భారతీయ సంస్కారం

21.6K
1.0K

Comments

qzq6s
చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Read more comments

Knowledge Bank

మంత్రం అర్థం తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యత

మంత్రార్థం మంత్రచైతన్యం యో న జానాతి సాధకః . శతలక్షప్రజప్తోఽపి తస్య మంత్రో న సిధ్యతి - ఎవరైనా మంత్రం యొక్క అర్థం మరియు సారాన్ని తెలియనివారు, మంత్రాన్ని ఒక బిలియన్ సార్లు జపించినా విజయాన్ని సాధించరు. మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం ముఖ్యం. మంత్రం యొక్క సారాన్ని తెలుసుకోవడం కీలకం. ఈ జ్ఞానం లేకుండా, కేవలం జపించడం పనికిరాదు. ఎన్ని సార్లు జపించినా ఫలితాలు రాకపోవచ్చు. విజయానికి అర్థం మరియు అవగాహన అవసరం.

వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా ఎందుకు విభజించాడు?

1.నేర్చుకునే సౌలభ్యం కోసం. 2.యజ్ఞాలలో వాటి అన్వయం ఆధారంగా వేదం విభజించబడింది మరియు సంకలనం చేయబడింది. వేదవ్యాసుడు యజ్ఞాలు చేయడంలో ఉపయోగపడే వేదాలలో కొంత భాగాన్ని మాత్రమే విభజించి సంగ్రహించాడని మీరు గుర్తుంచుకోవాలి. దీనిని యజ్ఞమాత్రికవేదం అంటారు.

Quiz

ఒక సంవత్సరంలో ఎన్ని ఋతువులు ఉంటాయి?

భారతీయ సంస్కారములు ఉపోద్ఘాతము
షోడశ కళాప్రపూర్ణుడు చంద్రుడు
షోడశ సంస్కార సంస్కృతుడు భారతీయుడు.
అనాది అవిచ్ఛిన్న భారతీయ సంస్కృతికి అవతార తత్త్వము, కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, విగ్రహారాధన, వర్ణాశ్రమ వ్యవస్థ, షోడశ సంస్కారములు, మొ పెక్కు అంశములు
మూలస్తంభముల
వంటివి. పై అంశములు ఈ సంస్కృతికి ఒక విలక్షణతను, ఒక విశిష్టతను సంపాదించి పెట్టినవి.
వేద ప్రతిపాదిత కర్మలను చేయుటద్వారా మనస్సు, శరీరాదులందొక అతిశయమేర్పడునని (విశేషము) దానినే సంస్కారమందురని పెద్దల తీర్పు. ఒక వస్తువును ఒక విశిష్ట ప్రయోజనము కొఱకు యోగ్యమగునట్లుగా చేయునది సంస్కారమని, ఇది ఆ పదార్థములోని దోషమును పోగొట్టి, గుణమును కలిగించునదిగా ఉండునని, మనకు కనబడని ఫలములనిచ్చు (ఉదా: స్వర్గాదులు) వైదిక కర్మలను చేయుటకు అర్హతను ప్రసాదించునని మహాత్ముల హెచ్చరిక.

