విద్య గురుముఖతః నేర్చుకోవాలి
ఈ కథ అరణ్యపర్వంలో ఉంది
పూర్వం భరద్వాజుడని మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణస్నేహి తుడు రైభ్యుడు. వారిరువురూ, సూర్యోదయానికి ముందుగానే లేచి కాల కృత్యాలు ముగించి, నదీస్నానంచేసి, నిర్మలచిత్తంతో వరబ్రహ్మధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవారు. అలా ఉండగా వారిలో భరద్వాజునికి యవక్రీశుడనే కుమారుడు కలిగాడు.
రైభ్యునికి అర్వావసువు, పరావసువు అని యిద్దరు కుమారులు పుట్టారు. వారు పెరిగి పెద్దవా రయ్యారు.
భరద్వాజుడు ఎప్పుడూ ధ్యానసమాధిలో ఉండి కుమారుని విద్యా విషయాలు పట్టించుకోలేదు.
రైభ్యుడు తన కుమారు లిద్దరినీ విద్వాంసులుగా తీర్చి దిద్దు కున్నాడు.
వారుభయులూ వివిధప్రాంతాలలో పర్యటించి తను విద్యతో అందరి ప్రశంసలు పొందుతున్నారు.
ఇదిచూసిన యవక్రీతునికి విచారం కలిగి వారివలె తానుకూడా విద్యావంతుడై విశేషఖ్యాతి సంపాదించాలనుకున్నాడు.
అదే ఊహతో తపస్సు ప్రారంభించాడు. యవక్రీతుని తీవ్రనిష్ఠను గ్రహించి దేవేంద్రుడు వచ్చి:
స్వామీ! విద్య అనేది గురుముఖతః అధ్యయనం చెయ్యకు తప్పదు. అప్పుడుకాని వేద వేదాంగ విజ్ఞానంతో మనస్సు పరిపక్వం కాదు. ఈ ప్రయత్నంమాని ఉత్తమగురువును ఆశ్రయించు అన్నాడు. ఆ మాట యవక్రీతునికి నచ్చలేదు. తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఉచిత రీతిని వీనికి ఉపదేశించాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణవేషంలో వచ్చి గుప్పిడితో యిపక తీసి నదిలో పోస్తున్నాడు. యవక్రీశుడు నదీ స్నానా నికి వచ్చి ఏమిటీ వని? ఎందుకు చేస్తున్నావు? అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ :
ఈ నదికి అడ్డంగా గోడ కడుతున్నాను అన్నాడు.
యవక్రీతుడు నవ్వి :
ఇంతటి నదికి గుప్పెడు గుప్పెడు యిపకతో గోడకట్టటం యీ జీవితంలో సాధ్యమా ! అన్నాడు.
అప్పుడావృద్ధుడు —
నాయనా! గురుశుశూషలేకుండా వేదవిద్య అంతా నేర్చుకోవా అనుకోవడం కంటె నేను చేసేది అవివేకంకాదు.
అని జవాబిచ్చాడు.
ఓహో సురవతీ ! మీరు ఎలా అయినాసరే నాకు వేదవిద్య అనుగ్ర హించి విశేషఖ్యాతి కలిగించాలి అని ప్రార్థించాడు.
ఎన్ని చెప్పినా ప్రయోజనంలేదని ఇంద్రుడు అనుగ్రహించాడు. యవక్రీతుడు సర్వవేదశాస్త్ర విద్యా విదుడయ్యాడు. మరుక్షణంలో తపోదీక్షవిడిచి తండ్రిదగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు. అప్పుడు భరద్వాజుడు నాయనా ఈ విధంగా విద్యసాధించడం వల్ల అది అహంకారం కలిగిస్తుంది. అహంకారం ఆత్మనాశవకారణం,
ఇంత చిన్నవయస్సులో తీవ్రతపస్సుచేసి వరాలు పొందడం మరింత అహంకార హేతు వవుతుంది. అయినా ఒక మాట విను.
నువ్వు ఎప్పుడూ రైభ్యుని ఆశ్రమ పరిసరాలకు వెళ్ళబోతు. ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు అన్నాడు. యవక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించాడు. అలా ఉండగా ఒకనాడు అది వసంతమాసం. అరణ్య మంతా పూలవాసనలతో, ప్రకృతి అంతా వరమరమణీయంగా, జిల్లాన
కరంగా ఉంది.
అటువంటి సమయంలో యవక్రీతుడు రైభ్యుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనుపించింది. యవక్రీతుని మనను బెదిరింది. ఇంద్రియాలు వశం తప్పిపోగా ఆ యిల్లాలిని బలాత్కరించి భోగించి వెళ్ళిపోయాడు.
ఆ, శ్రమానికి పచ్చిన మహాముని ఆ కథవిని తీవ్రక్రోధంతో తన శిరస్సు నుండి రెండు జటలుతీసి హోమంచేసి ఒక సుందరాంగినీ, ఒక రాక్షసునీ సృష్టించాడు. వారిద్దరూ మహర్షి ఆదేశం ప్రకారం యవక్రీతుని పించారు.
ఆ సుందరీమణి తన కోరచూపుతో చిరునవ్వుతో లావణ్యదేహప్రదర్శ నతో వక్రీతుని లొంగదీసి, వాని చేతిలోని పవిత్ర జలపూర్ణమైన కమండలువు తీసుకు వెళ్ళిపోయింది.
అంతతో వానిశక్తి నశించగా ఆ రాక్షసుడు తన శూలంతో యవ క్రీతుని తరిమి పొడవబోయాడు.
సరిగా భరద్వాజుని ఆశ్రమద్వారందగ్గరే వానిని సంహరించాడు.
అదిచూచి భరద్వాజుడు: నాయనా! అనాయాసంగా లభించిన విద్య ఇటువంటి అనర్థాలే తెస్తుందని చెప్పినా విన్నావుకావు.
అని గోలు గోలున విలపించి, ఆ తీవ్రవేదనలో రైభ్యుని శపించి, తానుకూడా అగ్ని సోదూకి ప్రాణత్యాగం చేశాడు. శాపగ్రస్తుడైన రైభ్యుడు ఆయన కుమారుని చేతులలోనే మరణించాడు.
అప్పుడు అర్వావసువు సూర్యుని ఉపాసించి తన తండ్రినీ, భరద్వాజ, యవక్రీతులనూ బ్రతికించాడు.
పునరుజ్జీవితుడైన యవక్రీతుడు, తన ఎదురుగా ఉన్న దేవతలను ఉద్దేశించి: నేనుకూడా ఈ రైభ్యునివలెనే తపస్సు చేసి, వేదవేత్త నయ్యామకదా అయినా ఈ మన నాకంటే గొప్పవాడెలా అయ్యాడు?
అనగావారు:
నాయనా! ఆయన గురు తుశ్రూషల్లేశాలతో వేదవిద్యను సాధిం చాడు. కనుక అంత శక్తిశాలి అయ్యాడు. అది లేకుండా నువ్వు సాధిం చావు. ఆ శక్తి నీకు రాదు. విద్య గురుముఖతః నేర్చుకోవాలి నాయనా ! అనివారువెళ్ళారు.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |