శివుని ఆరాధనలో బిల్వ పత్రం యొక్క ప్రాముఖ్యత సాధారణంగా తెలుసు. ఈ వ్యాసంలో, మనం బిల్వానికి సంబంధించిన దివ్యమైన అంశాలను పరిశీలిద్దాం.
Aegle marmelos
Click below to listen to BILVASHTAKAM WITH TELUGU LYRICS
బిల్వ వృక్షం యొక్క ఉత్పత్తి యజుర్వేదంలో చెప్పబడింది: ఒకమారు సూర్యుడు ప్రకాశించడం మానేశాడు. దేవతలు ఒక యాగం చేసి, సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. అతను మళ్లీ ప్రకాశించడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే బిల్వ వృక్షం ఉత్పన్నం అయింది.
యజ్ఞంలో బిల్వ వృక్షాన్ని యూపగా ఉపయోగిస్తే, యజమాని తాలుక వైభవం పెరుగుతుంది.
శతపథ బ్రాహ్మణం ప్రకారం ప్రజాపతి మజ్జ నుండి బిల్వం ఉనికిలోకి వచ్చింది.
వేదాలు బిల్వాన్ని బ్రహ్మవర్చస్సు సముపార్జనకు అనుసంధానిస్తున్నాయి. యాగంలో బిల్వాన్ని ఉపయోగించడం వల్ల ఆహారం, శ్రేయస్సు, శక్తి మరియు సంతానం సమృద్ధిగా లభిస్తాయి.
అథర్వవేదం బిల్వాన్ని ఇలా వర్ణిస్తుంది: మహాన్ వై భద్రో బిల్వః- అంటే బిల్వం మంచిది మరియు గొప్పది అని.
యాగం కొరకు పనిముట్లు మరియు పాత్రల తయారీకి బిల్వాన్ని ఉపయోగిస్తారు.
బిల్వం ఒక యాగ-వృక్షం మరియు యజ్ఞాల కోసం పాత్రలు మరియు పనిముట్లు తయారీకి విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
ఈ ప్రయోజనం కోసం ఉపయోగించే ఇతర చెట్లు: అశ్వత్థ (Ficus religiosa), ఉదుంబర (Ficus glomerata), కార్శ్మర్యా (Gmelina arborea), ఖాదిర (Acacia catechu), పలాశ (Butea frondosa), వైకంకత (Flacourtia sapida), మరియు శమీ (Prosopis spicigera).
బిల్వాన్ని యుప, దండ మరియు శుక్ర-పాత్రల తయారీకి కూడా ఉపయోగిస్తారు. వాటిని పరిధీలుగానూ, అగ్నిని ఆర్పడానికి సామిధేనీ కర్రలుగానూ ఉపయోగిస్తారు.
అనేక ఆచారాలలో, అన్నం వండడానికి బిల్వ పండు ఆకారంలో పాత్రను తయారు చేస్తారు. బిల్వానికి సంబంధించిన దివ్య గుణాలు అన్నంలోకి ఇమిడిపోతాయని నమ్మకం.
శ్రీఫలకృచ్ఛ్ర అనే ఒక వ్రతంలో, వ్రతాన్ని ఆచరించేవాడు బిల్వ వృక్షం క్రింద కూర్చుని లక్ష్మీదేవిని పూజిస్తాడు. ఈ ప్రక్రియలో ఆ చెట్టు కిందే నిద్రిస్తూ, బిల్వ ఫలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు.
రక్షిత తాయెత్తులను తయారు చేయడానికి కూడా బిల్వాన్ని ఉపయోగిస్తారు.
బిల్వం ఎంత గొప్పదంటే, దాని గురించి విశేషంగా ఒక ఉపనిషత్తు ఉంది.
బిల్వోపనిషత్తులో, శివుడు స్వయంగా వామదేవ ఋషికి బిల్వం యొక్క గొప్పతనం గురించి బోధించాడు.
బిల్వం యొక్క ఎడమ ఆకుపై బ్రహ్మ, కుడివైపు ఆకుపై విష్ణువు మరియు మధ్య ఆకుపై శివుడు ఉంటారు. ఇతర దేవతలందరూ బిల్వ ఆకు యొక్క కొమ్మపై ఉంటారు.
ఒకే కొమ్మకు అనుసంధానించబడిన మూడు ఆకులు ఈ వాస్తవాన్ని సూచిస్తాయి:
1. త్రిమూర్తులు ఒకే పరమ సత్యం యొక్క విభిన్న అంశాలని
2. సత్వ, రజస్సు మరియు తమో గుణాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయని.
3. ఇచ్ఛా-శక్తి, జ్ఞాన-శక్తి మరియు క్రియా-శక్తి పరస్పర సంబంధం కలిగి ఉంటాయని
బిల్వ పత్రం వెనుక భాగంలో అమృతం ఉంటుంది. కాబట్టి, శివునికి బిల్వ పత్రంతో అర్చన చేసేటప్పుడు, ఆకు పైకి ఎదురుగా ఉండాలి. వెనుకభాగం లింగం/విగ్రహాన్ని తాకాలి.
బిల్వం సమర్పించకుండా తన పూజ అసంపూర్తి అవుతుందని శివుడు చెప్పాడు. బిల్వ పత్రంతో పూజించడం వల్ల సుఖ-సౌఖ్యాలు, మోక్షాలు లభిస్తాయి మరియు అన్ని పాపాల నుండి కూడా విముక్తి కలుగుతుంది.
శివుడిని బిల్వ పత్రంతో పూజించడం వల్ల తీర్థయాత్రలు, దానం, తపస్సు, యోగ, వేదాభ్యాసం చేసినంత ఫలితాలు లభిస్తాయి.
బిల్వ వృక్షం మీద లక్ష్మీదేవి నివసిస్తుంది బిల్వ ఫలాన్ని శ్రీ ఫలం అంటారు.
శ్రీ సూక్తంలో వర్ణించబడింది : తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు.
బిల్వ ఫలాలకు ఆటంకాలను తొలగించే శక్తి ఉంది.
బిల్వ ఫలాలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు హోమం చేస్తారు.
ప్రణవగాయత్రి
ఓంకారాయ విద్మహే భవతారాయ ధీమహి . తన్నః ప్రణవః ప్రచోదయాత్ ....
Click here to know more..చెడు శకునాల యొక్క దుష్ప్రభావాల తొలగింపు కోసం మంత్రం
చెడు శకునాల యొక్క దుష్ప్రభావాల తొలగింపు కోసం మంత్రం....
Click here to know more..నవగ్రహ స్తుతి
భాస్వాన్ మే భాసయేత్ తత్త్వం చంద్రశ్చాహ్లాదకృద్భవేత్. మ....
Click here to know more..అనువాదం : వేదుల జానకి
Please wait while the audio list loads..
Ganapathy
Shiva
Hanuman
Devi
Vishnu Sahasranama
Mahabharatam
Practical Wisdom
Yoga Vasishta
Vedas
Rituals
Rare Topics
Devi Mahatmyam
Glory of Venkatesha
Shani Mahatmya
Story of Sri Yantra
Rudram Explained
Atharva Sheersha
Sri Suktam
Kathopanishad
Ramayana
Mystique
Mantra Shastra
Bharat Matha
Bhagavatam
Astrology
Temples
Spiritual books
Purana Stories
Festivals
Sages and Saints