషానికి నాగుల విషం యాంటీ- వేనమ్‌గా పనిచేసింది.

భీముడు మేల్కొని, తనకు తానే కట్టడాలను విప్పుకుని నాగులను పట్టుకుని, నేలపై పడగొట్టడం ప్రారంభించాడు.

ఈ విషయం తెలుసుకున్న నాగరాజు వాసుకి దిగి వచ్చాడు. ఆర్యక అనే ముసలి నాగుడు భీముడిని తన మనవడికి మనవడిగా గుర్తించాడు.

ఆర్యక తాలుక కుమార్తెకు కుమారుడు కుంతీ తండ్రి అయిన శూరసేనుడు.

వాసుకి భీముడికి చాలా బంగారం మరియు రత్నాలు సమర్పించాడు. నాగలోకంలోని కుండలలోని పాయసం తాగడానికి భీముడిని అనుమతించమని ఆర్యక సూచించాడు, వీటిలో ప్రతి ఒక్క కుండలో పాయసం తాగేవారికి 1,000 ఏనుగుల బలాన్ని ఇస్తాయి.

భీముడు అన్ని కుండల నుండి పాయసం తాగి వాటిని జీర్ణం చేసుకోవడానికి ఏడు రోజులు నిద్రపోయాడు.

ఎనిమిదవ రోజు అతను మేల్కొన్నప్పుడు 10,000 ఏనుగులంత బలవంతుడయ్యాడని, అతన్ని ఎవరూ ఓడించలేరని నాగులు భీముడికి చెప్పారు.


యత్ తే పీతో మహాబాహో రసోఽయం వీర్యసంభృతః.
తస్మాన్నాగాయుతబలో రణేఽధృష్యో భవిష్యసి..

నాగులు అతన్ని వెనక్కి తీసుకొచ్చి అదే తోటలో వదిలేశారు.

రాజభవనానికి తిరిగి వచ్చిన తర్వాత, భీముడు జరిగిన విషయాన్ని అందరికీ చెప్పాడు.

దుర్యోధనుడు భీమునికి మరోసారి కాలకూటాన్ని ఆహారంలో కలిపి విషమిచ్చేందుకు ప్రయత్నించాడు.

ఈసారి, ధృతరాష్ట్రృడి కుమారుడు యుయుత్సుడు అతన్ని హెచ్చరించాడు.

అయినప్పటికీ భీముడు ఆ విషపూరితమైన ఆహారాన్ని తిని జీర్ణం చేసుకున్నాడు. అతనికి ఏమీ జరగలేదు.

(మహాభారతం.ఆదిపర్వం.127 & 128)

Author

అనువాదం : వేదుల జానకి

Audios

1

1

Copyright © 2021 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Active Visitors:
2452446