భారతీయ సంస్కారములు
ప్రాణములేని ఇనుప ఖనిజమునకు పెక్కు మార్పులు చేసి వస్తు వులుగా మార్చి, వాడుకొనుచున్నాము కదా! ఇట్లు అచేతన పదార్థములే సంస్కారమును కోరుచుండగా, ప్రాణము లేదా చైతన్యము కలిగిన మనకు సంస్కారముల అవసరము లేదా?
వేష భాషాభూషలు కాల పరిస్థితులకు తగినట్లున్నచో సంస్కార వంతుడని అనుచున్నాము. తన జీవితమునకు, పౌరజీవితమునకు భంగము కల్గించు రీతిలో నున్నచో సంస్కార హీనుడని పిలుచుచున్నాము. వేషభాషలలోనే కాదు, తుదకు మనస్సు కూడ శుద్ధమైనపుడే సంపూర్ణ సంస్కారవంతుడగును.
ఈ సంస్కారము కంటి కగపడునా? ప్రభుత్వ ముద్రయున్నచో తెల్ల కాగితము రూపాయి నోటగుచున్నది. ముద్రలేనిచో వట్టి కాగితమే కదా! మనమనుకొను వ్యక్తి మంత్రి యగుచున్నాడు. ఎన్నికలకు ముందు మనవంటి సామాన్యవ్యక్తియే యాతడు. మంత్రియైన తరువాత మంత్రియని అతని ముఖము పై వ్రాసియుండునా? ఉండదు. ఒక వ్యక్తికి మంత్రిత్వమను సంస్కారమును కల్గించితిమి. అట్లే కొన్ని సంస్కారముల ఫలము ప్రత్యక్షము. ఉదా: పుంసవనము చేసినచో స్త్రీ గర్భములోని శిశువు పురుషునిగా మారును. కొన్ని సంస్కారముల ఫలము అదృష్టము. ఉదా: స్వర్గాదులు, స్వర్గము, మోక్షము కంటికి కనబడవు.
స్త్రీ పురుషుల కలయికవలన ఏర్పడిన జీవునకు ఒక పాపము చుట్టు కొనగా, దానిని పోగొట్టు కొనుటకు ఈ సంస్కారము లేర్పడినవని మహ ర్షులు గుర్తించిరి. ఆత్మకు పుణ్యపాపములు లేవుగాని, అవిద్యతో కూడిన జీవునకు కలవు. ఆ సంస్కారముల సంఖ్య పదునారు. గర్భాధానము
మొదలగునవి.
గర్భాధానమువలన బీజగర్భదోషములు పోవునని; ఆ వెనుక స్త్రీ గర్భము నందున్న శిశువు పురుషునిగా మారవలెననిన పుంసవనము చేయవలెనని, తల్లికడుపులోనున్న ఆ శిశువు తల్లి తిను ఆహారమును
ఉపోద్ఘాతము
తానుకూడ స్వీకరించును కనుక, దాని దోషమును పోగొట్టుకొనుటకు జాతకర్మ అను సంస్కారమును చేయవలెనని, నామకరణము వలన ఆయు ర్దాయము, తేజస్సు మొదలగునవి లభించునని, నిష్క్రమణము వలన మంత్ర పూర్వకముగా సూర్యనారాయణమూర్తిని దర్శించి ఆయుస్సు, సౌభాగ్యము పొందునని, అన్నప్రాశన సంస్కారము వలన మాతృ గర్భములోనున్న మలాదులను తినుటవలన వచ్చు దోషము పోవునని, ఉపనయనము వలన వేదమును చదువు అర్హత, బ్రహ్మజ్ఞానమును పొందు అర్హత సిద్ధించునని; వివాహము వలన భార్యతో సమస్త వైదిక క్రియలు చేయుటద్వారా స్వర్గప్రా ప్తియని, మంచి సంతానము కల్గి ఇహపరలోక సౌఖ్యములను పొందవచ్చని మనువు ఘోషించినాడు. చనిపోయిన తరువాత చేయు కర్మలవలన జీవునకు ఉత్తమలోకములు ప్రాప్తించునని శాస్త్రములు భాషించుచున్నవి.
యజ్ఞములు, పంచమహాయజ్ఞములు చేయుటద్వారా ఈ శరీరము బ్రహ్మ శరీరముగా మారునని స్మృతికర్త లుద్ఘాటించియున్నారు. గర్భాధా నము మొదలగు బ్రాహ్మసంస్కారముల వలన ఋషి, స్థితిని పొందుచున్నా డని, యజ్ఞాదులైన దైవసంస్కారములవలన దేవతాస్థితిని అనగా సాలోక్య, సామీప్య, సాయుజ్యములను పొందుచున్నాడని స్మృతికర్తలు చాటినారు.
సంస్కారములవలన సంస్కరింపబడి, ఆత్మగుణములు (దయ, ఓర్పు, మొ) కలిగినవారు బ్రహ్మలోకమును చేరి బ్రహ్మపదమును పొందుదురని గౌతమాదులు నిర్ధారించినారు.
అంగిరసుడు, ఈ సంస్కారములను ఒక చిత్రకర్మతో పోల్చినాడు. భిన్న మైన రంగులవలన ఒక చక్కని ఆకార మేర్పడునటుల ఈ సంస్కారముల వలన ఒక ఉత్తమస్థితి కల్గునని పోల్చినాడు.
పక్షికి రెండు రెక్కలున్నటుల జీవుడున్నతిని పొందవలెననిన జ్ఞాన కర్మములు రెండును ఉండవలెనని యోగవాసిష్ఠము వాకొనుచున్నది. కర్మలు చేయుటద్వారా చిత్తశుద్ధిని పొంది ఆత్మజ్ఞానమును బడయుటయే సర్వభారతీయ వాఙ్మయ లక్ష్యము. కొందరు జ్ఞానమార్గమును, కొందరు
భారతీయ సంస్కారములు
కర్మమార్గమును సమర్థింపగా ఈ రెంటిమార్గములను సమన్వయించి ఒక సేతువును కట్టుటయే ఈ సంస్కారప్రయోజనము.
సంస్కారములనిన వట్టి కర్మకాండయని భ్రమింపరాదు. అనేక నైతిక సూత్రములు ముడివడి యున్నవి. ఆ సూత్రములను పాటించుట ద్వారా వ్యక్తి వికాసముతో బాటు, సమాజశ్రేయస్సు కూడ సిద్ధించుచున్నది. పై ఆత్మగుణములు లేనివాడు బ్రహ్మసాన్నిధ్యమును పొందలేడను గౌతముని మాటలు మరియొకసారి స్మరింపతగినవి.
ఇందు ధనమును, ఆయుర్దాయమును, శక్తిని, బుద్ధిని ప్రసాదింపుడని దేవతలను ప్రార్థించుట, దుష్టశక్తులు దూరముగా తొలగవలెనను ప్రార్థనలు లెక్కకు మిక్కిలి.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Telugu Topics

Telugu Topics

ఆధ్యాత్మిక పుస్తకాలు

Click on any topic to open

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |